క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు
500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం –
బాబర్ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి.
హుమాయున్ కాలంలో(క్రీ.శ 1530-1556) 10 యుద్ధాలు జరిగాయి.
అక్బర్ కాలంలో (క్రీ.శ 1556-1606) 20 యుద్ధాలు జరిగాయి.
ఔరంగజేబు కాలం లో (క్రీ.శ 1658-1707) 30 యుద్ధాలు జరిగాయి.
నవాబ్ షాదిత్ ఆలీ కాలంలో (క్రీ.శ 1770- 1814) 5 యుద్ధాలు జరిగాయి.
నసీరుద్దీన్ హైదర్ కాలంలో (క్రీ.శ 1814-1836) 3 యుద్ధాలు జరిగాయి.
వాజీద్ ఆలీషా కాలంలో (క్రీ.శ 1847-1857) 2 యుద్ధాలు జరిగాయి.
బ్రిటిష్ వారి హయాంలో (క్రీ.శ 1912-1934) 2 యుద్ధాలు జరిగాయి.
ఇలా 1934వరకూ హిందూ సమాజం మొత్తం 76 యుద్ధాలు చేసింది.
1528లో బాబర్ ప్రధాన సేనాని మీర్ బాకీ రామ మందిరం నాశనం చేసిన నాటి నుండి, ఈ వివాదం ఒక ఉద్యమం లా సాగుతోంది. 1528 నాటి నుండి అన్ని తరాల వారు రామ జన్మభూమి కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రతి తరంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1934 సంవత్సరం..
అయోధ్యలో కొందరు ముస్లిములు ఒక గోవును హత్య చేయడంతో, హిందూ ముస్లిం వర్గాల
మధ్య ఘర్షణ జరిగింది. ఆవును చంపిన కసాయి వాళ్ళని తుదముట్టించారు. ఆ తరువాత
హిందువులు బాబ్రీ కట్టడoపై దాడి చేయడంతో దానికున్న మూడు గుమ్మటాలు
దెబ్బతిన్నాయి. హిందువులు కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, బ్రిటిషు వాళ్ళు హిందువులనుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని, దెబ్బతిన్న గుమ్మటాలను బాగుపరచమని హిoదువులమీద జరిమానా విధించారు. 1934 సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడoలోకి ప్రవేశించలేదు.
శ్రీరామ జన్మభూమి ఒక రాజకీయ ఉద్యమమా?
కచ్చితంగా కాదు. శ్రీరామ జన్మభూమిలో ఆలయం నిర్మించడం అంటే కేవలం సున్నం ఇటుకలు పేర్చడం కాదు. హిందువులకు ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం. అది మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రాముడు జన్మించిన స్థలం. ఆ ఉద్యమం హిందువుల సామూహిక సాంస్కృతిక చైతన్యానికి చిహ్నం.
బాబ్రీ కట్టడాన్ని ధ్వంసం చేయడం ద్వారా, ఒకప్పుడు కొందరు జరిపిన దౌర్జన్యానికి, వినాశనానికి, ఈనాటి ముస్లిములు మూల్యం చెల్లించాలని కోరుతున్నారా?
బాబ్రీ కట్టడoపై ఈనాటి ముస్లిముల దృష్టి ఏమిటి అనేది అసలు విషయం. వారు దాన్ని తమ పవిత్ర స్థలంగా భావిస్తున్నారా? ఔను అని సమాధానమైతే, వారు బాబర్, ఇంకా ఇతరుల క్రూరమైన దాడులను తమ సొంతం చేసుకుంటున్నవారవుతున్నారు. ఈనాటి ముస్లిములు ఈ దౌర్జన్యం, వినాశనంతో తమను తాము దూరం చేసుకోవడం సరియైన పద్ధతి. హిట్లర్ నేరాలకు, ఘోరాలకు ఈనాటి జర్మన్లు క్షమాపణ కోరుకుంటారు. దాన్ని బట్టి వారు నాజీ ఇజాన్ని ఎంతమాత్రం సమర్థించరని అర్థమవుతుంది.
హిందువులు కేవలం మూడు పవిత్ర స్థానాలను (అయోధ్య, మథుర, కాశీ) మాత్రమే, అదీ న్యాయస్థానాల ద్వారా లేక సంప్రదింపుల ద్వారా, శాంతియుతంగా తిరిగి ఇవ్వమని కోరారు. ఇవేకాక అనేక వేలాది దేవాలయాలు దోపిడీకి, విధ్వంసానికి గురయ్యాయి. వాటిపై మసీదులు కట్టారు. అయినా వాటినన్నిటినీ తిరిగి ఇవ్వాలని హిందువులు కోరట్లేదు.
ఆక్రమణ గుర్తులుగా నిర్మించిన కట్టడాలు
1918 లో రష్యా ఆక్రమణ అంతమైనప్పుడు పోలండ్ ప్రజలు వార్సాలో చేసిన మొదటి పని రష్యన్లు నిర్మించిన రష్యన్ ఆర్థొడాక్స్ క్రిస్టియన్ కెథడ్రల్ ను కూలగొట్టడం. నిజానికి పోలాండ్ ప్రజలు క్రిస్టియన్లు, జీసస్ ను ఆ కెథడ్రల్ లో పూజిస్తారు కూడా. కానీ వారు రష్యా నిర్మించిన కెథడ్రల్ ను ఆరాధనా స్థలంగా భావించలేదు. ఆ కట్టడాన్ని తమ బానిసత్వాన్ని గుర్తుతెచ్చే ప్రదేశంగా భావించి దాన్ని కూల్చి వేసారు.
