Home News ఒక్క ఆటోలో అంత మంది ప్రయాణికులా? ఇలాగైతే భారత్ జనసంద్రమే..!

ఒక్క ఆటోలో అంత మంది ప్రయాణికులా? ఇలాగైతే భారత్ జనసంద్రమే..!

0
SHARE

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేఫూర్ జిల్లాలో వాహనాల రాకపోకలను నియంత్రించే పనిలో పోలీసులు ఉండగా వారి దృష్టిని అత్యంత వేగంగా పోతున్న ఒక ఆటో ఆకర్షించింది. అప్రమత్తమైన పోలీసులు అడ్డూ అదుపూ లేకుండా పరుగులు తీస్తున్న సదరు ఆటోను వెంబడించారు. ఎట్టకేలకు వాహనాన్ని ఆపారు. ఆటో ఆగిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దిగాలని పోలీసులు సూచించారు. చీమలపుట్టను కదలించినట్టుగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వరుసగా దిగుతున్న ప్రయాణికులను చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఇలా కాదని ఆటో నుంచి దిగుతున్నవారిని ఒకటి, రెండు అంటూ లెక్కపెట్టడం ప్రారంభించారు. అలా లెక్కపెట్టగా లెక్కపెట్టగా ఆటోలో నుంచి మొత్తంగా డ్రైవర్‌తో పాటుగా 27 మంది కిందకు దిగిన వైనాన్ని చూసి పోలీసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆటోలో ప్రయాణిస్తున్న అంత మంది ప్రయాణికుల్లో వయోవృద్ధుల నుంచి చిన్నారుల దాకా ఉన్నారు. ఆటోలో అధిక జనాభాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఇంతకీ ఈ ప్రయాణికులు ఎవరూ ఎక్కడి నుంచి వస్తున్నారంటే.. వీరంతా బక్రీద్ ప్రార్థనలు ముగించుకొని వారి స్వగ్రామానికి వెళుతున్నారు. డ్రైవర్ చెప్పినదాన్ని బట్టి అతడి ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 26 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. ఈద్ వేడుకల్లో పాల్గొనడం కోసం వారి బంధువుల నివాసానికి వెళ్ళి వస్తున్నారు. అంత మందిని వారి స్వస్థలానికి చేర్చే సాహసానికి పూనుకోవడానికి ఏ ఒక్క వాహనం ముందుకు రాకపోవడంతో సదరు ఆటో డ్రైవర్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 26 మంది ముస్లిములను తన ఆటోలో వేగంగా తీసుకువెళ్తూ పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు వెంటాడటంతో అంత మంది ప్రయాణికులతో పాటుగా ఇట్టే దొరికిపోయాడు. పోలీసులు ఆటోను, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఒక్క ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది ముస్లిములను చూస్తుంటే, ‘దేవుడి దయ’ అంటూ సంతానాన్ని పెంచుకుంటూ పోతే, నియంత్రణ లేని జనసంద్రంలో భవిష్య భారత్ కనిపిస్తున్నది.