Home News ‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి

‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి

0
SHARE

నోయిడా: వాట్సాప్ స్టేటస్‌గా ‘బీజేపీకి నా ఓటు’ అని పెట్టినందుకు ‘అగ్నివీర్’ అనే ఎన్జీవోకు చెందిన వాలంటీర్‌పై ముస్లిం యువ‌కుల మూక‌ దాడికి పాల్ప‌డ్డారు. ఈ నెల 11న నోయిడాలో ధర్మ ప్రచార్, బేటి రక్ష, సోషల్ ఇంటిగ్రేషన్, గౌ సేవ కోసం పనిచేస్తున్న ఎన్జీవో అగ్నివీర్ వాలంటీర్లపై సలీమ్, సదాబ్, సల్మాన్, అల్తాఫ్, అఫ్రోజ్, వారి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో రవి ఠాకూర్, పవన్ ఠాకూర్ అనే ఇద్దరు వాలంటీర్లు తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నివీర్ జాతీయ ప్రధాన కార్యదర్శి చిరాగ్ ఝా సంఘ‌ట‌నపై మాట్లాడుతూ త‌మ వాలంటీర్లు వీరేందర్ సింగ్ చౌదరి, అతుల్, అజయ్, రవి, పవన్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా స్థానిక‌ బుద్ధ విహార్ కాలనీలోని వారి నివాసం సమీపంలో ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేశార‌న్నారు. దాడి జ‌రిగిన వెంట‌నే స్థానిక హిందువులు పోలీసుల‌కు స‌మాచారం అంద‌జేయ‌డంతో వారు వెంట‌నే అక్క‌డికి చేరుకుని దాడిలో గాయ‌ప‌డిని వారిని ఆసుపత్రికి తీసుకెళ్లార‌ని అని చిరాగ్ ఝా తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Source : ORGANISER