Home News చర్చ్ ఆఫ్ సౌత్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

చర్చ్ ఆఫ్ సౌత్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

0
SHARE
నకిలీ ధ్రువపత్రాల సృష్టించి తమదికాని  భూమిని రూ.60 కోట్లకు ఇండియన్ రైల్వే కు అక్రమంగా అమ్మేసింది భారత్ లోనే రెండవ అతిపెద్ద చర్చ్”చర్చ్ ఆఫ్ సౌత్”. ఈ అక్రమం బయటపడడంతో చర్చ్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
సి.ఎస్.ఐ చర్చ్, ఇండియన్ రైల్వే కు అమ్మిన భూమి తాలూకు ధృవ పత్రాలను పరిశీలిస్తే చర్చికి ఎటువంటి సంబంధం లేదని  తేలింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా సీఎస్ఐ చర్చ్ కి  రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడి) దర్యాప్తులో తేలింది. ఈ మేరకు
అక్రమ భూమి కేటాయింపు కేసు విషయంలో బెంగుళూరు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ (సీఎస్ఐటీఏ) దగ్గర ఉన్న  రూ.59.52 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను “ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002” కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ జప్తు చేసింది.
సీఎస్ఐ చర్చ్ కు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు విరాళాల రూపంలో రావడంతో ఒక్క దక్షిణ భారత దేశంలోని దాదాపు 5,000 మిషనరీ స్కూళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది.