హర్యానాలోని కురుక్షేత్రం లో వచ్చే అక్టోబర్ 28 నుంచి మూడు రోజలు పాటు అఖిల భరత్ కళా సంగమం పేరుతో దేశంలోని అన్ని కళా రూపాలను ఒకే వేదిక పై ప్రదర్శించే బృహత్తర కార్యక్రమ నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి అఖిల భారత ఉపాధ్యక్షుడు బంకేలాల్ జి గౌర్ వెల్లండించారు. సంస్కార భారతి తెలంగాణా రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హన్మకొండ కాకాజీ కాలనీ లోని స్వామి వివేకానంద యోగ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిగా హాజరైన బంకేలాల్ జి గౌర్ మాట్లాడుతూ సంస్కార భారతి సంస్థ అద్వర్యంలో దేశంలోని 42 ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల కళా నృత్యాలు, నాటకాలు, రూపకాలు ప్రదర్శిస్తామన్నారు. ఈ కళా సంగమాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభిస్తారని, ముగింపు వేడుకల్ల్లో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ , హర్యానా ముఖ్యమంత్రి, గవర్నర్ తదితర ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. కాళారూపాలు ప్రదర్శించే వారు ముందుగా తమ వీడియో క్లిప్పింగ్ లను సంస్కార భారతి జిల్లా స్థాయి ప్రతినిధుల ద్వార తమకు పంపించాలని సూచించారు. ప్రదర్శనల్లో పాల్గొనే కళాకారులకు రైల్వే శాఖ ప్రయాణ ఖర్చుల్లో సబ్సిడీ ఇస్తుందని మిగితా బోజన, వసతి ఏర్పాటు చేస్తామన్నారు.
వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం
సంస్కార భారతి వరంగల్ నూతన శాఖను ఈ కార్యక్రమంలో ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ బందెల మోహన్ రావు, ప్రధాన కార్యదర్శిగా రవ్వ వెంకటేశ్వర్లు, కోశాధికారిగా రయిన్న రవి, ఇతరి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి కుమారస్వామి , పశుపతి, ఈశ్వరనాథ్, శ్రీహర తదితరులు పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)