చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఆరు స్వచ్ఛందం సంస్ థలపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ విరాళాల సేకరణ (సవరణ) చట్టం ప్రకారం ఆ సంస్థలకున్న లైసెన్సులు రద్దు చేసింది. వీటిలో నాలుగు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనార్హం. అంతే కాకుండా అమెరికా నుండి విరాళాలు పొందుతున్న మరో రెండు సంస్థలపై నిఘా ఉంచినట్టు కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిని ఉటంకిస్తూ ది హిందూ కథనం ప్రచురించింది. ఆ కధనం ప్రకారం లైసెన్సులు రద్దైన క్రైస్తవ సంస్థల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థలు.. ఎక్రియోసోక్యులిస్ నార్త్-వెస్ట్రన్ గాస్నార్ ఎవాంజలికల్ అసోసియేషన్, నార్తరన్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఎవాంజెలికల్ చర్చెస్ అసోసియేషన్, ముంబైకి చెందిన న్యూ లైఫ్ ఫెలోషిప్ అసోసియేషన్ సంస్థలు ఉన్నాయి.
న్యూ లైఫ్ ఫెలోషిప్ అసోసియేషన్ లైసెన్సు రద్దు కావడానికి లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ సంస్థ చేసిన ఫిర్యాదు అని ఆ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటన బట్టి తెలుస్తోంది.
#VICTORY– Union Home Min impounded #FCRA registration of Mumbai based New Life Fellowship Association- NLFA; #LRO had moved complaint to @HMOIndia on Sept 20/2019 for for the same for their ugly role in spreading #Christian Black Magic n torturing kids for conversion @VHPDigital pic.twitter.com/4qN8hTjqao
— Legal Rights Observatory- LRO (@LegalLro) September 7, 2020
సామాజిక సేవా కార్యక్రమాలు తమ లక్ష్యాలుగా పేర్కొని రిజిస్టస్ట్రేషన్ పొందిన న్యూ లైఫ్ ఫెలోషిప్ సంస్థ, అందుకు విరుద్ధంగా, చట్టవ్యతిరేకంగా 2019 సెప్టెంబర్ 1న ముంబైలో భారీ క్రైస్తవ ప్రార్ధన కూటమి ఏర్పాటు చేసింది. ఆ కూటమికి హాజరైన మహళలు, పిల్లలకు ప్రార్థనలతో రోగాల నయం చేస్తామంటూ కూటమి నిర్వాహకులు వారిపై కొన్ని ప్రయోగాలు చేశారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 ప్రకారం చట్ట వ్యతిరేక చర్యల ద్వారా మూఢనమ్మకాలు ప్రచారం చేసిన ఈ విషయాన్నీ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది.
స్వచ్ఛంద సంస్థలు విదేశీయుల నుండి లేదా విదేశీ సంస్థల నుండి ధనం లేదా వస్తూ రూపంలో విరాళాలు సేకరించాలనుకుంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం హోంశాఖ నుండి లైసెన్సు పొందాలి. గతంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంస్థలు ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం హోంశాఖ గుర్తించి, వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. వాటిలో అత్యధిక సంస్థలు క్రైస్తవ మిషనరీలవే కావడం గమనార్హం.
Source: OpIndia, Legal Rights Observatory