Home News VIDEO: ఇందిరా గాంధీ ఇంటి ఎదుట సత్యాగ్రహం

VIDEO: ఇందిరా గాంధీ ఇంటి ఎదుట సత్యాగ్రహం

0
SHARE

స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ లక్ష్మి నారాయణ గారు విశ్వసించేవారు. స్వతంత్ర భారత్‌లో అనేక మంది వినియోగించుకుంటున్న పెన్షన్ అవకాశం నిజాం పాలిత ప్రాంతాల యోధులకు దక్కడంలేదు. ఈ అంశంపై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లక్ష్మినారాయణ చర్చలు జరిపారు. అయినా పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. అందుకు నిరసనగా “తెలంగాణ సమరయోధుని సత్యాగ్రహం” అని రాసి ఉన్న ఒక అట్టను మెడలో వేసుకుని అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ నివాసం ఎదుట నిరాహార దీక్షకు ఆయన నాంది పలికారు. శ్రీ కాటం లక్ష్మీనారాయణ గారు చేపట్టిన దీక్షను జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతో సంస్థానాలలోని స్వాతంత్ర్య సమరయోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది. కాటం లక్ష్మీనారాయణ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.