Home News భద్రాద్రి కొత్తగూడెం: అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం

భద్రాద్రి కొత్తగూడెం: అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం

0
SHARE

భారతదేశంలో చర్చిల సంఖ్య‌ను పెంచ‌డం అనేది విదేశీ క్రైస్త‌వ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామానికి చెందిన మారుమూల చంద్రయ్య గుంపు అనే పల్లెలో ఇటీవ‌ల వెలుగు చూసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య గుంపునకు చెందిన కొందరు అమాయక గిరిజనులను ఈ ప్రాంతంలోని క్రైస్తవ మిషనరీ దళ సభ్యులు మ‌భ్య‌పెట్టారు. అప్పటి నుండి, వారి సహాయంతో ఈ శక్తులు వీధుల్లో క్రైస్త‌వ ప్రార్థ‌న‌లు వంటి అన్ని రకాల మిషనరీ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇప్పుడు గిరిజన మండలంలో తమ సువార్త కార్యకలాపాలను విస్తరించడానికి, ప్రోత్సహించడానికి ఒక భారీ చర్చిని నిర్మించాలని యోచిస్తున్నాయి. అయితే ఇందుకు ఎంచుకున్న స్థ‌లం నిషేధిత అటవీ ప్రాంతం కిందకు వస్తుందని, ఆ స్థ‌లాన్ని క్రైస్త‌వ మిష‌న‌రీలు నిబంధనలకు విరుద్ధంగా ఆక్ర‌మిస్తున్నార‌ని ఆ గ్రామ‌వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి స్థానిక ప్రభుత్వ సంస్థల నుండి తగిన అనుమతులు తప్పక అవసరమని స్పష్టం చేశారు.

వ్యవసాయ అవసరాల కోసం ఏదైనా స్థలాన్ని సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అటవీ అధికారుల నుండి అనేక సవాళ్లను తాము ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజ‌నులు ఆరోపిస్తున్నారు. కానీ చ‌ర్చి నిర్మాణం విష‌యంలో ఈ క్రైస్తవ శక్తులు అటవీ అధికారులపై ప్రభావం చూపుతున్నాయ‌ని వీరు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

అశ్వాపురం ప్రాంత అటవీ అధికారి ‘ఆర్గనైజర్’ అనే మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ భూమిని ఆక్రమించి మతపరమైన కట్టడమైన చర్చి నిర్మాణంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందిందని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) బాధ్యులు ఆర్గనైజర్‌తో మాట్లాడుతూ, రిజర్వ్‌డ్ ఫారెస్ట్ కేటగిరీకి చెందిన స్థ‌లంలో చర్చి నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమని అన్నారు. 2019లో త‌మ ఫిర్యాదు ద్వారా అక్ర‌మ చ‌ర్చి నిర్మాణాన్ని కూల్చి వేసిన‌ట్టుగానే ఇప్పుడు కూడా సంబంధిత అధికారి కేసును దర్యాప్తు చేసి, నిర్మాణాన్ని కూల్చివేయాలని భావిస్తున్న‌ట్టు తెలిపారు. అక్రమ చర్చి నిర్మాణానికి మద్దతివ్వడంలోను అలానే సమీప ప్రాంతంలోని అమాయక గిరిజనుల నుండి నిధులు సేకరించడంలోను స్థానిక అటవీ అధికారి చురుకుగా పాల్గొంటున్నట్లు గుర్తించిన‌ట్టు తెలిపారు.

అటవీ అధికారులకు LRPF ఇచ్చిన ఫిర్యాదులో… “ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లను నరికి, అక్రమంగా చర్చి నిర్మాణానికి భూమిని ఉపయోగించారు. ఇది తెలంగాణ అటవీ చట్టం, 1967 సెక్షన్ 20 ప్రకారం తీవ్రమైన, శిక్షార్హమైన నేరం.” అని పేర్కొన్నారు. “క్రైస్తవ శక్తులు ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగంగా మొదట్లో వారు అమాయక గిరిజనులను వివిధ ఆకర్షణలతో బ‌ల‌వంతంగా వారిని క్రైస్తవ మతంలోకి మార్చుతారు. ఆ త‌ర్వాత వారి ప‌లుకుబ‌డుల‌ను ఉపయోగించి, మారుమూల గ్రామాల‌కు కూడా చేరుకుని, తమ ప‌నిని విస్తరించే ప్ర‌య‌త్నాలు చేస్తారు. గిరిజనులలో, స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని నిరుత్సాహపరుస్తూ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తారు. గిరిజన ప్రాంతాలకు చేరుకోవడం తమ విజయవంతమైన చర్యగా భావించి, వారు FCRA మార్గాల ద్వారా విదేశీ నిధులను పొందేందుకు విదేశీ దాతల నుంచి పెద్ద మొత్తంలో వ‌సూలు చేస్తారు.

ఈ కుట్ర‌ల గురించి తెలియ‌క మ‌తం మారినవారు చివ‌రికి క్రైస్త‌వ మిష‌న‌రీల భారీ వ్యూహంలో బలిపశువులయ్యారు. క్రైస్తవ శక్తుల చట్టవిరుద్ధమైన ప్రవర్తనను ఎదుర్కొన్నప్పుడు, శక్తిమంతమైన క్రిస్టియన్ నెట్‌వర్క్ దీనిని క్రైస్తవ మతంపై దాడిగా పేర్కొంటూ… మతస్వేచ్ఛకు ముప్పు అంటూ అంతర్జాతీయ వేదికపై వక్రీకరించడం, విస్తరించడం ద్వారా చర్యలలోకి దూకుతుంది. విస్తృతమైన గ్లోబల్ క్రిస్టియన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ప్రభుత్వాన్ని ఏజెన్సీలను బ్లాక్ మెయిల్ చేస్తోంది.

2019లో తమ ఫిర్యాదు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న మసీదును స్థానిక అటవీ అధికారులు కూల్చివేశారని LRPF పేర్కొంది. భౌగోళికంగా, ఈ ప్రాంతం గత 5 దశాబ్దాలుగా మావోయిస్టు, వామపక్ష తీవ్రవాదంచే ఎక్కువగా ప్రభావితమైంది. 2023లో కేంద్ర హోంశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను దేశంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా స‌మీప గ్రామవాసి ఒక‌రు మాట్లాడుతూ.. ఈ ప్రాంతపు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, సంఘ వ్యతిరేక వ్యక్తులు, అర్బ‌న్ నక్సల్స్ ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు చెందిన స్థలాలను దుర్వినియోగం చేయకుండా చూడాలని, ఈ అక్రమ చర్చి నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల‌ని కోరారు.