జనవరిలో అర్థ కుంభమేళా నిర్వహించేందుకు అలహాబాద్‌లో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో అలహాబాద్ పేరు మార్చాలన్న డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. అయితే 2019 కుంభమేళాకు ముందే… అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు. గవర్నర్ కూడా పేరు మార్పకు సంబంధించి ఇప్పటికే ఆమోద ముద్ర వేసినట్లు యోగి తెలిపారు. దీంతో త్వరలోనే పేరు మార్పు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అలహాబాద్ పేరు వెనుకన్న చరిత్రను చెప్పుకొచ్చారు యోగి. గతంలో అలహాబాద్ పేరు ప్రయాగ్‌గా ఉండేదన్నారు. 16వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ గంగా, యమున నదుల సంగం వద్ద కోటను నిర్మించుకున్నాడు. ఆ రాజకోటతో పాటు పక్కనే ఉన్న ప్రాంతాలకు ఇలహాబాద్‌గా పేరు పెట్టాడు. అక్బర్ తర్వాత ఆయన కుమారుడైన షాజహాన్ ఇలాహాబాద్ పేరును అలహాబాద్‌గా మార్చాడు.అలా గతంలో ప్రయాగ్‌గా ఉన్న పేరు మారిపోయింది. పేరు మారిన.. కుంభమేళ జరుగుతున్న ప్రాంతంతో పాటు..నదుల సంగమం జరుగుతున్న ప్రాంతాల్ని మాత్రం ఇప్పటికే ప్రయాగ్‌గానే పిలుస్తున్నారు. బ్రహ్మ మొదట యజ్ఞం చేసిన ప్రాంతమే ప్రయాగ్. రెండు నదుల సంగమం జరిగిన చోటే ప్రయాగ్. అలాంటిది అలహాబాద్‌లో మూడు నదులైన గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తున్నాయి.
అందుకే ఈ ప్రాంతం నదుల సంగమానికి కంచుకోటలా మారింది. దీంతో అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మారుస్తున్నామని యోగీతెలిపారు.
Source: News18Telugu