Home News తెలంగాణ బడ్జెట్ 2017-18

తెలంగాణ బడ్జెట్ 2017-18

0
SHARE

తెలంగాణ బడ్జెట్ 2017-18ని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకువచ్చారు. సబ్‌ప్లాన్ల స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు.

-రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు

-ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు

-నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు

-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు

 

-గతేడాది వాహనాల పన్ను ఆదాయం రూ. 2899 కోట్ల అంచనా

-గతేడాది వాహనాల పన్ను రూపంలో వసూలైన ఆదాయం రూ. 2,585 కోట్లు

-ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం రూ. 3000 కోట్లు

-ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా రూ. 36,237 కోట్లు

 

-ఇతర మార్గాల్లో సమకూర్చుకోనున్న కొత్త అప్పులు రూ. 26,400 కోట్లు

-కేంద్రప్రభుత్వ రుణరూపంలో రూ. 1000 కోట్లు

-తలసరి అప్పు రూ. 40,149 కోట్లు

-మొత్తం రాష్ర్ట అప్పు రూ. 1,40,523 కోట్లు

-2016-17లో రాష్ర్ట అప్పు రూ. 1,14,813 కోట్లు

-రాష్ర్ట స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51

 

 

-ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం

-అన్ని ప్రభుత్వాసుపత్రులకు నేరుగా నిధులు అందిస్తున్నాం

-ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు నిధులు రెట్టింపు చేశాం

-మరో 3 మల్లీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నాం

 

-ఓయూ సెంటినరీ ఉత్సవాలకు రూ. 200 కోట్లు

-విదేశాల్లో పేద విద్యార్థుల చదువు కోసం రూ. 20 లక్షలు ఇస్తున్నాం

-పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ. 12,500లకు పెంచాం

-అంగన్ వాడీ టీచర్లకు వేతనం 10,500లకు పెంచాం

-అంగన్ వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం

 

-గతేడాది అమ్మకం పన్ను అంచనాల్లో భారీగా తగ్గుదల

-అమ్మకం పన్ను అంచనాల్లో రూ. 6 వేల కోట్లకు తగ్గుదల

-గతేడాది అమ్మకం పన్నుల లక్ష్యం రూ. 42,073 కోట్ల అంచనా

-గతేడాది అమ్మకం పన్ను వసూళ్లు రూ. 37,439 కోట్లు

-గతేడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం రూ. 4,291 కోట్లు

-రిజిస్ర్టేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4041 కోట్లు

-ఈ ఏడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం తగ్గింపు, రూ. 3 వేల కోట్ల అంచనా

-గతేడాది ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 5083 కోట్లు

-ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం అంచనా రూ. 8,999 కోట్లు

 

-వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తాం

-75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ

-మూసీ ప్రక్షాళనకు రూ. 350 కోట్లు

 

-కేసీఆర్ కిట్ కోసం రూ. 605 కోట్లు కేటాయింపు

-శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్

-ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తాం

-డిశ్చార్జి అయిన వెంబడే రూ. 4వేలు

-శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేలు

-మొత్తంగా మూడు విడతల్లో రూ. 12 వేలు ఇస్తాం

-ఆడబిడ్డ పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తాం

 

-వ్యవసాయ రంగానికి రూ. 5,942 కోట్లు

-నీటిపారుదల రంగానికి రూ. 23,675 కోట్లు

-రజక, నాయిబ్రహ్ముణులకు రూ. 500 కోట్లు

-ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు

-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అర్హులకు రూ. 51 వేల నుంచి రూ. 75,116కు పెంపు

 

-మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు

-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు

-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు

-ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు

-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు

-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు

-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు

-చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు

 

-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు

-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు

-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు

 

-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు

-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు

-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు

-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు

-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు

-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

 

-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు

-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు

-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు

-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు

-హరితహారానికి రూ. 50 కోట్లు

-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు

-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు

 

-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు

-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు

-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు

-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి

-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం

 

-19.61 శాతం వృద్ధిరేటు సాధించాం

-రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది

-కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం

-2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం

-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం

-పాత నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది

-ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు

-ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)