12వ శతాబ్దంలో స్పెయిన్ ను మూర్ లు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా అక్కడి ప్రజలను బలవంతంగా క్రైస్తవ మతం నుండి ఇస్లాం మతం కు మార్చారు. 16 వ శతాబ్దం లో క్రైస్తవులు మూర్స్ నుండి స్పెయిన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు వారు తమ దేశంలో ఉన్న ముస్లింలకు తిరిగి క్రైస్తవ మతాన్ని స్వీకరించడం, మూర్స్ తో పాటు దేశం విడిచి వెళ్లడం లేదా చావడం అనే మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకొమ్మన్నారు. మసీదులన్నింటిని చర్చ్ లుగా మార్చివేశారు. ఈ పునః క్రైస్తవీకరణ కూడా బలవంతంగా జరిగింది.
అయోధ్య లో ప్రస్తుతం ఉన్న ఆలయం స్థానంలో భవ్యమైన దేవాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటి?
రామ జన్మభూమి ఉద్యమం కేవలం ఇటుకలు, సున్నానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది దేశం, సంస్కృతులకు తిరిగి గౌరవం సాధించడం. ప్రజలు తమ గొప్ప గతాన్ని గుర్తుచేసే దేవాలయాలు నుండి ప్రేరణ పొందుతారు. కాబట్టి ఈ ప్రదేశం లో సరైన, పూర్తి స్థాయి ఆలయం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆలయ పునాది రాయి వెయ్యడం నిజమేనా?
అవును, బీహార్ కు చెందిన శ్రీ కామేశ్వర చౌహాల్ కు నవంబర్ 10 1989 నాడు రామజన్మభూమి ఆలయ పునాది రాయి వేసే గౌరవం దక్కింది. శ్రీ రామజన్మభూమి ఉద్యమపు అద్భుతమైన సమైక్యతా స్ఫూర్తికి, శక్తికి ఇది స్పష్టమైన సంకేతం.
రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు
Subscribe to our Youtube Channel
పురావస్తు పరిశోధన
విస్తృతమైన తవ్వకాల తరువాత పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో
నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ
స్థానంలోనే బాబరీ కట్టడ కట్టారని కూడా తేల్చింది.
సాహిత్య సాక్ష్యాలు
– సంస్కృత సాహిత్యము
– ముస్లిం రచయితల రచనలు
– విదేశీ రచయితల రచనలు మరియు నివేదికలు
మహర్షి వాల్మీకి కాలమునుండి ప్రస్తుత కాలము వరకు అనేక మహాకావ్యాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కవితలు మరియు మతపరమైన గ్రంధాలలోను అయోధ్య రాముని జన్మస్థానమని అనేక సందర్భాలలో తెలియచేస్తున్నవి. అయోధ్య మహాత్మ్యంలో శ్రీ రామునికి సంబంధించి అనేక పవిత్ర స్థలాల గురించి వివరమైన వర్ణన కూడా ఉన్నది. ఇందులోనే శ్రీ రామజన్మభూమి మందిరం ఉన్న ప్రదేశం గురించి మందిర ప్రాముఖ్యత గురించి వివరణ ఉంది.
కావ్యాలు: వాల్మీకి రామాయణము, మహాభారతంలో రామ ఉపాఖ్యానము (వన పర్వము), యోగ వాశిష్ట్యం, ఆధ్యాత్మ రామాయణము, రఘువంశము మొ॥
కవితలు: రమాగీత-గోవిందము, గీత రాఘవ, రామ విలాసము, రామ అష్టకము మొ॥
నాటకాలు: ప్రతిమాభిషేకము, ఉత్తర రామచరిత్ర, హనుమానాటకము, ప్రసన్న రాఘవ, రామాభ్యుదయము మొ॥
ఆఖ్యాన: బృహత్ కథామంజరి, చంపు రామాయణము, కథ సరిత్సరం మొ॥
పురాణాలు: విష్ణు, బ్రహ్మాండ, వాయు, కూర్మ, పద్మ, స్కంద, నారద మొ॥
ఉపనిషత్తులు: రామోత్తర తపనీయ, రామ రహస్యము మొ॥
మరికొన్ని గ్రంధాలు: జైమినియా, అశ్వమేధము, హనుమత్ విజయము, హనుమత్ సంహితము, బృహత్ కౌశల్ ఖండ్ మొ॥
ముస్లిం రచయితల పుస్తకాలు:1. సాహిఫా-ఈ-చాహల్-నాసా-ఇహ్-బహద్దూర్ షాహీ:
బహద్దూర్ షా కుమారుడైన అలంగిర్ కుమార్తె వ్రాసిన పుస్తకం (పదిహేడవ శతాబ్ది అంతం-పద్దెనిమిదవ శతాబ్ది ఆరంభం) ఇది.
బాదుషా ఆదేశం ప్రకారం నిర్మించబడిన మసీదులలో నమాజ్ ప్రార్థన, ఖుట్బా
తెరియున్ నిషేధం. హిందువులకు మథుర, వారణాసి, అయోధ్య లలో ఉన్న దేవాలయాల పై
విశ్వాసం అధికం. ఉదాహరణకు కృష్ణ జన్మస్థానం, సీతాదేవి పాకశాల(వంటగది),
హనుమస్థానం (రావణవధ అనంతరం శ్రీ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక, ఆయనకు
చేరువలో ఉండాలనే ఉద్దేశ్యంతో హనుమ ఉన్న స్థలం). అవన్నీ ధ్వంసం చేసి, కేవలం
తమ ఆధిక్యతను చూపించుకోవడానికే మసీదులు నిర్మించారు. జుమా, మరియు జుమా
సమయంలో చేసే నమాజ్ (జమాయిత్) లకు, ఈ మసీదులలో అనుమతి లేదు. కానీ ఈ
ప్రదేశాల్లో విగ్రహారాధన చేయరాదని, శంఖారావాలు ముస్లింల చెవులకు వినపడరాదని
ఉత్తరువులు చేసారు.2. హదిక-ఈ-షాదా : మీర్జా జాన్
1856 మీర్జా జాన్ ప్రకారం, సుల్తానులు
ఇస్లాంను ప్రచారం చేసి, హిందువులను అణగదొక్కారు. ఆ విధంగా ఫైజాబాద్ ను,
అయోధ్యను ఆక్రమించారు. ఈ అయోధ్య ఒక పెద్ద తీర్థస్థలం మరియు శ్రీ రాముని
తండ్రి దశరథుని రాజధాని. అక్కడ ఒక శోభాయమానమైన దేవాలయం ఉండేది. ఆ స్థానంలో
ఒక మసీదు నిర్మించి, ప్రక్కనే ఉన్న మండపం ఉన్న చోట ఒక చిన్న మసీదును
నిర్మించారు. ఆ దేవాలయమే శ్రీ రాముని జన్మస్థలం. ప్రక్కనే సీతాదేవి
పాకగృహం(వంటగది). సీత శ్రీ రాముని భార్య. మూస ఆషికన్ అనే వ్యక్తి సలహాతో
బాబర్ బాదుషా ఆ ప్రదేశంలో మసీదును నిర్మించాడు. ఈ రోజుకీ ఆ మసీదును “సీతా
రసోయి” అంటే సీత దేవి వంటగది అనే పిలుస్తారు.
