Home News హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు అసదుద్దీన్‌ ఒవైసీపై పోలీసులకు ఫిర్యాదు

హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు అసదుద్దీన్‌ ఒవైసీపై పోలీసులకు ఫిర్యాదు

0
SHARE

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగం హిందువులను కించపరిచేలా ఉందని రాష్ట్ర చలన చిత్ర సెన్సార్‌ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ నందనం దివాకర్‌ శనివారం బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముస్లింల జనాభా పెరగడంపై ఆర్‌ఎ్‌సఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆందోళన చెందుతున్నాయి.

హిందువులు నలుగురు చొప్పున పిల్లలను కనాలని పిలుపునిస్తున్నాయి. కానీ వారు ఒకరినే కనలేకపోతున్నారు. హిందువులు పిల్లలను కనాలంటే ఔరంగాబాద్‌లో రూ.5వేలకు దొరికే తారాపాన్‌ తినండి. అప్పుడు పిల్లలు పుడతారు.’ అని ఒవైసీ ప్రసంగంలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దివాకర్‌ ఆరోపించారు.

హిందువుల మగతనాన్ని ప్రశ్నించడం ఒక పార్లమెంటు సభ్యుడికి తగదన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసదుద్దీన్‌ ఒవైసీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాలానగర్‌ సీఐ భిక్షపతికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన సీడీని ఫిర్యాదుతోపాటు జతచేశారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)