Home News భ‌గ‌త్ సింగ్ రాసిన లేఖ‌లు – 3

భ‌గ‌త్ సింగ్ రాసిన లేఖ‌లు – 3

0
SHARE

తాతగారి ప్రతిజ్ఞని పూర్తిచేస్తున్నాను

(కాలేజీ విడిచి పెడ్తూ మరొక ఉత్తరం రాశాడు తండ్రికి- 1923 లో)

పూజ్యులైన తండ్రిగారికి,

నమస్తే. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉత్కృష్ణ మయిన ఆశయాలకి ఆర్పిస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభ వించాలనిలేదు.

మీకు గుర్తు వుండే వుంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను ‘దేశ సేవకి ఆర్పిస్తున్నా’నంటూ నలుగురి మధ్య ప్రకటించారు. నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను – నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను.

మీ సేవకుడు,
భగత్ సింగ్.

—————

(లాహోరు నించి కాన్పూరుకి వెళ్ళిపోతూ, లాహోరు రైల్వేస్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన స్నేహితులతో భగత్ సింగ్ ఇలా అన్నాడు “మిత్రులారా! మీకో విషయం చెబుతున్నా. ఈ ప‌రాధీన భారతదేశంలో నాకు పెళ్ళంటూ జరిగితే, మృత్యువే నా వధువు అవుతుంది. నా శవ యాత్రే పెళ్ళి ఊరే గింపు, అమరవీరులు పెళ్ళి పెద్దలవుతారు”)