3. ఫాసన-ఈ-ఇబ్రాత్: మీర్జా రజబ్ అలీ బైగ్ సరూర్
బాబర్ పాలనలో, అయోధ్య లో సీతాదేవి వంటగది ఉన్న స్థలంలో ఒక పెద్ద మసీదు
నిర్మించబడినది. అదే బాబరీ మసీదు. దానిని వ్యతిరేకించేందుకు హిందువులకు
శక్తి లేకపోవడంతో, మీరు ఆషికన్ అనే వ్యక్తి సలహా మీద అక్కడ మసీదు
నిర్మించబడినది.
4. గంగష్ట్-ఈ-హాలాత్-అయోధ్య-అవధ్: మౌలావి అబ్దుల్ కరీం (బాబరీ మసీదు ఇమామ్)
1885 హజరత్ షాహ్ జమాల్ గుజ్జరి దర్గా తాలూకా వివరాలు తెలియజేస్తూ, ఈ
రచయిత వ్రాసినది – దర్గాకు తూర్పుదిక్కున మహల్లా అక్బర్పూర్ ఉంది. దాని
మారుపేరు కోట్ రాజా రామచంద్ర. ఈ కోట లో కొన్ని బురుజులు ఉండేవి. అది ఆ
రాజు జన్మ ప్రదేశం. అంతేకాక బురుజు కు పశ్చిమాన, జన్మస్థానం, సీతాదేవి
వంటగది ఉండేవి. అవి ధ్వంసం చేసి రూపుమాపాక, బాదుషా బాబర్ అక్కడ ఒక పెద్ద
మసీదును నిర్మించాడు.
5. తారీఖ్-ఈ-అవధ్: అల్లామా మహమ్మద్ నజముల్ ఘనీ ఖాన్ రాంపురీ
1909 సయ్యద్ ఆషికన్ అనే వ్యక్తి రక్షణలో బాబర్ ఒక పెద్ద మసీదును, అయోధ్యలో
శ్రీ రామ చంద్రుని జన్మస్థలంగా, ఒకప్పుడు ఉన్న ఒక దేవాలయం ఉన్న స్థలంలో
నిర్మించాడు. ప్రక్కనే సీతాదేవి వంటగది ఉండేది. ఈ రోజుకీ అది సీత రసోయీ అనే
పిలవబడుతోంది. ఆ దేవాలయం దీని ప్రక్కనే ఉంది.దేవాలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారని నిర్ధారణ చేసే, ముస్లిం రచయితలు వ్రాసిన మరిన్ని పుస్తకాలు:
* జియా-ఈ-అక్తర్: హాజి మహమ్మద్ హస్సన్ 1878
* కేసర్ – ఉల్ – తవారిక్ (తవారిక్-ఈ-అవధ్) వాల్యూం 2 : కమాలుద్దీన్ హైదర్ హుస్సేన్ అల్ హుస్సేన్ అల్ మాషహాది
*అర్సార్-ఈ-హాకీకత్ : లక్ష్మీ నారాయణ్ సర్దార్ కానోన్గో అసిస్టెంట్ ఆఫ్ మున్షి మౌలవి హషామి
* హిందుస్తాన్ ఇస్లామీ ఆహద్ : మౌలానా హకీమ్ సయ్యద్ అబ్దుల్ హాయ్ – 1972
విదేశీ చరిత్రకారుల సమగ్ర నివేదిక1.భారతదేశపు చారిత్రక భౌగోళిక నివేదిక జోసెఫ్ టేఫ్లాంతర్ -1785
“రామ జన్మస్థాన్” దేవాలయాన్ని కూల్చి ఆ స్తంభాల ఆధారంగా మసీదు నిర్మాణం
చేశాడు. కానీ హిందువులు తమ పవిత్ర స్థలం పై తమ అధికారాన్ని కోల్పోవటం
ఇష్టంలేక మొగల్ రాజుల అరాచకాలను లెక్క చేయక ఆ పవిత్ర భూమిని దర్శించడం,
పూజలు నిర్వర్తించడం చేసేవారు. రామజన్మభూమిలోని దేవాలయాన్ని కూల్చి మసీదు
నిర్మాణం చేసిన ఆవరణలోనే “రామచబూతర్ ” ను నిర్మించి ప్రదక్షిణలు చేసి
సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉండేవారు. ఈ రకమైన ఆరాధనలు ‘రామచబూతర్’ వద్దనే
కాక మసీదు లోపల కూడా చేసేవారు.2. అవధ్ మండల అధికార పత్ర కారులు -1877
ఈ అధికార పత్రం ప్రకారం మొగలులు మూడు ముఖ్యమైన దేవాలయాలు పగులకొట్టి
వాటిపైన మసీదుల నిర్మాణం చేసారని స్పష్టమవుతోంది. రామజన్మభూమి స్థలంపై
మసీదు ను బాబరు 1528 లో నిర్మాణం చేశాడు.
