Home News RSSపై దుష్ప్రచారంతో కూడిన కథనాలు.. ఇవీ అసలు వాస్తవాలు

RSSపై దుష్ప్రచారంతో కూడిన కథనాలు.. ఇవీ అసలు వాస్తవాలు

0
SHARE

-పంకజ్ జగన్నాథ్ జేస్వాల్

ఒక దేశభక్తుడు లేదా మెరుగైన సమాజం, మెరుగైన దేశం కోసం అంకితమైపోయిన ఒక సామాజిక సేవా సంస్థ చేపట్టిన పవిత్రమైన కార్యంతో స్వార్థపూరితమైన, సంఘ వ్యతిరేక శక్తులు పోటీపడలేవు. అలాంటి వ్యక్తి లేదా సంస్థను అప్రతిష్ఠ పాల్జేయడమే వారి ముందున్న ఏకైక ఐచ్ఛికం. ఒక కల్పితమైన కథనంతో సోషల్ మీడియా వేదికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)కు అపకీర్తి కలిగిస్తున్నారు.

దాదాపు 14,000 వేలకుపైగా సేవా ప్రాజెక్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం, దేశం ఔన్నత్యాన్ని అభివృద్ధి చేయడానికి అంకితమైన ఒక సంస్థను అప్రతిష్ఠ పాల్జేయడానికి కొందరు వ్యక్తులు లేదా సంస్థలు ఎంతగా దిగజారిపోయారో తెలియపరచడానికి అభూత కల్పనలతో కూడిన మూడు కథనాలను మీ ముందు ఉంచుతున్నాను.

బ్రిటీష్ రాణికి RSS గౌరవ వందనం సమర్పించుకుందా?

బ్రిటీష్ సామ్రాజ్యానికి RSS పరాధీనమైనట్టుగా పేర్కొనే పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రాణి ఎలిజబెత్‌-2 కు RSS శ్రేణులు గౌరవ వందనం చేస్తున్నట్టుగా ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. ఆ ఫొటో‌కు క్యాప్షన్‌గా “రాణి కో సలామీ దేతే RSS.. అంగ్రేజోం కే గులామ్” (రాణీకి వందనం చేస్తున్న RSS.. ఆంగ్లేయులకు బానిస) అని ఉంది. RSSను వలస పాలకులకు ఒక ‘బానిస’ గా పేర్కొంది. “తస్వీర్ గవాహీ దే రహీ హై దేశ్ కీ ఆజాదీ కే పెహ్లే. తో లోగ్ అంగ్రేజోం కో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ దే రహే జబ్ దేశ్ కే లోగ్ ఆజాదీ కే లియో లడ్ రహే” (“దేశానికి స్వరాజ్యం రాకముందు నాటి ఘటనకు చిత్రం అద్దం పడుతున్నది. దేశ ప్రజలు స్వరాజ్య సమరం సాగిస్తుండగా వారు ఆంగ్లేయులకు గౌరవ వందనం చేస్తున్నారు”).

సదరు ఇమేజ్‌‌కు ఇండియా టుడే పత్రికకు చెందిన వైరల్ టెస్ట్ చేయగా ఫలితాల్లో వాస్తవం బైటపడింది.

ఫొటోలో కనిపిస్తున్న ఎలిజబెత్-2.. 1952 సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన సింహాసనాన్ని అధిష్టిస్తున్న సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. అంటే భారత్‌కు స్వరాజ్యం సిద్ధించిన దాదాపు ఐదు సంవత్సరాల నాటి ఫొటో అది. ఆమె రాణి హోదాలో తొలిసారిగా 1961లో భారత్‌లో పర్యటించారు. ఆన్‌లైన్‌లో సంఘ్ వ్యతిరేకుల ఫొటోషాప్ నైపుణ్యాలను వైరల్ టెస్ట్ బహిర్గతం చేసింది.

వాస్తవానికి 1956లో కడునా విమానాశ్రయానికి రాణి చేరుకున్న సందర్భంగా నైజీరియా బలగాలపై RSS శ్రేణుల ఇమేజ్‌లను సూపర్ ఇంపోజ్ చేశారు.

వాస్తవిక ఇమేజ్ రాయల్ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రంటయిర్ ఫోర్స్‌గా పేరు మార్చుకున్న తన నైజీరియా రెజిమెంట్‌ను రాణి సందర్శిస్తున్న వైనాన్ని చూపుతున్నది. సూపర్ ఇంపోజ్ చేసిన సంఘ్ శ్రేణుల ఫొటోలను కొద్ది సంవత్సరాల క్రితం తీసినట్టుగా వెలుగులోకి వచ్చింది. సంఘ్ చేస్తున్న ‘గౌరవ వందనం’ ఫొటో ఫోర్జరీదని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ SM Hoax Slayer, ABP News 2016లో కనుగొన్నాయి. అయినప్పటీకి, అదే ఇమేజ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిని బట్టి బ్రిటీష్‌వారికి అనుకూలంగా RSS ఉందని చూపే దురుద్దేశ్యంతోనే ఫొటోషాపింగ్ అనంతరం సోషల్ మీడియాలో సదరు ఫొటో పంపిణీ జరిగినట్టు తేటతెల్లమవుతున్నది.

