ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో బిజేపి కౌన్సిలర్ శ్రీనివాస్ ప్రసాద్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెంగళురు రూరల్ జిల్లాలోని అనేకల్ లో హత్య చేసినట్లు అక్కడి పోలీసులు తెలియచేసారు.
కితగానహళ్లి వాసుగా అందరికి తెలిసిన బిజేపి కౌన్సిలర్ మరియు దళిత నాయకుడు అయిన శ్రీనివాస్ ప్రసాద్ పై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపినట్లు బెంగళురు రూరల్ పోలీస్ సుపరెండంట్ వినీత్ సింగ్ పి.టి.ఐ వార్త సంస్థ కు ఫోన్ ద్వార తెలియచేసారు.
హత్య కు గల కారణాలు ఇప్పుడే చెప్పలేము అని, కేసు పరిశోధన చేస్తున్నాం అని సింగ్ తెలియచేసారు.
గత సంవత్సరం అక్టోబర్ 16 నాడు బెంగళురు లో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య తరువాత భారీ ఎత్తున ఆర్.ఎస్.ఎస్- బిజేపి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ హత్యపై రాజేష్ పద్మార్, ఆర్.ఎస్.ఎస్ మీడియా కోఆర్డినేటర్, స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కటిన చర్యలు చేపట్టి ఇలాంటి రాజకీయ ప్రేరేపిత హత్యలను నిలిపి వేయాలి అని కోరారు మరియు తక్షణమే ఈ హత్యపై నిష్పక్షపాతమైన పరిశోదనను జరిపాలని డిమాండ్ చేసారు.
గత రెండు సంవత్సరాలలో 10మందికి పైగా ఆర్.ఎస్.ఎస్- బి.జే.పి-వి.హెచ్.పి కార్యకర్తలు హత్యకు గురి అయినట్లు, ఇది ప్రజాస్వామ్యంలో ఒక అంధోళనకరమైన పరిణామం అని కూడా రాజేష్ పద్మార్ గారు తెలియచేసారు.
చనిపోయిన బిజేపి కౌన్సిలర్ శ్రీనివాస్ ప్రసాద్ మృదు స్వభావి అని తన పై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవు అని కూడా అన్నారు.