గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మే నెల 14 నాడు రాజస్థాన్ పర్యటన జరిపారు. ఈ పర్యటనలో భాగంగా వారు పుష్కర్ లోని బ్రహ్మగుడి లోమరియు పుష్కర్ ఘాట్ పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ రాం నాథ్ కోవింద్ గారి సతిమణి సవిత కోవింద్ , కూతురు స్వాతి తో సహా గుడి మెట్లు ఎక్కి దర్శనం చేయాలనుకున్నారు. కాని సవిత కోవింద్ గారు 4 మెట్లు ఎక్కన తరువాత కాలు నొప్పుల కారణంగా దాదాపు 50 వరకు మెట్లు ఎక్కడం కష్టం అని భావించారు. దాంతో రాష్ట్రపతి సూచన మేరకు గుడిమెట్ల దగ్గరే ఆలయ పూజారులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి గారి కూతురు స్వాతి గుడి మెట్లు ఎక్కి దైవ దర్శనం చేసుకున్నారు.
స్వాతి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన విషయాలను వార్త పత్రికలు మరసటి రోజు వివరాలతో సహా అందించారు.
కాని ఈ సంఘటనను హిందూ వ్యతిరేక శక్తులు వక్రీకరించి రాష్ట్రపతి గారని కులం ఆధారంగా ఆలయ ప్రవేశం చేయ నివ్వలేదు అని అసత్య ప్రచారం చేస్తున్నారు.
ఆలయంలో కుల పరంగా ఎలాంటి వివక్ష లేదు అని వివరించినప్పటికీ కావాలని కొన్ని శక్తులు దీని పై అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నాయి.
ఇలాంటి అసత్యపు వార్తలను ఖండిస్తూ హిందూ దేశ వ్యతిరేక శాక్తకు అడ్డుకట్ట వేయాలి.
“సత్యమేవ జయతే”