3. ఫైజాబాద్ అంగీకార పత్రం – 1880
ఈ నివేదిక , బాబరు ‘బాబ్రీ మసీదు’ను 1528 లో “రామ జన్మస్థల దేవాలయం ” పై అనగా శ్రీరామ జన్మ స్థలంలో కట్టాడని ధ్రువీకరించింది.
4. న్యాయస్థానపు ఆదేశం: న్యాయమూర్తి — కల్నల్ ఎఫ్ ఇ ఏ ఛైమియర్ సివిల్ అప్పీల్ నెంబర్ 27 — 1885
బాబ్రీ మసీదును స్వయంగా దర్శించిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ
జిల్లా న్యాయమూర్తి ఇలా అన్నాడు“హిందువుల పవిత్ర స్థలం పై మసీదును కట్టడం
చాలా దురదృష్టకరం. కానీ దీనికి పరిష్కారం కనుక్కోవడానికి సమయం దాటిపోయింది.
ఎందుకంటే ఈ సంఘటన జరిగి 356 సంవత్సరాలు దాటిపోయింది.’’
5. భారతీయ పురాతన వస్తు నివేదిక–ఎ ఫ్యురర్ 1891
ఫ్యురర్”మీర్ ఖాన్ ‘బాబ్రీ మసీదు’ను రామజన్మభూమి స్థలములోనే, ఆ దేవాలయ
స్తంభాల ఆధారంగా, నిర్మించా”డని తన నివేదికలో అంగీకరిస్తూ పేర్కొన్నాడు.
ఇంతే కాకుండా ఔరంగజేబు, అయోధ్యలోనే 1.స్వర్గద్వార్ , 2. త్రేతా థాకూర్ దేవాలయాలను కూల్చి మరో రెండు మసీదులను నిర్మించాడని ధృవీకరించాడు.
6. బరబాంకీ జిల్లా అధికార పత్రం– హెచ్ ఆర్ నెవిల్ 1902
నెవిల్ నివేదిక ప్రకారం పలుమార్లు అయోధ్యలోని హిందూ పూజారులు
ముసల్మానులకు మధ్యన రామజన్మభూమి మందిర స్థల విషయంపై ఘర్షణలు జరిగేవి.
ఎందుకంటే మసీదును ఒక దేవాలయాన్ని కూలగొట్టి కట్టారు.
7. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా15 వ ఎడిషన్ – వాల్యూమ్1 : 1978
పూర్వం నుండి ఉన్న రామ జన్మ మందిరాన్ని కూల్చి ఆ నిర్మాణంపైనే 1528లో
మసీదును కట్టినట్లు చెప్పడానికి ఇది ఒక ఆధారం. అప్పటి చిత్రాలను చూపిస్తూ
వాటి క్రింద `భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అయోధ్యా నగరంలో,”
రామజన్మభూమి స్థలంపై మసీదు నిర్మాణం’ అని శీర్షికలో పేర్కొన్నారు. అంతకు
ముందు వచ్చిన బ్రిటానికాలలో కూడా రామమందిరం గురించి పేర్కొన్నారు.
ఇతర ప్రచురణలు:-
8. ట్రావెల్ రిపోర్ట్ : విలియం ఫింఛ్, 1608 —1611
9. హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ ఫైజాబాద్ :పి . కార్నెగీ 1870
10. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఫైజాబాద్ 1881
11. బాబర్ నామా ( ఆంగ్లం ): ఇనెట్ బెబరీస్ 1920
12. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1934
13. అయోధ్య: హేన్స్ బెకర్ -1984
14. రామ జన్మభూమి వర్సెస్ బాబ్రీ మసీద్: కొన్రాడ్ ఎలస్ట్ – 1990
ఆల్ ఇండియా బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ దాఖలు చేసిన పత్రాలు నిరాధారమైనందున సాక్ష్యం పనికిరావు. అవి వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారి అభిప్రాయాలేకానీ ఎటువంటి ఆధారాలు కావు. బాబరు కానీ ఆయన ప్రతినిధులు కానీ అయోధ్యలో ఖాళీ స్థలాన్ని గుర్తించి అందులో మసీదు కట్టాలని చెప్పినట్లుగా ఎటువంటి పత్రమూ సాక్ష్యంగా దాఖలు చెయ్యలేదు.
శ్రీరామునికి వ్యతిరేకంగా బౌద్ధాన్ని నిలపాలనుకోవడంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే బౌద్ధ ఆఖ్యానాలలో శ్రీరాముని ప్రస్తావన ఉంది. బుధ్ధుడు శ్రీరాముని వంశమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడని ఎంతో గర్వంగా ప్రస్తావించబడింది. వివిధ రామాయణాలు ప్రచారంలో ఉండడంవలన రామాయణం చారిత్రాత్మకతనే ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా వాదనకు నిలువదు. ఎందుకంటే బైబిల్ సృష్టి గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. జీసస్ వంశం గురించి రెండు వివరణలు ఉన్నాయి. జీసస్ జీవితానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్క గాస్పెల్ లో ఒక్కో విధంగా చెప్పారు. అయినప్పటికీ వీటిని పట్టుకునే ఏ మేధావి జీసస్ పుట్టనే లేదని అనలేదు.
రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి?
Click here to Download Samachara Bharati App for Android
అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ లోని ముగ్గురు న్యాయమూర్తులు
1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ
2. జస్టిస్ సుధీర్ అగర్వాల్
3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్
తీర్పు ఇచ్చిన తేది: 2010 సెప్టెంబరు 30
తీర్పు వివరాలు:
* మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు.
* ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు
ఫిర్యాదుదారులైన నిర్మోహి అఖాడా, ముస్లింలు, మరియు రాంలాలాకు కేటాయిస్తూ
తీర్పు చెప్పారు. సున్ని వక్ఫ్ బోర్డ్ దావాను న్యాయస్థానం కొట్టివేసింది.
* వివాదిత స్థలం చుట్టుపక్కల 70 ఎకరాల భూమిని భారత ప్రభుత్వం సేకరించింది.
ఈ భూమి వివాదిత ప్రాంతమే అయినా భారత ప్రభుత్వపు అధినంలోకి వెళ్ళిపోయింది.
* అయినా సరే అలహాబాద్ హైకోర్టు కు చెందిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన
లక్నో బెంచ్ ఈ వాదవివాదాలను వినడం జరిగింది. ఒక ట్రయల్ కోర్టులా ముగ్గురు
న్యాయమూర్తులు తమ తీర్పులను వేర్వేరుగా వ్రాసి, ప్రకటించారు.
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ తీర్పులోని ముఖ్య విషయాలు –
1. వివాదాస్పద స్థలంగా పేర్కొంటున్న స్థలం ప్రభు శ్రీరామచంద్రుడి జన్మస్థలం. జన్మస్థలం ఒక చట్టబద్ధమైన వ్యక్తి మరియు ఒక దేవుడికి సంబంధించినది. ప్రభు శ్రీరామచంద్రుడు బాలుడి రూపంలో పూజలందుకుంటున్నప్రదేశాన్ని పవిత్ర జన్మస్థలంగా భావిస్తున్నారు. పవిత్రత తో కూడిన దైవీ భావన ఎల్లవేళలా అన్నిచోట్లా ఎవరిద్వారానైనా, ఆయా వ్యక్తుల భావాలకనుగుణంగా ఏ ఆకారంలోనైనా లేదా ఆకార రహితంగాను జాగృతం కావచ్చు.
2. వివాదాస్పద కట్టడం బాబర్ ద్వారా నిర్మించబడింది, ఏ సంవత్సరంలో అనేది స్పష్టంగా లేకున్నా అది స్థానిక ముస్లింల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్మించబడింది. అయితే, దానికి మసీదుకుండాల్సిన లక్షణాలేవీ లేవు.
3. వివాదాస్పద కట్టడాన్ని ఆ ప్రదేశంలో అంతకు ముందే ఉన్న పాత కట్టడాన్ని ధ్వంసం చేసి కట్టారు. భారత పురాతత్వ శాఖ ఆ పాత కట్టడం బృహత్తరమైన హిందూ ధార్మిక కట్టడం అనే విషయాన్ని నిర్ధారించింది.
4. దీంతో దావాలో పేర్కొనబడిన ఆస్తి రామచంద్రుడి జన్మభూమికి సంబంధించినదని నిరూపితమైంది. అలా ఆ స్థలంలో హిందువులు చరణ్, సీతా రసోయి, మరియు ఇతర విగ్రహాలను పెట్టి పూజించడం జరిగిందన్నదీ వాస్తవమే. అనాదికాలం నుండి హిందువులు ఆ వివాదంలో ఉన్న స్థలాన్ని దేవుడి జన్మస్థలంగా భావిస్తూ ఆ పవిత్రస్థలానికి తీర్థయాత్రలు చేయడం నిర్ధారణ అయింది. వివాదిత కట్టడం నిర్మాణమయ్యాక 22/23 .12.1949 ( డిశంబర్ 22/23 , 1949 ) తేదీలలో వివాదిత కట్టడం లోపల విగ్రహాలను ప్రతిష్టించారని కూడా నిర్ధారణ అయింది. అంతేగాక కేవలం వివాదిత కట్టడపు బాహ్య ప్రదేశంలోనే గాక, అంతర్గత ప్రదేశంలోనూ హిందువులు తమ పూజాదికాలు నిరంతరంగా జరుపుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు వివాదిత కట్టడాన్ని ఎప్పుడూ కూడా ఒక మసీదుగా స్థానిక ముస్లింలు భావించనేలేదు.
జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు లోని ముఖ్య అంశాలు –
1. వివాదిత స్థలం, అందులోని నిర్మాణం బాబర్ కుగానీ లేదా అక్కడ మసీదు
కట్టాలని ఆదేశించినవారికిగానీ చెందినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
అదే విధంగా మసీదు అనబడే వివాదాస్పద కట్టడం ఎవరి ఆజ్ఞల ద్వారా కట్టబడలేదు
అని నిరూపించబడినది.
జస్టిస్ సుధీర్ అగర్వాల్ తీర్పు సారాంశం లో కొన్ని కీలక అంశాలు –
అయోధ్య లో వివాదాస్పద కట్టడం మధ్య గుమ్మటం/కప్పు క్రింద ఉన్నప్రదేశం
కోట్లాది హిందువుల విశ్వాసం, నమ్మకం ప్రకారం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ
చంద్ర మూర్తి జన్మస్థలం.
త్రిసభ్య ధర్మాసనం ఏ అంశాలు,సాక్ష్యాలు పరిగణలోనికి తీసుకుంది?
విచారణలో న్యాయమూర్తులు తీర్పుకి ఆధారాలుగా ,అప్పటి ముస్లిం
గ్రంధాలూ,ముస్లిం వక్ఫ్ చట్ట ప్రతులు, హిందూ మత గ్రంధాలలో అయోధ్య రామ మందిర
ప్రస్తావనలు, స్కంద పురాణం, హిందూ రచనలలో అయోధ్య ఉల్లేఖనలు,ముస్లిం చరిత్ర
కారులు పొందుపరిచిన చరిత్రక విషయాలు ,ఆ కాలంలో ఫ్రెంచ్ మత గురువు జోసెఫ్
టేఫ్లాంతర్ అయోధ్య ని దర్శించి తన డైరీ పుటల్లో పొందుపరిచిన
వాస్తవాలు,అయోధ్య పైన బ్రిటిష్ అధికారుల గెజెట్ లు ,బ్రిటిష్ రచయితల
రచనలు,ఎంసైక్లోపీడియా బ్రిటానికా,అయోధ్య వివాదస్పద కట్టడం వద్ద దొరికిన
శిల్ప ఆకృతులు,శిలాశాసనాలు, గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడార్ నివేదిక (రాడార్
ద్వారా భూగర్భ పరిశీలనా నివేదిక), జాతీయ పురావస్తు శాఖ వారు జరిపిన ఉపగ్రహ
ఆధారిత తవ్వకాల సర్వేలో బయటపడిన పురాతన శాసనాల నివేదిక,సుమారు 85 మంది
వ్యక్తులు చెప్పిన విషయాలు, రికార్డులు పరిగణలోకి తీసుకొని తీర్పు
వెలువరిస్తారు.
