Home News RSS ప్రధాన కార్యాలయానికి CISF భ‌ద్ర‌త

RSS ప్రధాన కార్యాలయానికి CISF భ‌ద్ర‌త

0
SHARE

నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయానికి భద్రత పెంపు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) భ‌ద్ర‌తా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్ల‌డించింది.

RSS ప్రధాన కార్యాలయానికి సుమారు 15 సంవత్సరాలుగా భద్రత కల్పించిన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, నాగ్‌పూర్ పోలీసుల స్థానంలో ఒక CISF ఉన్న‌తాధికారితో పాటు సుమారు 150 మంది సిబ్బంది చేరారు. సీఐఎస్‌ఎఫ్ బృందానికి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భద్రతా సిబ్బందికి ప్రస్తుతం RSS ప్రధాన కార్యాలయానికి సమీపంలోని పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు.

RSS ప్ర‌ధాన కార్యాల‌యానికి, స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ మోహన్ భగవత్ జీ కి గ‌తంలో వ‌చ్చిన బెదిరింపుల కార‌ణంగా ‘జెడ్ ప్లస్’ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతంలోనే నిర్ణయించింది. 2006 జూన్ లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు.