
బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరకంగా లుషాయ్ పర్వత ప్రాంతానికి చెందిన ఎంతో మంది వీరవనితలు పోరాడినట్లు చెబుతారు. అయితే దురదృష్టవశాత్తు వారి గాధలు, జానపద కథల్లో మినహాయించి చారిత్రక రికార్డుల్లో ఎక్కడా అందుబాటులో లేవు. అందులో ఒక వీరవనిత రిపూయిలియాని. 1828 జన్మించిన ఈమె ఉత్తర మిజో నాయకుడు, లాల్సావుంగా కుమార్తె. దక్షిణ లుషాయ్ పర్వత ప్రాంత నాయకుడు వండులాను పెళ్లిచేసుకుంది.