Home News వివాదాస్పద మత గురువు కరోనాతో మృతి

వివాదాస్పద మత గురువు కరోనాతో మృతి

0
SHARE
•     మృతుడిపై గతంలో అనేక ఉగ్రవాద కేసులు  
• లాక్-డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న రెండు వేల మంది

వివాదాస్పద మత గురువు, వహదత్-ఇ-ఇస్లామి వ్యవస్థాపక అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ నజీరుద్దీన్(70) కరోనాతో శనివారం ఉదయం సైదాబాద్ లోని తన నివాసంలో మృతి చెందారు.  అతని అంత్యక్రియలని హజరత్ ఉజాలే షా ఇద్ జా మైదానంలో నిర్వహించారు. అంత్యక్రియల్లో సుమారు 2000 మందికి పైగా పాల్గొన్నారు. ఓ వైపు నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా, కరొనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో ఓ సంఖ్యకు మించి జనం పాల్గొనరాదన్న ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ సుమారు రెండు వేల మంది పైగా అంత్యక్రియల్లో పాల్గొనడం గమనార్హం.

వారం రోజులుగా  జ్వరం, నిమోనియాతో బాధపడుతున్న నసీరుద్దీన్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. వీరి కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది.

సైదాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అంత్యక్రియల్లో తక్కువ మంది పాల్గొనేలా చూడాలని కుటుంబ సభ్యులు కు సూచించినప్పటికీ వారు పాటించలేదని తెలిపారు.  పైగా ఇతర వైద్య పరీక్షా కేంద్రంలో అతనికి కరోనా నెగిటివ్ వచ్చిందిని దానికనుగుణంగానే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారని  ఇన్స్పెక్టర్ తెలిపారు.

వైద్య సిబ్బంది,  డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో శానిటేషన్ చేయించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.

వృత్తిరీత్యా పంపు మెకానిక్ అయిన మౌలానా మొదట జమాతే ఇస్లామీ హింద్ లో కీలక సభ్యుడుగా ఉండేవాడు. అనంతరం తాహ్రిక్ – తహాపుజ్ – ఏ – శూయర్ – ఇ – ఇస్లాం అనే సంస్థను స్థాపించాడు. సైదాబాద్ ప్రాంతంలో ఇస్లామిక్ విద్యాసంస్థలు, మదర్సా జమైత్ ఉల్ బానాత్ ను స్థాపించాడు.

అతనికి భార్య ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు. అందులో ఇద్దరు కుమారులు ముకిముద్దిన్ యాసిర్, బాలిగుద్దిన్ యసిర్ లకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. మరో కొడుకు రజియుద్దిన్ నాసిర్ అహ్మదాబాద్ బాంబు పేలుడు కేసులో ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. మౌలానా పై ఇప్పటికీ ఆరు కేసులు ఉన్నాయి. వివాదాస్పద బాబర్ కట్టడం నేలమట్టం ఘటనకు నిరసనగా 1993లో అబిడ్స్ సర్కిల్ లో నమాజ్ సమయంలో నజీరుద్దీన్ వెలుగులోకి వచ్చాడు.

ఇటీవల జనవరిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసనల్లో పాల్గొన్న నజీరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఆర్.డి.ఎక్స్ పేలుడు పదార్థాలు రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ కి చెందిన సలీం జునైద్ తో మౌలానాకు సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతనిని  పోలీసులు పట్టుకున్నారు.

2004లో అప్పటి గుజరాత్ హోంమంత్రి హారెన్ పాండ్య హత్యకు కుట్రపన్నిన కేసులో మౌలానా నజీరుద్దీన్ ను ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా) కింద గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.ఆ అరెస్టుకు నిరసనగా లక్డీకాపూల్లోని డిజిపి  కార్యాలయం ముందు మౌలానా అనుచరులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అతని అనుచరుడైన ముజాహి్దీన్ సలీంను పోలీసులు కాల్చి చంపారు. అయితే మౌలానాను అహ్మదాబాద్‌లోని స్పెషల్ పోటా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

గుజరాత్‌కు తరలించేటప్పుడు డిజిపి కార్యాలయానికి సమీపంలో ఉన్న పోలీసు బృందంపై దాడి చేసిన కేసులో అతడు పరారీలో ఉన్నట్లు చూపబడింది.

సికింద్రాబాదులోని సిద్ధి వినాయక ఆలయం పేల్చడానికి కుట్ర విషయంలో నజీరుద్దీన్ పై కేసు నమోదైంది. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో ఇప్పటికి కేసు విచారణలో ఉంది.

Source: Times of India