ఈ వాజ్యంలో శ్రీ రాముడిదే గెలుపు.. ఎందుకంటే?
ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ రామచంద్ర విగ్రహం,ఒక సజీవ దైవ స్వరూపము.
చట్ట ప్రకారం తన వాదన తానే వినిపించగలదు. కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీ
రాముడు బాల రాముడు. చట్టం ప్రకారం మైనర్ కాబట్టి న్యాయ పోరాటాలలో తన వాదన
వినిపించటానికి సంరక్షకుడు(గార్డియన్)అవసరం. అలహాబాద్ న్యాయస్థాన విశ్రాంత
న్యాయమూర్తి స్వర్గీయ దేవకీ నందన్ అగర్వాల్ శ్రీ రామచంద్రుని స్నేహితుడిగా
ఆయన తరఫున న్యాయస్థానంలో రామజన్మభూమి కోసం వ్యాజ్యం వేశారు. హిందూ మత
గ్రంధాలు,మరియు ప్రస్తుత చట్టం ప్రకారం శ్రీరామచంద్రుడు ఆస్థి కలిగి
ఉండవచ్చు. ఆ ఆస్థి మీద ఎవరికి హక్కు ఉండదు అని చట్టం తెలియచేస్తోంది.
ఇదే కాకుండా ఆ ప్రదేశం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్రుడి జన్మస్థానం. ఆ మొత్తం ప్రదేశమే ఒక పుణ్య తీర్థం. అతి పూజనీయం. కనుక ఆ ప్రదేశం న్యాయపోరాటానికి పూర్తిగా తగినది. ఈ హక్కుని వేల సంవత్సరాల నుంచి హిందూ మత గ్రంధాలు విపులంగా ప్రస్తావించాయి. అలాగే మన న్యాయ స్థానాలు కూడా ఈ విషయాన్ని అంగీకరించాయి.
న్యాయస్థానం సున్నీ వక్ఫ్ బోర్డు వాజ్యం ఎందుకు తిరస్కరించింది ?
ఇస్లామిక్ ధార్మిక గ్రంధాలు , షరియా చట్టాల ప్రకారం ఇతరుల ఆస్థి
(విగ్రహం వున్న ప్రదేశం లో కానీ,గర్భ గుడి ,లేదా ఇతరుల దేవాలయ అవశేషాలు
/లేదా దేవాలయ స్థలం) వక్ఫ్ ఆస్థిగా పరిగణించటానికి అనుమతి లేదు. అలాగే ఇతర
ధార్మిక స్థలంలో చేసే నమాజు అల్లాహ్ ప్రార్ధనగా అంగీకరించరు. దీనినిబట్టి 3
గుమ్మటాల కట్టడానికి గుర్తింపు లేనట్టే.
అదే విధంగా బాబర్ కానీ, అతని సైన్యాధ్యక్షుడు మీర్ బాకీ కానీ ఈ వివాదస్పద స్థలానికి యజమానులు కాదు. కాబట్టి ఇస్లామిక్ గ్రంధాలు మరియు చట్టాల ప్రకారం వేరొకరి ఆస్థిని అల్లాహ్ కి సమర్పించలేరు.
ఈ వివాదాస్పద ప్రదేశం 1528 నుండి ముస్లిం ఆక్రమణ /ఆధిపత్యంలో ఉందని చర్చ కోసం అనుకున్నా, హిందువులు దానికోసం పోరాటం ఎప్పుడు ఆపలేదు. శతాబ్దాల తరబడి ఒకరి అనధికార ఆక్రమణ లో వున్నా ఆ స్థలం మీద యాజమాన్యపు హక్కు పొందలేరు.
అదే కాకుండా వక్ఫ్ బోర్డు తన వాదనలో ఎవరి స్థలాన్ని బాబర్ ఆక్రమించాడు? ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు అసలు యజమానికి తెలియచేసాడా అనే విషయాలు వక్ఫ్ బోర్డు న్యాయస్థానానికి తెలియచేయాలి.
అదేవిధంగా ఇస్లాం మతంలో మసీదుకు ప్రాముఖ్యత లేదని, అల్లాహ్ కి నమాజ్ ఎక్కడైనా చెయ్యవచ్చని, బహిరంగ ప్రదేశంలో కూడా నమాజ్ చెయ్యటానికి ఇస్లాం అనుమతి ఇస్తుందని సుప్రీం కోర్ట్ ఇటీవల స్పష్టం చేసింది. అలాగే న్యాయస్థానం ఆ వివాదాస్పద స్థలానికి వక్ఫ్ బోర్డుని యజమానిగా అంగీకరించటం లేదు. అదే విధంగా వివాదాస్పద కట్టడం మసీదుగా కూడా ఇస్లాం ప్రకారము ఆమోదనీయం కాదు.
పైన కారణాలు /ఆధారాలు /అధిక కాల యాపన దృష్ట్యా వక్ఫ్ బోర్డ్ వేసిన వాజ్యం సంఖ్య 4ను గౌరవనీయ న్యాయస్థానం కొట్టి వేసింది.
