అదొక అనాధబాలికల ఆశ్రమం.. ఏ గోడపై చూసినా దేవుని వాక్యాలే కనిపిస్తాయి. ఓ వైపు ప్రార్థన మందిరం. వాటి నిర్వాహకుడు క్రైస్తవ పాస్టర్… గ్రామీణ పాస్టర్లకు పెద్దాయన.. మొన్నటి వరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు.. అయినా అతనివి ఎన్నెన్నో వికృత చేష్టలు.. ఆదరించాల్సిన వ్యక్తే బాలికలతో వికృత చేష్టలకు దిగాడు. మావయ్యా అని పిలవమంటూనే వారితో అమానుషంగా ప్రవర్తించాడు. కొన్నేళ్లుగా నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఈ తతంగం ఎట్టకేలకు వెలుగు చూసింది. ఒంగోలులోని ఇండియా ఎవాంజిలకల్ రిలీఫ్ ఫెలోషిప్ (ఐఈఆర్‌ఎఫ్) నిర్వాహకుడు కొడవటికంటి జోసఫ్ అకృతాలు అన్నీ ఇన్నీ కావు.
అనాథాశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అన్ని రాష్ట్రాల్లోని ఆశ్రమాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిద్ధ మైంది. జిల్లా ప్రొహిబిషన్ అధికారి ఎస్‌కె ఫరూ క్‌బాషా, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్ సీహెచ్ భారతి తదితరులతో తనిఖీ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ నిర్వహించిన సోదాల్లో 76 ఏళ్ల జోసెఫ్ అకృత్యాలు బయటపడ్డాయి. కమిటీ అధికారులకు అక్కడ జరుగుతున్న ఘోరాలను బాలికలు చెప్పారు. ఒక్కొక్కరుగా కమిటీ చైర్‌పర్సన్ భారతి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాలికలపై వికృత చేష్టలకు పాల్పడిన పాస్టర్ జోసఫ్‌పై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. బాలల సంక్షేమ కమిటీ కన్వీనర్ ఫరూక్‌బాషా ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి జోసఫ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఫోక్సో చ ట్టం 10, 12 జువైనల్ యాక్టు 75, ఐపీసీ 354, 509 కింద కేసు నమోదు చేసి ఎక్సైజ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సుధ నిందితుడు జోసఫ్ కు ఈ నెల30వ తేదీ వరకు రిమాండ్ విధిం చారు. 46 మంది బాలికలకు రాంనగర్‌లోని బాలసదన్‌లో రక్షణ కల్పించారు. బాలసదన్‌లో చేర్పించిన బాలికలను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజావెంకటాద్రి, జిల్లా జాయింట్ కలెక్టర్-2 మార్కండేయులు, ఒంగోలు ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి మాధవి, డీఎంహె చ్‌వో రాజ్యలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్ భారతి, ఐసీడీఎస్ పీడీ సరోజిని తదితరులు విచారించారు.
ఇండియా ఎవాంజిలకల్ రిలీఫ్ ఫెలోషిప్ (ఐఈఆర్‌ఎఫ్) పేరుతో ఒంగోలులోని క్లౌపేటలోని ఆరవ లైను (కృపాదానం వీధి)లో మూడున్నర దశాబ్దాలుగా కొడవటికంటి జోసఫ్ నడుపుతున్నారు. 1983లో రిజిష్టర్ నెం.76తో ఏర్పాటైన ఈ సంస్థకు అధ్యక్షుడిగా జోసఫ్ ఉండగా, సభ్యులుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. సేవ పేరుతో ఆవిర్భవించిన ఐఈఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఎయిడెడ్ పాఠశాల, బాల, బాలికల అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. దీనితోపాటు పాస్టర్ల సమావేశాలు ఏర్పాటుచేయడం, పాస్టర్లకు సహకారం అందించడం కూడా ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలు.
ఐఈఆర్‌ఎఫ్ అనుంబంధంగా అనేక సేవా సంస్థలను స్థాపించారు. యూసీఎల్‌ఐ ఎయిడెడ్ స్కూలు ఏర్పా టు చేయగా, కరస్పాండెంట్‌గా జోసఫ్ కుమారుడు పరాక్రమ్, హెడ్మాస్టర్‌గా ఆయన భార్య రేచల్ ఉన్నారు. అదే విధంగా పాస్టర్స్ సపోర్ట్ సంస్థగా ఏ ర్పాటు చేసి, సదస్సులు నిర్వహిం చడం, వీరికి సహకరించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశా రు. ముఖ్యంగా అనాథ బాల, బాలికల కోసం ఒంగోలు చైల్డ్ హోమ్ ఏర్పాటు చేశారు. మరో అనుబంధ సంస్థ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ పేరుతో కొత్తపట్నంలోని డీటీ కాలనీలో హన్నా కృప, పల్లెపాలెంలో హోలీ లాండ్, బెంగళూరులో హన్నా కృప మెమోరియల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసి, నిధులు భారీగా పోగేసుకున్నట్లు సమాచారం. అయితే నిర్వహణ భారంతో బెంగళూరు, కొత్తప ట్నంలో సేవలను నిలిపివేశారు.
జిల్లాలోనే అతి పెద్ద సంస్థగా ఇండియా ఎవాంజిలకల్ రిలీఫ్ ఫెలోషిప్ కు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తాయి. ఏడాదికి సుమారు రూ. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు విదేశాల నుంచి వస్తున్నట్లు సమాచారం. నిధులన్నీ అనాథ లు, సువార్త పరిచర్య, ఇతర సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. కానీ జోసఫ్ మాత్రం ఆ సొమ్ముతో విలా సవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లలో తిరిగేవారు. ఒంగోలు చిల్డ్రన్ హోంలో (అనాథఆశ్రమం) ఉన్న బాలికలతో పాస్టర్ జోసఫ్ సపర్య లు చేయించుకునేవారు. ఈ విషయాన్ని గతంలో కొందరు పాస్టర్‌ను నిలదీసినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారం అప్పట్లో బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఈసారి సాక్షాత్తు ప్రభుత్వాధికారులకే పట్టుబడిపోవడంలో పాస్టర్ జోసెఫ్ జైలుకు వెళ్లకతప్పలేదు.