1919 ఏప్రిల్ 13వ తేదీ అది..
సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు..
ఆ ఘోర ఘటనలో దాదాపు వేయి మంది మరణించారు. బ్రిటిష్ వారు మాత్రం అధికారికంగా 379 మంది మాత్రమే చనిపోయారని చెప్పారు. జలియన్ వాలాబాగ్ ఘటపై దేశమంతా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత విషాదకరమైన రోజు ఇది. ఈ దారుణానికి కారణమైన జనరల్ డయ్యర్ లో ఏమాత్రం పశ్చాతాపం లేదు. అతనిపై విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ర్యాంకు తగ్గించడంతో సరిపుచ్చింది.. ఆ తర్వాతి కాలంలో ఉద్దాం సింగ్ అనే యోధుడు బ్రిటన్ లో డయ్యర్ ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.
జలియన్ వాలాబాగ్ లో అనాడు అసువులు బాసిన మన దేశ ప్రజలను గుర్తు చేసుకుందాం.. వారి ప్రాణ త్యాగాలకు ఘనంగా నివాళి అర్పిద్దాం.
Kranthi Dev Mitra