ఆల్ ఇండియా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించాక, అవేవీ సాక్ష్యాలుగా ఉపయోగపడే పత్రాలు కావని, రాజకీయ వాసనలున్న కొందరు వ్యక్తులు సమర్పించిన కాగితాలేనని తేలింది. బాబర్ గానీ లేదా మరే ఇతర ముస్లిం సేనాధిపతి గానీ అయోధ్యలో ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించి , మసీదు నిర్మాణం చేయడానికి ఆజ్ఞాపించాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేలింది.
బౌద్ధం శ్రీరాముడికి వ్యతిరేకం అని చూపడానికి కూడా ఎలాంటి ఆధారమూ లేదు. బౌద్ధ ఆఖ్యానాలలో శ్రీరాముడి కథ ఉంది. శ్రీరాముడిలాగే బుద్ధుడు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడని గొప్పగా చెప్పబడింది. రామాయణం వేర్వేరు విధాలుగా గ్రంథస్థం కావడం వల్ల, ప్రతివాదులు (వక్ఫ్ బోర్డ్) అసలు రామాయణపు అస్థిత్వాన్నే ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే తమ ఈ వాదనకు కూడా తగిన ఆధారాలు చూపలేకపోయారు. బైబిల్ పుట్టుక గురించి రెండు వేర్వేరు కథలు ఉన్నాయి. ఏసుక్రీస్తు గురించి రెండు వేర్వేరు వంశావళిలు పేర్కొనబడ్డాయి. నిజానికి ఏసు క్రీస్తు జీవితం గురించి వేర్వేరు రచయితలు వేర్వేరుగా వివరించారు. దీనినిబట్టి ఏసుక్రీస్తు అనే వ్యక్తి అసలు పుట్టనేలేదు అని ఏ మేధావి అనలేదు.
సున్నీ వక్ఫ్ బోర్డ్ వాదిగా ఉన్న కేసులో కొన్ని అంశాలపై జస్టిస్ సుధీర్ అగర్వాల్ స్పష్టం చేసిన అంశాలు:
1. ఈ కట్టడం (మూడు గుమ్మటాల బాబరీ కట్టడం) హిందూ దేవాలయాన్ని కూల్చి ఆ స్థలంలో నిర్మించినదా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: నిశ్చయంగా అవును.2.ఈ కట్టడాన్ని(మూడు గుమ్మటాల
బాబరీ కట్టడం) ముస్లింలు పురాతనకాలం నుండి ప్రార్ధనలు చేయడానికి
ఉపయోగించారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: వివాదాస్పద కట్టడాన్ని(మూడు గుమ్మటాల బాబరీ
కట్టడం) కేవలం ముస్లింలు మాత్రమే ఉపయోగించలేదు. 1856-57 తరువాత, బాహ్య
ప్రాంగణాన్ని కేవలం హిందువులు మాత్రమే ఉపయోగిస్తే, లోపలి ప్రాంగణాన్ని
రెండు వర్గాల (హిందువులు మరియు ముస్లింలు) వారు ఉపయోగించారు.
3. వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) 1949 దాకా ఆ ఆస్తిని కలిగి ఉండి, 1949 తరువాత వారి ఆదీనంలో నుండి తొలగించబడిందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: లేదు – అలా ఏమి జరుగలేదు.4. ఫిర్యాదులో ఆరోపించిన
విధంగా సున్ని వక్ఫ్ బోర్డ్ వారి హక్కులను ప్రతికూలంగా కలిగి ఉన్నదా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్ : లేదు.
5.వాదనలో ఉన్న ఆస్తి రాజా శ్రీ రామచంద్ర స్వామి జన్మ భూమియేనా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: ఈ ప్రదేశం, మూడు గుమ్మటాల కట్టడపు ప్రధాన
గుమ్మటం కింద ఉన్న ప్రాంతం, హిందువులు రామజన్మభూమి అని నమ్మి పూజించే
ప్రాంతం.. అంటే వివాదాస్పద కట్టడం అంతర్భాగం6. సాధారణ హిందువులు
ప్రత్యేకించి పిటిషనర్లు ఇక్కడ ఉన్న శ్రీ రామ పాదాలు ,సీతా రసోయి మరియు
ఇతర విగ్రహాలు మొదలైనవాటిని పూజించే హక్కును కలిగిఉన్నారా? ఒకవేళ ఉంటే
వివాదంలో ఉన్న భూమి లోనేనా ?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: నిశ్చయంగా, అవును.7. ప్రాచీన కాలం నుండి
హిందువులు ఈ వివాదాస్పద ప్రాంతాన్ని శ్రీ రామ జన్మభూమిగానూ, జన్మస్థానం
గాను భావించి పవిత్ర యాత్రా స్థలంగా, తీర్థయాత్రగా దర్శించటానికి వస్తూ
ఉన్నారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును.8. వివాదంలో ఉన్న ఈ ఆస్తి పై 1528 AD నుండి
ముస్లింలకు తరాలుగా అందరికి తెలిసే హక్కులు కలిగి ఉన్నారా? పిటిషనర్లు
లేదా హిందువులు అలా అనుకుంటున్నారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: – లేదు. సమాధానం వాది (సున్ని వక్ఫ్ బోర్డ్)
మరియు సాధారణ ముస్లింలకు వ్యతిరేకం.9. (మూడు గుమ్మటాల బాబరి కట్టడం) ఈ
కట్టడం అన్నివైపులా మూసి ఉండి హిందువులు పూజించే ప్రాంతం నుండి మాత్రమే
లోపలి వెళ్ళడానికి అనువుగా ఉన్నదా ?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును, హిందూ ప్రార్ధనా స్థల మార్గం గుండా వెళ్ళడం తప్ప వేరే అవకాశం లేదు.సున్ని వక్ఫ్ బోర్డ్ (వాది లేదా ఫిర్యాదుదారు) పత్రంలో పేర్కొన్న కొన్ని అంశాలపై జస్టిస్ ధరం వీర్ శర్మ పేర్కొన్న విషయాలు:
1. వాది (సున్నీ వక్ఫ్ బోర్డ్)ద్వారా పేర్కొన్న విధంగా అది మసీదేనా అని ప్రశ్నించగా,
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి (సున్నీ వక్ఫ్ బోర్డ్) వ్యతిరేకంగా
నిర్ణయించడమైనది2. హిందూ దేవాలయ స్థలంలో పాత కట్టడం పడగొట్టిన తర్వాత ఈ
కట్టడం నిర్మించారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: ASI రిపోర్టు ఆధారంగా ముద్దాయిలకు (హిందూ సమాజం
సాధారణంగా) అనుకూలంగా మరియు వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డు)
నిర్ణయించడమైనది
3.ఈ భవనం ముస్లిం సమాజంలోని సభ్యులు చాలాకాలం నుండి ప్రార్ధనలను జరపడానికి ఉపయోగించినదా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) నిర్ణయించడమైనది
4. వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) 1949 దాకా ఈ ఆస్తులను కలిగి ఉండి తరువాత 1949 నుండి ఆ హక్కు నుండి తొలగించబడ్డారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ సమాధానం: వాదికి వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
5. వాది (సున్ని వక్ఫ్ బోర్డు ) ఫిర్యాదులో చెప్పబడినట్లు అక్రమంగా హక్కులను కలిగి ఉన్నారా?జస్టిస్ ధరంవీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
6. ఈ వివాదంలో ఉన్న ప్రాంతం శ్రీ రామచంద్రదేవుని జన్మభూమియేనా?
