Home News జ‌మ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో ఎవ‌రైనా భూముల కొన‌వ‌చ్చు

జ‌మ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో ఎవ‌రైనా భూముల కొన‌వ‌చ్చు

0
SHARE

        జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. జమ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేయ‌డానికి మార్గం సుగ‌మం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించి స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించింది. వ్యవసాయ భూమిని సాగు చేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి వ్యవసాయ భూములను సాగు చేయని వారు కూడా కొనుగోలు చేయవచ్చని మినహాయింపునిచ్చారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన దాదాపు ఏడాది తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గతంలో కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం వల్ల బయటి వ్యక్తులు ఎవరూ అక్కడి భూములను కొనుగోలు చేయడానికి వీలు ఉండేది కాదు. తాజా నిర్ణయంతో బయటి వ్యక్తులు జమ్ముకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)లో పెద్దఎత్తున భూముల కొనుగోళ్లు జరిపే అవకాశమున్నదని మాజీ అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇషాక్‌ ఖాద్రీ తెలిపారు.