Home News అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. హిందూ దేవీదేవతలకు అవమానాలే! ఐనా దోషులపై ఈగ వాలదే?

అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. హిందూ దేవీదేవతలకు అవమానాలే! ఐనా దోషులపై ఈగ వాలదే?

0
SHARE

– నిహారిక పోలె సర్వతే

కొద్ది రోజులుగా భారత్‌లో ధార్మిక విశ్వాసాలపై సంఘర్షణ అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇందుకు కన్‌హయ్యాలాల్ లేదా ఉమేష్ కొల్హే హత్యలను తార్కాణంగా తీసుకోవచ్చు. కానీ హిందూ దేవీ దేవతలకు అవమానం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పోకడలను చూసిన దాఖలు లేవు. సినీ రూపకర్త లీనా మణిమేకలై తన సినిమా పోస్టర్‌తో కాళీ మాతను అవమానపరిచారు. ఇలా హిందూ దేవీ దేవతలను అవమానించడం ఇదే మొదటిసారి కాదు. కొందరు వ్యక్తులు నిస్సిగ్గుగా హిందూ దేవీ దేవతలను అవమానించిన ఐదు దారుణమైన ఘటనలు గతంలో జరిగాయి. అలా అవమానించిన వారిపై ఈగ కూడా వాలకపోవడం గమనార్హం. ఆ ఘటనలను దిగువన ఇస్తున్నాము.

1. అమెజాన్ డోర్‌మ్యాట్లపై హిందూ దేవతల చిత్రాలు:
మనం నిత్యం సేవల కోసం ఆశ్రయించే ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హిందూ దేవతల చిత్రాలను డోర్‌మ్యాట్లపై ముద్రించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ ఉత్పత్తిని అమెజాన్ రూపొందించనప్పటికీ వాటిని విక్రయిస్తున్న ఇ-కామర్స్ దిగ్గజాన్ని రవీంద్ర జడేజా, అభిజిత్ ముజుందార్ లాంటి ప్రముఖులు విమర్శించారు. కానీ ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే.. ముస్లిము మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా నమాజ్ ప్రార్థన డోర్‌మ్యాట్లను అమెజాన్ విక్రయించిందా? అని.

2. జావేద్ హబీబ్‌కు చెందిన స్పా:

దుర్గా పూజ సందర్భంగా హెయిర్ స్టయిలిస్ట్ జావేద్ హబీబ్ తన స్పా ప్రచారంలో భాగంగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో పార్వతీ దేవి తన ఇద్దరు కుమారులు గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఒక విలాసవంతమైన స్పాలో సేవలు పొందుతూ ఉంటారు. ఆ పోస్టర్‌పై ‘Gods to visit JH salon’ అని రాసి ఉంది. అభ్యంతరకరమైనరీతిలో పోస్టర్‌ను తీసుకురావడంపై హిందూ సమాజం విమర్శలు గుప్పించడంతో హబీబ్ క్షమాపణలు చెప్పారు. కానీ ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే.. హబీబ్ ఎన్నటికైనా పార్వతీ దేవి స్థానంలో బీబీ ఆయేషాను చూపించగలరా? అలా చేసిన పక్షంలో ఆయన భుజాలపైన ఆయన తల ఉంటుందా? అని.

3. ఎం.ఎఫ్.హుస్సేన్ ‘కళాఖండాలు’:

భారత్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ భారతీయ దేవతల చిత్రాలను అత్యంత అభ్యంతకరంగా చిత్రించడం పెను వివాదానికి దారి తీసింది. ఆ క్రమంలో సరస్వతి మాత చిత్రాన్ని నీచాతినీచంగా ఆయన చిత్రించారు. భారత్‌లో హిందూ సమాజం దానిని తిరస్కరించింది. తీవ్రమైన విమర్శల మధ్య ఆయన దేశాన్ని వీడారు. 2010లో ఖతర్ దేశపు పౌరసత్వాన్ని తీసుకున్నారు. దానర్థం ఆయన దేశాన్ని అయినా వీడుతారేమో కానీ అభ్యంతరకరమైన చిత్రాలను చిత్రించడం మానరని. ఇది ఆయన దురుద్దేశ్యాలను తెలియపరుస్తున్నది.

4. లీలా(Leila):
కేవలం హిందువుల సంస్కృతీ సంప్రదాయాలు, దేవీదేవతలను అవమానించడమే లక్ష్యంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో ఒక ముస్లిమును వివాహం చేసుకున్న ఒక హిందూ మహిళకు లీలా అనే కుమార్తె ఉంటుంది. ముస్లిము తండ్రిని కలిగి ఉన్న లీలా ‘పవిత్రమైనది’ కాదు కనుక హిందూ జాతీయవాదులు లీలాను తమ కూడా తీసుకొనివెళ్ళిపోతారు. ఆ తర్వాత, లీలాను ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా కేంద్రానికి తరలిస్తారు. అక్కడకు తరలించిన వారి మెదడులో ఏదో నూరి పోస్తుంటారు. ఇలాగే సాగే ఈ మొత్తం వెబ్ సిరీస్ హిందువుల విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. హిందువులను దుర్మార్గులుగా చూపింది. తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.

5. పీకే (PK) సినిమా:
ఈ చిత్రం యావత్తూ ధార్మిక విశ్వాసాలను తప్పుపట్టడం, తర్కాన్ని మతం అధిగమించిన వైనాన్ని ప్రదర్శిస్తుంది. అదే సమయంలో ధూమపానం చేస్తున్నట్టుగా హిందూ దేవతలను చూపడం, హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయడం అత్యంత గర్హనీయమైనది. ఆ కారణంగానే హిందూ సమాజం ఈ చిత్రాన్ని తిరస్కరించింది. కేవలం ఒకటి కాదు అనేక సన్నివేశాల్లో సినిమా రూపకర్తలు హిందువుల మనోభావాలను అవమానించారు.

పైన పేర్కొన్న వివాదాలకు తోడు, హిందూ దేవీదేవతలను, హిందూ విశ్వాసాలను అవమానించిన సంఘటనలు కోకొల్లలు. కానీ ఏ ఒక్క ప్రముఖుడు కూడా ప్లకార్డులను చేతపట్టి ధార్మిక మనోభావాలను అపహస్యం చేయడం తప్పు అని ప్రపంచానికి చాటి చెప్పిన పాపాన పోలేదు.

SOURCE: NEWS BHARATI