Home News CPEC ముసుగులో పాక్ ఆర్మీ నిర్మాణాల పనిలో చైనా

CPEC ముసుగులో పాక్ ఆర్మీ నిర్మాణాల పనిలో చైనా

0
SHARE

చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(CPEC) ముసుగులో బలూచిస్తాన్‌తో పాటుగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌(PoK)లోనూ పాక్ ఆర్మీ తరఫున కీలకమైన రక్షణ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) రంగంలోకి దిగిందని తాజా ఆధారాలు ప్రాతిపదికగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి వర్గాలు తెలిపినట్టు UNI వార్తా ఏజెన్సీ ఒక కథనంలో వెల్లడించింది.

నవాబ్ షా, సింధ్‌కు నైరుతి దిక్కుగా దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో, ఖుజ్‌దార్‌కు సమీపంలో సెహ్వాన్-హైదరాబాద్ హైవే వెంబడి, రాణికోట్, సింధ్ ప్రాంతాల్లో గుహ లాంటి నిల్వ చేసే సదుపాయాల నిర్మాణాన్ని చైనా సైనికులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలూచిస్తాన్‌లో మోహరించి ఉన్న ఖుజ్‌దార్ మిస్సైల్ రెజిమెంట్ ఈ ప్రాంతాన్ని వినియోగించనుందని సమాచారం.

అలాగే ఆధారాలకు లోబడి, PoKలో శార్‌దాలో పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్(49 ఫ్రంటయిర్ ఫోర్స్) వద్ద PLAకు చెందిన 10 నుంచి 12 మంది కార్మికులు అండర్‌గ్రౌండ్ బంకర్ల నిర్మాణంలో తలమునకలై ఉన్నారు.

అంతేకాకుండా, కేల్‌కు ఆగ్నేయంగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుల్లవాయిలో పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ వద్ద అండర్‌గ్రౌండ్ బంకర్ల నిర్మాణంలో చైనాకు చెందిన 10 నుంచి 15 మంది ఇంజినీర్లు, కార్మికులు నిమగ్నమై ఉన్నారు.

నియంత్రణ రేఖ(LoC) చుట్టుపక్కల ప్రాంతాల్లో బంకర్ల పునర్ నిర్మాణం, తదితర నిర్మాణ పనులు జరుగుతున్న వైనాన్ని భారతీయ భద్రతా ఏజెన్సీలు ప్రభుత్వానికి నివేదించాయి.

బలూచిస్తాన్‌లోని గ్వాదర్ నుంచి చైనాలోని క్సిన్‌జియాంగ్ ప్రావిన్సు వరకు విస్తరించి ఉన్న CPECకు చెందిన ప్రాజెక్టులు, బిల్డింగ్ అప్‌కు సంబంధించి చేయాల్సిన మిగతాపనిని పూర్తి చేయడంలో సుదీర్ఘమైన జాప్యాల కారణంగా సదరు కార్యక్రలాపాలు దాదాపుగా సక్రమంగా జరగటం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

CPEC రుణాలపై అత్యధిక వడ్డీ రేట్లు, నానాటికి పెరిగిపోతున్న ప్రాజెక్టు వ్యయాలు, బలహీనమైన ప్రాజెక్టులు, చైనాకు చెందిన కంపెనీలు సరఫరాల్లో కోత విదించిన కారణంగా నెలకొన్న ఇంధన సంక్షోభం సైతం పాకిస్తాన్‌లో అసంతృప్తికి దారి తీసింది. ఫలితంగా CPEC అథారిటీ రద్దు అయిపోయింది.

ఆ క్రమంలో, ప్రాంతంలో వనరుల దోపిడీ కొనసాగింపునకు, తన వద్ద అధికంగా ఉన్న వాటిని వదిలించుకోవడానికి, పాక్ ఆర్మీ జనరల్స్‌ను సంతోషంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ కోసం డిఫెన్స్ నిర్మాణ పనులను ప్రస్తుతం చైనా చేపట్టింది.

ఆది నుంచి కూడా CPEC ఒక అలవిమాలిన ప్రాజెక్టుగానే (white elephant project) ఉంటూ వచ్చింది. చైనా రుణ దౌత్యాన్ని అధిగమించే పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఏనాడూ ఉండలేదు. సంబంధిత వర్గాల ప్రకారం గ్వాదర్ పోర్టులోకి చైనాకు ప్రవేశాధికారానికి, పాకిస్తాన్‌లో సహజ వనరుల దోపిడీకి, అదే సమయంలో పాకిస్తాన్‌పై రుణ భారాన్ని మోపడానికి CPEC ప్రాజెక్టు మొదలైంది.