Home Telugu Articles ‘రోహింగ్యా’ల వలసలు – ఓ పెద్ద కుట్ర!

‘రోహింగ్యా’ల వలసలు – ఓ పెద్ద కుట్ర!

0
SHARE

‘రోహింగ్యా’లు మాయన్మార్ లోని రాఖీని రాష్ట్రంలో నివసించే ముస్లింలు. వీళ్ళు వలసల రూపంలో పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ మీదుగా వచ్చి కాశ్మీర్ లోని జమ్మూ పరిసర ప్రాంతాలలో స్థిరపడుతున్నారు. ఇలా స్థిరపడటంలో కాశ్మీరీ ముస్లింల సహకారం వీరికి దండిగా ఉంది. 2015లో వీరి అక్రమ వలసల గురించి దేశంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వీరంతా మయన్మార్ లో బతకలేక వచ్చిన శరణార్థులు కారు. రోహింగ్యాలు వలసదారులుగా వచ్చి కాశ్మీరులో చట్టవిరుద్ధంగా స్థిరపడటం 2008లో కాంగ్రెస్-నేషనల్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి కొనసాగుతోంది.

వలసల రూపంలో కాశ్మీరులోకి చొచ్చుకు వస్తున్న రోహింగ్యాలకు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల అండదండలున్నాయి. వీరికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కాశ్మీరీ ప్రజలకు వారు ఈ సంస్థలు హెచ్చరిక చేసేయి కూడా.

“మయన్మార్ లో ముస్లింలపై జరుగుచున్న అత్యాచారాలు భరింపరానివిగా ఉన్నాయి. అందుకే నేను బంగ్లాదేశ్ మీదుగా కోల్ కతాకి వలస వెళ్ళిపోయాను. తరువాత నేను ఢిల్లీకి వెళ్ళి కుటుంబపోషణ కోసం బిచ్చమెత్తుకున్నాను. ఢిల్లీలోనే నాకు ఒక కాశ్మీరీ ముస్లిమ్తో పరిచయం ఏర్పడింది. భారతదేశం మొత్తం మీద జమ్మూకాశ్మీరులోనే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా జీవిస్తున్నారని అన్నాడు. అందుకని నేను 2008 నుండి కాశ్మీరులో స్థిరపడ్డాను” అంటాడు మోల్వీ యూనస్. ఇతని వయస్సు 39 ఏళ్ళు. వలసదారులుగా జమ్మూలోకి చొరబడిన వేల రోహింగ్యా ముస్లింలలో యితడు ఒకడు.

జమ్మూ పరిసర ప్రాంతాలలో 20 వేల మంది రోహింగ్యా ముస్లింలు, 50 వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు చట్టవిరుద్ధంగా నివాసస్థావరాలు ఏర్పరచుకున్నారని ఒక అంచనా. ఇలా అక్రమ వలసదారులు నివాసమేర్పరచుకున్న సంబా ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి.

2016 జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలలో సమర్పించిన ఒక అధికారిక నివేదిక ప్రకారం ఆ జమ్మూ పరిసర ప్రాంతాలలో అక్రమంగా వచ్చి స్థిరపడిన 13,433 వముస్లింలు ఉన్నారు. వీరిలో 5,743 మంది రోహింగ్యా ముస్లింలు, 7,690 మంది టిబెటన్ ముస్లింలు. కాశ్మీర్ లోయలో ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా నివసించడంలేదు. కారణం అక్కడి స్థానిక ముస్లింలు వీరిని వ్యతిరేకించడమే.

జమ్మూలో స్థిరపడిన రోహింగ్యా ముస్లింలకు లాయర్లు, ఎన్జీవో సంస్థల మద్దతు ఉందని మోల్వీ యూనస్ అంటాడు. శ్రీనగర్ కి చెందిన మహమ్మద్-ఉల్-ఉమర్ నిర్వహిస్తున్న శాఖావత్ సెంటర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ వంటి సంస్థలకు ఈ ఎంజీవోల సహకారం ఉంది. నిజానికి జమ్మూ కాశ్మీరులో భారత్ కు వ్యతిరేకంగా “ఆజాదీ” డిమాండు చేస్తున్నవారికి మద్దతుగా రోహింగ్యాలను రప్పిస్తున్నారు.

హిజ్బుల్ ముజాహిదీన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు రోహింగ్యా ముస్లింలకు పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నాయి. రోహింగ్యాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆ సంస్థలు స్థానిక ప్రజలను హెచ్చరిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపై కూడా వీరి ప్రభావం పడుతోంది. రోహింగ్యాల పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మెతక వైఖరినే అవలంబిస్తోంది. రోహింగ్యాలను జమ్మూ-కాశ్మీర్ నుంచి పంపేయాలన్న భాగస్వామ్య పక్షం బీజేపీ డిమాండును ఆమె తోసిపుచ్చింది. రోహింగ్యాలు ఏ విధమైన విధ్వంసాలకూ పాలబడటంలేదనీ, కాబట్టి వారిని బయటికి పంపివేయాలనుకోవడం సరియైనది కాదనీ మెహబూబా జమ్మూ అసెంబ్లీలనే రోహింగ్యాలను వెనకేసుకొచ్చింది.

