Home News సామాజిక సమరసతకు కృషి చేసిన సాహితి వేత్తలు బోయి భీమన్న, గుర్రం జాషువా

సామాజిక సమరసతకు కృషి చేసిన సాహితి వేత్తలు బోయి భీమన్న, గుర్రం జాషువా

0
SHARE

సమాజం లో సమానత్వం  అనే భావన స్థిర పడడానికి సోదరభావం అనేది అత్యంత అవసరం, కాని వివిధ కారణాల వలన సమతల్యత లోపించిన కారణంగా ప్రజల మధ్య అపోహలు, అసమానతలు ఏర్పడినవి. వీటిని పరిష్కరించడానికి బోయి భీమన్న, గుర్రం జాషువా లాంటి వారు సాహిత్యం ద్వార కృషి చేశారు, వారి జీవిత చరిత్ర స్పూర్తిదాయకం అని శ్రీ అప్పాల ప్రసాద్, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, తెలిపారు.

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని వివిధ కళాశాలలో  సమరసత సాహితీ ధృవతారలు  బోయి భీమన్న, గుర్రం జాషువా జయంతుల కార్యక్రమాలు సెప్టెంబర్ 19- 28 వరకు సమరసత సాహిత్య ప్రచార ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా మెదక్ లోని రెండు డిగ్రీ కళాశాలలు, మూడు జూనియర్ కళాశాలల్లో జాతీయ సమైక్యత అనే అంశం పై వ్యాసరచన పోటీలు, భీమన్న, జాషువాల సాహిత్యం పై క్విజ్ పోటీలు,ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ,విద్యార్థులకు వేదిక తరపున బహుమతులు కూడా అందచేశారు.

గీతా జూనియర్ కళాశాలలో 27 వ తేదీన నిర్వహించిన ‘విద్యార్థి సమ్మేళనం’ లో సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ ప్రధాన వక్తగా పాల్గొని మార్గదర్శనం చేశారు. ఇందులో 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

19 వ తేదీన సాధన కళాశాలలో బోయి భీమన్న జయంతి, 28 వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుర్రం జాషువా జయంతి, యువ కవులతో కవి సమ్మేళనం నిర్వహించి సమరసత సాహిత్య ప్రచార ఉద్యమ సమారోప్ నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో వివిధ కళాశాలల కరస్పాండెట్లు, ప్రిన్సిపాల్ లు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు మొత్తం 2000 మంది వరకు పాల్గొన్నారు.