Home Hindi రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ నూత‌న‌ స‌ర్ కార్య‌వాహ‌గా మాన‌నీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ నూత‌న‌ స‌ర్ కార్య‌వాహ‌గా మాన‌నీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే

0
SHARE

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ నూత‌న స‌ర్ కార్య‌వాహ‌గా మాన‌నీయ శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే గారు ఎన్నిక‌య్యారు. మూడు సంవ‌త్స‌రాలకు ఒకసారి స‌ర్ కార్య‌వాహ ఎన్నిక జ‌రుగుతుంది. అందులో భాగంగా బెంగ‌ళూర్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న అఖిల భార‌తీయ ప్ర‌తినిధి మ‌హాస‌భ‌ల‌లో ద‌త్తాత్రేయ హోస‌‌బ‌లే గారు స‌ర్‌కార్య‌వాహ‌గా ఎన్నిక‌య్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో పాల్గొనే ప్రతినిధులు సర్ కార్యవాహను ఎన్నుకుంటారు. సుదీర్ఘకాలంగా ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా ఉన్న శ్రీ దత్తాత్రేయ హొసబలే 2009 నుంచి ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అంత‌క ముందు స‌ర్ కార్య‌వాహ‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన శ్రీ భయ్యాజీ జోషి గారి స్థానంలో ప్ర‌స్తుతం ద‌త్తాత్రేయ హోస‌బ‌లే గారు సర్ కార్యవాహగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.