అయ్యప్పమాలధారణ చేసిన ఓ వ్యక్తిపై ఇద్దరు ముస్లిమ్ యువకులు చేయిచేసుకు న్నారు. ఈ దాడిని ఖండిస్తూ అయ్యప్పస్వాములు, వారికి మద్దతుగా స్థానిక హిందువులు పెద్దఎత్తున మహబూబ్ నగర్ వన్‌టౌన్‌పోలీస్‌స్టేషన్‌కు చేరు కుని దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ముందు రెండుగంటల పాటు ధర్నా చేపట్టారు. దాడికి బాద్యులు అయిన నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు.
వివరాల్లోకి వెళ్తే, రవీంద్రనగర్‌కు చెందిన సురేష్ అయ్యప్ప మాల ధరించాడు. గురువారం నాడు ద్విచక్ర వాహనంపై తూర్పు కమాన్ వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని నిదానంగా వెళ్ళమని చెప్పడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకొని వాహనంపై ఉన్న ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు సురేష్ స్వామి పై భౌతికంగా చేయిచేసుకున్నాడు. మాల ధారణ చేసిన వ్యక్తిపై చేయిచేసుకోవడం అక్కడే ఉన్న స్థానికులకు ఆగ్రహం కల్గించింది.
ధర్నా జరుగుతున్న స్థలానికి ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. తరువాత దాడికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయ్యప్ప మాలధారణ చేసి న వ్యక్తిపై జరిగిన దాడిని అఖిలభారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి ప్రధా న కార్యదర్శి సీమ నరేందర్ తీవ్రంగా ఖండించారు.