జస్టిస్ ధరం వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) (మరియు హిందూ సమాజానికి అనుకూలంగా) నిర్ణయించడమైనది.
7. శ్రీ రామ్ జన్మ భూమి లేదా జన్మస్థాన్
వంటి ఈ వివాదస్థలంలో హిందువులు పురాతన కలం నుండి పూజలు చేస్తున్నారా?. ఒక
పవిత్ర స్థలంగా తీర్థయాత్ర చేస్తున్నారా?
జస్టిస్ ధరంవీర్ శర్మ: వాదిలపై (సున్ని వక్ఫ్ బోర్డ్) (మరియు హిందూ సమాజానికి సాధారణంగా అనుకూలంగా) వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
8. ముస్లింలు 1528 AD నుండి నిరంతరంగా, బహిరంగంగా, ఈ ఆస్థి ఫై హక్కును ప్రతివాదులు మరియు సాధారణ హిందువులకు తెలిసేలా కలిగి ఉన్నారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) నిర్ణయించడమైనది.
9.వాదికి లేదా వారిలోని ఎవరికైనా ఏ విధమైన ఉపశమనం ఉండే అవకాశం ఉంది?
జస్టిస్ ధరం వీర్ శర్మ: వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) ఏ ఉపశమనానికి అర్హులు కాదు. సులభ వాదనలతో ఈ దావాను తొలగించారు.
10. కేవలం హిందూ ఆరాధన స్థలాల గుండా వెళ్ళటం ద్వారా మాత్రమే ఈ భవనం భూభాగం చేరుకోవటానికి వీలైనదిగా ఉన్నదా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదులపై (సున్ని వక్ఫ్ బోర్డ్) మరియు ప్రతివాదులకు అనుకూలంగా (హిందూ సమాజం సాధారణంగా) నిర్ణయించడమైనదిరామలాల
విరాజమాన్ (మొదటి వాది), రామ్ జన్మభూమి ఆస్థాన్ (రెండవ వాది) మరియు
తదుపరి స్నేహితుడి (వాది సంఖ్య 3) పిటిషన్ లో పేర్కొన్న కొన్ని అంశాలపై
జస్టిస్ సుధీర్ అగర్వాల్:
1. వాది 1 మరియు 2 (రామలాల విరాజమాన్ & రామ్ జన్మ్ భూమిఆస్థాన్ ) చట్టబద్దమైన వ్యక్తులా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్ జవాబు: వాది 1 & 2 చట్టబద్దమైన వ్యక్తులే. .2.
వాది ఆరోపించినట్లు డిసెంబరు 23, 1949 ఉదయపు గంటల్లో వివాదాస్పద కట్టడపు
ప్రధాన గుమ్మటం కింద విగ్రహం ప్రతిష్ఠించబడిందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును. . 1949, డిసెంబర్ 23, ఉదయపుగంటలలో
వివాదాస్పద కట్టడపు ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు ఏర్పాటు
చేయబడ్డాయి.3.జన్మస్థానంలోని దేవాలయాన్ని కూల్చివేసిన తరువాత నిర్మించిన
కట్టడమే ఈ బాబ్రీ మసీదు అనే వివాదాస్పద కట్టడంగా చెప్పబడుతోందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: కచ్చితంగా (అవును).రాంలాలా విరాజ్మాన్ (వాది
నెం 1), అష్టన్ రామ్ జన్మ్ భూమీ ఆస్థానమ్ (వాది నంబర్ 2) మరియు తదుపరి
స్నేహితుడి (వాది నంబర్ 3) కేసులో రూపొందించిన కొన్ని అంశాలపై జస్టిస్ ధరం
వీర్ శర్మ
జన్మస్థానం లోని దేవాలయాన్ని కూల్చివేసిన తరువాత నిర్మించిన కట్టడమే ఈ బాబ్రీ మసీదు అనే వివాదాస్పద నిర్మాణంగా చెప్పబడుతోందా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: సున్ని వక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా, వాదికి అనుకూలంగా తీర్పు చెబుతూ.. “సాధారణంగా, శ్రీ రామ్ జన్మస్థాన్ ఆలయాన్ని ధ్వంసం చేసిన తరువాతనే ఈ వివాదాస్పద బాబరి నిర్మాణం జరిగింది”
Source: www.arisebharat.com