Home News ఈవీఎం పరికరాల హ్యాకింగ్ సాధ్యం కాదు – ఈ.సీ.ఐ.ఎల్ మాజీ సీఎండీ సుధాకర్

ఈవీఎం పరికరాల హ్యాకింగ్ సాధ్యం కాదు – ఈ.సీ.ఐ.ఎల్ మాజీ సీఎండీ సుధాకర్

0
SHARE
ఈవీఎం పరికరాలను టాంపరింగ్, హ్యాక్ చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదనీ, వాటిలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేరులో మార్పులు చేయడం అసాధ్యం అని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి పి. సుధాకర్ స్పష్టం చేశారు. ఈవీఎం పరికరాన్ని తెరచి చూసేందుకు ప్రయత్నిస్తే వాటంతట అది పనిచేయడం ఆగిపోతుందని, ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే వాటికవే సరిచేసుకుంటాయని ఆయన వివరించారు.

మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం మెకాస్టర్ ఆడిటోరియంలో
‘ద ఇనిస్టిటూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజినీర్స్’ (IETE) హైదరాబాద్ విభాగం ఆధ్వ్యర్యంలో ఏర్పాటు చేసిన “ఎలక్ట్రాన్ వోటింగ్ మెషిన్స్ ఇన్ ది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ” (ప్రజాస్వామ్య వేడుకలో ఈవీఎంల పాత్ర) అనే అంశంపై ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలు భారత్ కొరకు, భారత్ చేత, భారత్ కోసమే తాయారు చేసామని, రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అధికారికంగా ఈవీఎం పరికరాలను తయారు చేస్తున్నాయని తెలిపారు. బయటి నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాలతో అనుసంధానం చేసి ఫలితాలను తారుమారు చేయడం కుదరని పని అని ఆయన అన్నారు.
బ్యాలట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం అయినందున 1977 సంవత్సరంలో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.ఎల్.శఖ్ ధర్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈవీఎంలను తయారు చేసే బాధ్యతను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) సంస్థకు అప్పగించారని, మూడేళ్ళు కష్టపడి ఈవీఎంలను తయారు చేసారు అని సుధాకర్ వివరించారు.
మొట్టమొదట 1980 దశకంలో ప్రొటోటైప్ ఈవీఎంలను రాజకీయ పార్టీల ముందు ప్రదర్శించారు. 1982 సంవత్సరంలో కేరళలోని నార్త్ పారూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50 పోలింగ్ కేంద్రాల్లో ఈ పరికరాలను వినియోగించారు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళారు. 1988లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఈవీఎంల వాడకాన్ని చేర్చారు. 2000 నుండి వీటిని అన్ని ఎన్నికలలో వాడుతున్నారని, ఇప్పటివరకూ అంటే (2018) మూడు లోక్ సభ, 113 అసెంబ్లీ ఎన్నికలలో ఈవీమ్ లను ఉపయోగించారని సుధాకర్ తెలియజేసారు.
కార్యక్రమం అనంతరం పి. సుధాకర్ మీడియా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సదస్సులో గౌరవ అతిధి గా ‘ద ఇనిస్టిటూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజినీర్స్’ డైరెక్టర్ డా. టి.హనుమాన్ చౌదరి, ఐ.ఈ.
టీ.ఈ హైదరాబాద్ విభాగం ప్రతినిధులు ఎ.రవికుమార్, రాజేష్ కుమార్, ఐ.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.