భగత్ సింగ్ తరపున ఒక ముస్లిం లాయర్ వాదించగా.. ఆయనకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారి కోసం ‘RSSకు చెందిన ఒక బ్రాహ్మణ వ్యక్తి’ న్యాయ పోరాటం చేశారా? ఫ్యాక్ట్ చెక్ చేసిన Opindia

స్వరాజ్య సమరంలో విప్లవకారుడు భగత్ సింగ్‌ను తమకు ఇష్టానుసురంగా అదేపనిగా వాడుకోవడంలో లెఫ్టిస్టు లౌకిక ఉదారవాదులు ముందుంటారు. విప్లవ జ్యోతి భగత్ సింగ్ గురించి పెద్ద సంఖ్యలో అసత్యాలు, అబద్ధపు వార్తలను వారు వ్యాపింపజేశారు.

ఈ ఏడాది భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఒక దుష్ప్రచారం చేశారు. ప్రజావ్యతిరేకమైన బిల్లులకు నిరసనగా న్యూఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో భగత్ సింగ్ తరఫున అసఫ్ అలీ వాదించగా, RSS వ్యవస్థాపకులు డాక్టర్ జీకి సన్నిహిత మిత్రులు, RSS సభ్యులు రాయ్ బహదూర్ సూర్యనారాయణ శర్మ భగత్ సింగ్‌కు ఉరిశిక్ష విధించాలని కోరుతూ బ్రిటీష్ పాలకుల తరఫున వాదించారనే దుష్ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తింది. అయితే అసఫ్ అలీ విషయంలో సోషల్ మీడియా వినియోగదారులు చేస్తున్న దుష్ప్రచారానికి, కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సభ్యులు చెబుతున్న వాస్తవానికి పొంతన లేకుండా ఉన్నది.

‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక ప్రకారం బటుకేశ్వర్ దత్ తరఫున అసఫ్ అలీ వాదించగా, ఒక న్యాయ సలహాదారు సహాయంతో భగత్ సింగ్ తన కేసుపై స్వంతంగా న్యాయ పోరాటం చేశారు.

అంతేకాకుండా, సర్దార్ భగత్ సింగ్‌పై అనేక పుస్తకాలను రచించిన ప్రొఫెసర్ మల్వీందర్‌జిత్ సింగ్ వారిచ్.. భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటీష్ ప్రభుత్వం తరఫున సత్యనారాయణ శర్మ అనే లాయర్ వాదించారంటూ వ్యాపించిన కథనాన్ని తోసిపుచ్చారు.

మరో దుష్ప్రచారం: RSS త్రివర్ణ పతాకాన్ని గౌరవించదు

త్రివర్ణ పతాకం, నెహ్రూ, RSS

ఫైజాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పార్టీ అధ్యక్షులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 80 అడుగుల ఎత్తైన స్తంభానికి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అయితే జాతీయ జెండా పూర్తిగా పైకి వెళ్లకుండా స్తంభం మధ్యలోనే చిక్కుకుపోయింది. అంత ఎత్తున్న స్తంభాన్ని పతాకాన్ని సరిచేసే సాహసానికి ఏ ఒక్కరూ పూనుకోలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో జన సమూహం మధ్యలో నుంచి ఒక యువకుడు ముందుకు దూసుకువచ్చారు. అందరూ చూస్తుండగానే స్తంభాన్ని అవలీలగా ఎక్కేసి జాతీయ పతాకాన్ని సరిచేయడంతో స్తంభం శిఖరాగ్రాన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్తంభం నుంచి కిందకు దిగి వచ్చిన ఆ యువకుని అక్కడ ఉన్నవారంతా వారి భుజాలపైకి ఎత్తుకున్నారు. నెహ్రూ దగ్గరకు తీసుకురాగా ఆయన సదరు యువకుని అభినందనపూర్వకంగా భుజంపై తట్టారు. సాయంత్రం బహిరంగ సమావేశానికి వస్తే తగువిధంగా సత్కరించుకుంటామని ఆ యువకునితో నెహ్రూ అన్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు నెహ్రూతో “అతడిని ఆహ్వానించకండి ఎందుకుంటే అతడు సంఘ్ శాఖకు వెళుతుంటాడు” అని చెప్పారు. అత్యంత సాహసంతో స్తంభం పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని సరిచేసి, స్తంభం శిఖరాగ్రాన నిలిపిన ఆ యువకుడు ఫైజ్‌పూర్‌లో జల్‌గావ్‌కు చెందిన కిషన్ సింగ్ రాజ్‌పుత్. విషయం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీ ఆ స్వయంసేవకుని స్వయంగా కలిశారు. అభినందనపూర్వకంగా ఒక చిన్న వెండి పాత్రను అతడిని డాక్టర్ జీ సమర్పించారు.

మొదట్లో ప్రస్తావించిన దురుద్దేశ్యంతో కూడుకున్న కథనాలు సోషల్ మీడియాలో పంపిణీ అవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే దానర్థం అవాస్తవాలను వ్యాపింపజేయడం కాదు. సంఘ్ స్వయంసేవకులు ఇలాంటి వాటి ప్రభావానికి లోనుకాకుండా స్థిరచిత్తంతో వారి కార్యాచరణను కొనసాగిస్తున్నారు.
అసత్యాన్ని కేవలం నిరాకరించడంతో సరిపుచ్చుక దానికి సరైన ఆధారాలను చూపించాలని అలాంటి అసత్యాలను వ్యాపింపజేసేవారిని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆరోపణలు అనేవి నివురుగప్పిన నిప్పుతో సమానం. వాటిని ఎంత త్వరగా చల్లారిస్తే అంత మంచిది.

SOURCE: ORGANISER