Home News బంగ్లాదేశ్ అక్ర‌మ‌ చొరబాటుదారులను దేశం నుంచి తరిమికొట్టాలి : వి.హెచ్‌.పి డిమాండ్

బంగ్లాదేశ్ అక్ర‌మ‌ చొరబాటుదారులను దేశం నుంచి తరిమికొట్టాలి : వి.హెచ్‌.పి డిమాండ్

0
SHARE

బీహార్‌లోని కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అశ్విని కుమార్ ను అత్యంత దారుణంగా హ‌త్య చేసిన ఇస్లామిక్ జిహాదీలను క‌ఠినంగా శిక్షించాల‌ని అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్ర‌మ చొరబాటుదారులను భార‌త‌దేశం నుంచి తరిమికొట్టాల‌ని వి.హెచ్‌.పి డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని పంతపారా గ్రామంలో మహమ్మద్ ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఒక ముఠా బీహార్ పోలీసు అధికారి అశ్వని కుమార్‌ను శనివారం ఉదయం హత్య చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ వి.హెచ్‌.పి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిలింద్ ప‌రాండే మాట్లాడుతూ జిహాదీల చేతిలో హ‌త్య‌కు గురైన పోలీసు అధికారి మృతి ప‌ట్ల‌ వి.హెచ్‌.పి ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతోంద‌న్నారు. ఇక్క‌డ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌టం ఇది మొద‌టి సారి కాదు అని, గ‌తంలో చాలామంది భ‌ద్ర‌తాద‌ళాల‌పై, పోలీసు అధికారుల‌పై దాడులు జ‌రిగాయ‌ని ఆయన గుర్తు చేశారు.

ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులు అక్ర‌మ మద్యం త‌యారీ, అక్రమ రవాణా చేస్తూ అడ్డుకున్న‌ భద్రతా దళాలపై, పోలీసులపై దాడుల‌కు పాల్ప‌డ‌డం వంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో అనేక సార్లు జ‌రిగాయ‌ని ఆయ‌న అన్నారు. కానీ బెంగాల్ పోలీసు ఉన్న‌తాధికారుల ఉదాసీనత, రాజకీయ నాయ‌కుల‌ అండ‌దండ‌ల‌ కారణంగా ఈ ప్రాంతం నేర‌స్తుల‌కు అడ్డ‌గా మారింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ప్రాంతం జిహాదీ ఉగ్రవాదుల స్లీపర్ సెల్‌గా మారింద‌ని, దీంతో దేశ‌ అంతర్గత భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంద‌ని, ఇప్ప‌టికైనా ఈ హంతకులపై, అక్రమ చొరబాటుదారులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇది బీహారుకు సరిహద్దు ప్రాంతం కావడంతో బీహార్లో నేరం చేసిన దుండగులు ఈ ప్రాంతానికి వచ్చి హాయిగా ఆశ్రయం పొందుతున్నారని, ఎవరైనా పోలీస్ అధికారులు వారిని వెంటాడుతూ ఈ ప్రాంతానికి వస్తే వారిపై కత్తుల‌తో, తుపాకుల‌తో దాడుల‌కు దిగుతూ అంతమొందిస్తున్నారని ఆయన తెలిపారు. బెంగాల్ లో త‌ల దాచుకుంటున్న బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల ఏరివేతకు ఇదే తగిన సమయమని, దీంతో వారికి మన దేశంలో ఉన్న రాజకీయ అండదండలు కూడా బహిర్గతమవుతాయని శ్రీ మిలింద్ పరాండే పేర్కొన్నారు.

Source : ORGANISER