Home News మతం ముసుగులో మైనర్లు.. నలుగుతున్న లేత హృదయాలు

మతం ముసుగులో మైనర్లు.. నలుగుతున్న లేత హృదయాలు

0
SHARE

మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్‌తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.. మతపరంగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ పలు మదర్సాల మాటున జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా ఉంటాయి. చిన్నవయస్సులోనే.. సెక్స్ అనే విషయం కూడా అర్థం చేసుకోలేని సమయంలో.. అదీ.. మగాళ్ల మధ్య జరుగుతున్న వికృత క్రీడకు ఆ పిల్లలు బలిపశువులు అవుతున్నారు. ఆ మతపెద్దల దుర్మార్గాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నారు.

ఖురాన్ పద్యాలను బోధించే మౌల్వీలే.. చిన్నారులపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడి పేరుతో.. వారిని లైంగికంగా వాడుకుంటున్నారు. ఒక్కో మదర్సా నుంచి ఏకంగా 5 నుంచి 10 మంది విద్యార్థులు.. ఇలా మౌల్వీల చేతుల్లో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో మదర్సాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల కేసులు.. పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ముఖ్యంగా కేరళలోని మదర్సాల్లో ఏకంగా ఇలాంటి కేసులు 25 వరకు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ నివేదిక.. ముస్లిం సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది.

సదరు రిపోర్ట్ ప్రకారం.. 2012 నుంచి తాజాగా నెడుమంగడు సమీపంలోని మదర్సాలో జరిగిన లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు మౌల్వీల వరకు అరెస్ట్ అయ్యారు. పదుల సంఖ్యలో మదర్సా ట్యూటర్లపై పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొని ముద్దాయిలుగా శిక్షలు పడ్డవారిలో నడివయస్సు నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు. కొందరైతే ఏకంగా పదేళ్లు, 25 ఏళ్ల నుంచి ఇలాంటి వికృత క్రీడలు నెరపుతున్నట్లు న్యాయస్థానాల ముందు అంగీకరించారు. ఇంకొందరు మౌల్వీలు.. ఆశ్చర్యకరంగా తాము కూడా చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనట్లు చెప్పుకొస్తున్నారు. ఇది తరతరాలుగా జరుగుతున్న సాధారణ విషయంగా చెప్పుకొచ్చారు. ఇంకొన్ని కేసుల్లో సొంత కూతుళ్లపైనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయం వెలుగులోకొచ్చింది. 2020 జులైలో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వర్‌లో 50 ఏళ్ల మదర్సా టీచర్‌ని అదుపులోకి తీసుకున్నారు. తన 16 ఏళ్ల కుమార్తెపై పదే పదే లైంగిక దాడికి పాల్పడటంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇలాంటి కేసుల్లో కేవలం మౌల్వీలే నిందితులుగా ఉండటం లేదు. వీరి వెనుక మతపెద్దలు కూడా ఉన్నట్లు తేలింది. 2022 మే నెలలో మలప్పురంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకుడు, మదర్సా అధ్యక్షుడు జలీల్‌ను అరెస్ట్ చేశారు. ఇతని గురించి ఆరా తీస్తే.. విదేశాల్లో మతపరమైన విరాళాలు సేకరించడమే కాకుండా.. పిల్లలను సప్లై చేస్తున్నాడని తేలింది. ముఖ్యంగా ఆర్థికపరంగా కష్టాల్లో ఉన్నవారి పిల్లలను ఈ రొంపిలోకి లాగుతున్నారు. ఈ కేసుల్లో చిన్నారులు తమ భయానక అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ సమయంలో మౌల్వీల ప్రవర్తన, మత పెద్దల దాడులను ఎలా ఎదుర్కొన్నారో సంబంధిత నివేదికలో పొందుపర్చారు. అయితే ఇలా వరుస ఘటనలు జరగడంతో.. రాష్ట్రంలోని మదర్సాలకు హాజరయ్యే పిల్లల భద్రతను కాపాడటం కేరళ అధికారులకు సవాల్‌గా మారింది.

