Home News స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

0
SHARE

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు విధించిన బహిష్కరణ ఉత్తర్వులను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఆగస్ట్ 14 నాడు ఎత్తివేసిన తరువాత నేడు (4 సెప్టెంబర్ ) స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ నలుమూలల నుండి వేల సంఖ్యలో వచ్చిన స్వామి జి భక్తులు, అనుచరులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు అపూర్వ ఘనస్వాగతం పలికారు.

55 రోజుల తర్వాత స్వామి పరిపూర్ణానంద తిరిగి తెలంగాణలో అడుగుపెట్టారు. కాకినాడ నుండి బయలు దేరిన స్వామి మార్గ మద్యలో విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్ నగరానికి బయల్దేరారు. తెలంగాణలో ప్రవేశించిన తరువాత కోదాడ, సూర్యాపేట రహదార్లలో ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. హైదరాబాద్ లో హయత్ నగర్, ఎల్ బి నగర్ వీదులలో ప్రజలు ర్యాలి రూపంలో స్వాగతం పలికారు.

స్వామి పరిపూర్ణానంద పై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను ఎత్తివేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఆగస్ట్ 14 నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం…తెలంగాణ పోలీసులు, అధికారులు వ్యవహారంచిన తీరు… స్వామిజీపై విధించిన నిర్భంధం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొంది..!

తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980. U/S 3 ప్రకారం స్వామి పరిపూర్ణానందని అలా ఎలా బహిష్కరణకు గురిచేస్తారని ప్రశ్నించింది..! సెక్షన్ 3 ని అనుసరించి గూండాలు-సంఘవిద్రోహశక్తులకు మాత్రమే నగర బహిష్కరణ విధిస్తారని…, ఈ సెక్షన్ ప్రకారం బహిష్కరణ వేటు కేవలం గూండాలకు మాత్రమే వర్తిస్తుందని, చట్టంలోని నిబంధనలే చెబుతున్నాయని గుర్తు చేసింది..! అంతేకాదు గూండాకు నిర్వచనం ఏమిటో మొదట తెలుసుకోవాలని కూడా చెప్పింది..! సంఘ విద్రోహచర్యలకు పాల్పడుతూ… రెండుసార్లు శిక్షకు గురైన వారికి మాత్రమే నగర బహిష్కరణ విధిస్తారని…, స్వామి పై హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక్క కేసు కూడా లేదని…, అలాంటప్పుడు వారిని ఎలా బహిష్కరించడం అంటే…భారత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛా హక్కును హరించడమే! ఇది స్వామిజీ ప్రాథమిక హక్కునకు భంగం కలిగించడమేనని తెలిపింది. అంతేకాదు అభియోగాలతో బహిష్కరణ వేటు వేసే ముందు కనీసం స్వామిజీని వివరణ ఇచ్చే అవకాశం కానీ, నోటీసులు కానీ ఇవ్వలేదు..! ఇది పూర్తిగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్వామీజీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.!

ఇంతకు పూర్వం స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ హిందూ సంస్తలు ప్రధానంగా హిందూ ఐక్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ అధ్వర్యంలో జూలై  నెలలో వివిధ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. దాంతో పాటు జిల్లా కేంద్రాలలో కలక్టరేట్ ల ముట్టడి కార్యక్రమం సైతం నిర్వహించారు.