ముఖ్యమంత్రి మాటలను బట్టి రోహింగ్యా ముస్లింలకు జమ్మూ-కాశ్మీర్లో అధికారిక సమర్ధన ఉందని అర్థమౌతోంది. రోహింగ్యాలకు ప్రభుత్వం అధికారికంగానే సహకరిస్తోందనడానికి నాలుగు ప్రధాన ఆధారాలున్నాయి.

  1. జమ్మూలోని తావీనది పొడుగునా రక్షణపరంగా అత్యంత కీలకమైన కొండలలో, అడవులలో రోహింగ్యాలు తమ స్థావరాలను ఏర్పరచుకున్నారు. జమ్మూ పరిసర ప్రాంతాలైన బతింది, నర్వాల్, తలాబ్ తిలో, భగవతి నగర్, విధాతా నగర్, రెహారి, బేలీచరనలలో రోహింగ్యాలు ఏళ్ళ తరబడి పట్టుకుపోయారు.
  2. నర్వాల్ ప్రాంతంలో రోహింగ్యాలు ఒక మార్కెట్ నడుపుతున్నారు. ఈ మార్కెట్ ని వారంతా “బర్మా మార్కెట్” అని పిలుస్తారు.
  3. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల సంఖ్య 80 శాతం పైనే. వీటిలో నర్వాల్ బాల పాఠశాల ఒకటి. ఇది గమనించిన ఆ రాష్ట్ర బీజేపీ ఎం.ఎల్.సి. బిక్రమ్ రన్ధావా ఇతర ప్రాంతాల నుండి వఛ్చిన ఎవరికీ కూడా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాలయంలోనూ ప్రవేశానుమతి ఇవ్వరాదని అన్నారు.కేంద్రం ప్రభుత్వ “బేటీ బచావో .. బేటీ పడావో” పథకం ద్వారా రోహింగ్యా బాలికలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. వారికి చదువులు చెప్పడానికి 24 మంది రోహింగ్యాలనే టీచర్లుగా నియమించేరు. వారి జీతాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశీ ముస్లింలు ఫోర్జరీ చేసిన ధృవపత్రాలను ఉపయోగించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ఇందుకు వారి సానుభూతిపరుల సహకారం కూడా ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
  4. జమ్మూ కాష్మీరులోని రోహింగ్యా ముస్లింలందరికీ ఆధార కార్డులు, రేషన్ కార్డులు, వోటర్ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు ఇతర ప్రభుత్వపరమైన గుర్తింపు కార్డులు ఉన్నాయి. విద్యుదుత్పత్తి శాఖ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ వీరికి విద్యుత్, మంచినీటి కూడా సరఫరా చేస్తున్నాయి. స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో రోహింగ్యాలు తమకు కావలసిన అన్నిరకాల పత్రాలను పొందారని జమ్మూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు చెప్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (JCCI), జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్, జమ్మూ (JKHCBAJ) వంటి సంస్థలు, రాజకీయ వర్గాలు, మత, సామాజిక సంస్థలు రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వీరి వలసల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అభిప్రాయపడుతున్నాయి. వీరి వలసలు జాతీయ భద్రతకు ప్రమాదకరంగా పరినమించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ జనాభాలో మతపరమైన నిష్పత్తిలో పెను మార్పులు రానున్నాయని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని 370, 35-A అధికరణాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకి కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను, హక్కులను బయటి రాష్ట్రాల నుండి వచ్చినవారికి వర్తింపజేయరాదనీ, అందుకని రోహింగ్యాలను బయటికి గెంటివేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. “370వ అధికరనాన్ని రద్దుచేయండి లేదా దానిని పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకే వర్తింపజేయండి” అన్నది ఇప్పుడు వారి సరికొత్త నినాదమయ్యింది.

రాజకీయ, మత, సామాజిక సంస్థలే కాదు ఇంటలిజెన్స్ వర్గాలు కూడా జమ్మూ కాశ్మీరులో రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ వలసదారులలో కొందరు వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారనీ, నల్లమందు వంటి మత్తుపదార్థాల రవాణాకి సహకరిస్తున్నారానీ, వీరి వల్ల జాతీయ భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి.

మయన్మార్, బంగ్లాదేశ్ లు తమ దేశాలలోకి రోహింగ్యాల చొరబాటును అనుమతించలేదు. వారివల్ల తమ భద్రతకు ముప్పు ఉందని అంటున్నారు. మరోప్రక్క తమదేశంలో అక్రమంగా నివాసాలేర్పరచుకున్న 12 వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు తక్షణం బయటికి వెళ్లాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కానీ మనదేశంలో మాత్రం అక్రమంగా వలసలు వచ్చి స్థిరపడ్డ రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు భారత రాజ్యాంగం కల్పించే అన్ని సదుపాయాలనూ దర్జాగా అనుభవిస్తున్నారు. వోటు బ్యాంకుల కోసం ఆరాటపడే రాజకీయ పక్షాలు కూడా వీరికి అండగా నిలుస్తున్నాయి.

కాబట్టి జమ్మూ కాశ్మీరులో అక్రమ వలసదారుల సమస్యను తీవ్రంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ రోహింగ్యాలు మరో లష్కర్-ఎ-తోయిబా (ఎల్.ఈ.టి.) గా తయారయ్యే ప్రమాదం ఉంది.

Source: Duggirala RajaKishore’s Article in Unnamata