Home News ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు

ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు

0
SHARE
2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో  పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ, ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ  నినాదాలు చేశారు.
దేశంలో ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ప్రవక్తను అగౌరవపరిస్తే సహించేది లేదని ఫ్రెంచ్ కు బలమైన సమాధానం చెప్పాలని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2015 జనవరి 8న ప్యారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఏకే 47 తుపాకులతో ఒక్కసారిగా దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పత్రిక చీఫ్ ఎడిటర్, ముగ్గురు కార్టూనిస్టులతో సహా 12 మంది బలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. కాల్పులు జరిపిన దుండగులు వెళ్తూ వెళ్తూ ” ప్రవక్త పగ తీర్చుకున్నాడు  అంటూ నినాదాలు చేశారు.
ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా చార్లీ హెబ్దో పత్రిక మహమ్మద్ ప్రవక్త కి వ్యతిరేకంగా కొన్ని కార్టూన్లని ప్రచురించింది. గతంలో కూడా  ప్రవక్తపై అనేక కార్టూన్లను ప్రచురించింది.
 అయితే మరోసారి ప్రవక్తకు వ్యతిరేకంగా కార్టూన్లను ప్రచురించడానికి పత్రిక నిర్ణయించుకున్నట్టు ఇటీవల విడుదలైన మ్యాగజైన్లో ప్రకటించింది. “ఉగ్రదాడి ని మేము మర్చిపోలేదని దీనిపై పోరాటాలు చేస్తామని”  పత్రికలోని సంపాదకీయం ద్వారా హెచ్చరించింది.
దీంతో పాకిస్తాన్ లో నిరసనలు వెల్లువెత్తాయి. మహమ్మద్ ప్రవక్త పై కార్టూన్ తిరిగి ముద్రించాలన్న పత్రిక నిర్ణయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శిరచ్ఛేదనమే దైవ దూషణలకు శిక్ష అని ప్ల కార్డులతో నిరసనకారులు ఆందోళనలు చేశారు. తెహ్రిక్ – ఏ – లాబాయిక్ పాకిస్తాన్ నేతృత్వంలో
కరాచీ, రావల్పిండి, లాహోర్, డేరా ఇస్మాయిల్ ఖాన్ లలో  నిరసనలు జరిగాయి. కరాచీ లోని టీఎల్పీ జిల్లా నాయకుడు రాజి హుస్సేన్ ఇలా అన్నారు “మొహమ్మద్ ప్రవక్త పై కార్టూన్లను తిరిగి ముద్రించడం సరికాదని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.