Home News మేఘాలయలో సాయుధదళాల ప్రత్యేక చట్టం రద్దు

మేఘాలయలో సాయుధదళాల ప్రత్యేక చట్టం రద్దు

0
SHARE
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో అమలు పరిధి కుదింపు

నాలుగేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి-భద్రతల పరిస్థితి మెరుగుపడటంతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు అఖండ అధికారాలు కల్పించిన ప్రత్యేక చట్టం ‘అఫ్సా’ను మేఘాలయలో రద్దు చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో సైతం పరిధిని పరిమితం చేసింది. అసోంకు సరిహద్దున గతంలో 16 పోలీసుస్టేషన్ల పరిధిలో అమలులో ఉన్న ఈ చట్టాన్ని ఎనిమిది స్టేషన్లకే పరిమితం చేసింది. మయన్మార్‌కు పొరుగున ఉన్న మూడుజిల్లాల్లో మాత్రమే ఇకపై అమలులో ఉంటుంది.

అఫ్సా ప్రకారం భద్రతాదళాలు ఎలాంటి సైనికచర్య అయినా చేపట్టవచ్చు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎవరినైనా, ఎక్కడైనా అరెస్టు చేయవచ్చు. తాజా నిర్ణయంతో మార్చి 31 నుంచి మేఘాలయలో ఈ చట్టం అమలు నిలిపివేసినట్లే.

1990 నుంచి నాగాలాండ్‌, అసోంలో అఫ్సా అమలు చేస్తున్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో 1997లో 289 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 2017లో ఇది 12 మంది అమరులయ్యారు. 2000లో 907 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, గత ఏడాది 37 మంది చనిపోయారు.