అయితే మదర్సాల్లో లైంగిక వేధింపుల ఘటనలు.. ఒక్క కేరళలోనే కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలు లెక్కలేనన్ని. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని సాంబాలో ఓ యువతిని కిడ్నాప్ చేసి 5 నెలలుగా లైంగిక దాడి చేయడంతో.. బిలాల్ అనే మౌల్వీతో పాటు, అతడి సహాయకుడు రియాజ్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజస్థాన్‌లో జరిగిన మరో ఘటన.. షాక్‌కు గురిచేస్తుంది. ఎందుకంటే బాధిత విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో చూపించారు. తమను లైంగిక వేదింపులకు గురిచేసిన మౌల్వీని.. మదర్సా విద్యార్థులు ఏకంగా హత్య చేశారు. అజ్మీర్ ఎస్పీ దేవేంద్ర కుమార్ బిష్ణోయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మహ్మదీ మసీద్ ఇమామ్ మౌలానా మహ్మద్ మహీర్‌ను మదర్సా విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. విచారణలో ఆరుగురు విద్యార్థులు పట్టుబడ్డారని.. తమపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే మౌల్వీ మహీర్‌ను చంపినట్లు విద్యార్థులు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఇవి కొన్ని మాత్రమే. మదర్సాల్లో బయటపడని వ్యవహారాలు చాలానే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. చాలావరకు పిల్లలు బయటపడరు. మౌల్వీల బెదిరింపులకు భయపడతారు. వారు చేసే వికృత క్రీడలను మౌనంగా భరిస్తారు. అందుకే మదర్సాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో యూపీలోని యోగి సర్కార్ ఓ అడుగు ముందుకేసి.. ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. కానీ దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని కొన్ని మదర్సాలలో కూడా వేలెత్తి చూపించే పరిస్థితులు ఉన్నాయి.

2014లో నల్గొండ జిల్లా వేములపల్లిలో ఉన్న మదర్సాలో ఒక విద్యార్థిని గొలుసుతో బంధించిన వార్త కలకలం రేపింది.

2017లో మియాపూర్‌లో ఖాదరియా రిజివ్యా మదర్సా హాస్టల్ నుంచి 14 సంవత్సరాల బాలుడు మహమ్మద్ నూర్ ఆలం కనిపించకుండా పోయాడు.

2018 మే నెలలో ఆరుగురు బాలురను లైంగికంగా వేధించిన 23 ఏళ్ల మదర్సా టీచర్ రేహాన్ అరెస్ట్ అయ్యాడు

2021లో చాంద్రాయణ గుట్టలోని ఒక మదర్సాలో మహ్మద్ అవాయిజ్ అనే 12 ఏళ్ల బాలుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.

2022లో శాస్త్రిపురంలోని దారుల్ ఉలూమ్ మదర్సాలో విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన షోయబ్ అక్తర్ అనే టీచర్ జైలుపాలయ్యాడు. సంతోష్ నగర్ ప్రాంతంలోని రియాసత్ నగర్‌లో ఉన్న మరో మదర్సాలో కూడా ఇదే ఆరోపణలపై మరో టీచర్ పోక్సో చట్టం కింద జైలుకెళ్లాడు.

ఈ ఏడాది…

జనవరి నెలలో నార్సింగి ప్రాంతంలోని ఒక మదర్సాలో తీవ్ర ఘర్షణ జరిగి 17 ఏళ్ల విద్యార్థి మరణించాడు.

ఫిబ్రవరి నెలలో ఎర్రకుంట ప్రాంతంలో ఉన్న ఒక మదర్సా నుంచి 13 ఏళ్ల విద్యార్థి అద్నాన్ మాయమయ్యాడు.

హైదరాబాదులోని పలు మదర్సాలలోని విద్యార్థులకు గతంలోలో నిర్వహించిన వైద్య పరీక్షలలో చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోషకాహార లేమితో బలహీనంగా ఉన్నట్లు తేలింది.

ఇంత జరుగుతున్నప్పటికీ మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కిమ్మనకుండా ఉండటం అత్యంత దురదృష్టకరం.