జార్ఖండ్: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి హజారీబాగ్‌లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు కొట్టి చంపారు.
రూపేష్‌ను స్పృహ తప్పి పడిపోయేంత వరకు ముస్లిం గుంపు కొట్టినట్టు తెలిసింది. ఈ నెల ఆరోతేదీన రూపేష్ పాండేతోపాటు మరికొందరు సరస్వతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళుతుండగా, హజారీబాగ్‌లోని బర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని నైతాండ్ గ్రామంలోని లఖ్నా దుల్మహా ఇమాంబరా సమీపంలో భక్తులకు, స్థానిక ముస్లిం యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు ముస్లిం రాడికల్స్ రూపేష్‌ను కొట్టి చంపారు.
అపస్మారక స్థితిలో ఉన్న రూపేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అతను చనిపోయినట్టు ధ్రువీకరించారు. అతని మరణానికి సంబంధించిన వార్తలను ఆ ప్రాంతంలో ప్రచారం చేయడంతో, పరిపాలన ద్వారా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
ఈ ఘటనపై మీడియాకు వివరించిన డీఎస్పీ నజీర్ అక్తర్, ప్రేమ వ్యవహారంపై వ్యక్తిగత పగతో ఈ ఘటన జరిగినదని చెప్పారు. హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ ఛోటే మాట్లాడుతూ, దాడిలో పాల్గొన్న ఒక అస్లాంతో సహా నలుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
జార్ఖండ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి ఇది సాక్ష్యమని, ఒక యువకుడిని దారుణంగా కొట్టి చంపినట్టు ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్ మరాండీ ట్వీట్ చేశారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రూపేష్ బంధువులకు కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
బర్హి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక మత ఘర్షణల సంఘటనలు తెరపైకి వచ్చాయి. రూపేష్‌ను కొట్టి చంపిన రోజున, కోడెర్మాలోని మార్కచ్చో పోలీస్ స్టేషన్ పరిధిలో హిందువులపై రాళ్ల దాడి జరిగింది. నిమజ్జనానికి వెళ్లిన భక్తులపై ముస్లిం మతోన్మాదులు దాడి చేశారు. మార్కాచో ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా పది మంది గాయపడ్డారు. ఇది కాకుండా, సరస్వతీ విగ్రహ నిమజ్జన ఊరేగింపులో జమతారాలోని కర్మతాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిత్కోరియా గ్రామంలో కూడా మతవాద ముస్లింలు హిందూ భక్తులపై దాడి చేశారు. అయితే, హిందువులపై ఈ దాడులు జరుగుతున్నప్పటికీ, హేమంత్ సోరెన్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేయడంతోపాటు పోకిరీలను రక్షించడంలో బిజీగా ఉంది.
Source : ORGANISER