సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ మోసం చేసింది. పాక్ నుంచి సౌదీకి నర్సులుగా పనిచేయడానికి వెళ్లిన 92 మంది బాలికల ధ్రువపత్రాలు పూర్తిగా నకిలీవని అధికారుల పరిశీలన తేల్చారు. సౌదీకి నర్సులుగా పాక్ నుంచి వచ్చిన చాలా మంది బాలికల సర్టిఫికేట్లు ఒఠ్ఠి నకిలీవని గుర్తించేశారు. చాలా మందివి తప్పుగానే వున్నాయని అధికారులు తేల్చారు. అందరి సర్టిఫికేట్లపై ఒకటే భాష, ఒకే అర్హతలు రాసి వున్నాయని తేలింది. దీంతో సౌదీ అధికారులు మరింత పకడ్బందీగా వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఆ 92 మంది బాలికలను తిరిగి పాకిస్తాన్‌కే పంపిచేశారు. ఈ పాక్ మోసం చాలా రోజులుగా జరుగుతోందని సౌదీ ఎట్టకేలకు గుర్తించింది. ఇదంతా పాక్ అధికారుల తప్పిదమేంటూ బాలికలు అంటున్నారు. అందరి సర్టిఫికేట్లపై ఒకే భాష, అర్హతలు ఎలా వుంటాయని సౌదీ అధికారులు సూటిగా నిలదీస్తున్నారు.
ఈ పాక్ మోసం బట్టబయలు కావడంతో వెంటనే సౌదీ పరిపాలనా అధికారులు రంగంలోకి దిగారు. ఈ 92 మంది నకిలీ నర్సులను పాక్‌కి పంపడమే కాకుండా… ఈ మోసానికి పాల్పడిన కంపెనీని బ్లాక్ లిస్టులో పడేసింది. ఈ మోసం బయటపడటంతో చాలా మంది పాక్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమను పాక్ తమ్ముళ్లంటూ పిలుస్తుంటుందని, అలాంటి మమ్మల్నే పాక్ మోసం చేసి బుద్ధి చూపించుకుందంటూ సౌదీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సౌదీ జర్నలిస్టులు భారత్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. సౌదీలో కొందరు భారతీయులు కూడా నర్సులుగా పనిచేస్తున్నారని, అత్యంత నిజాయితీతో మెలుగుతున్నారని, భారత్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ నకిలీ వ్యవహారం బయటకి రావడంతో పాక్ పరువు పోయిందని ప్రపంచ దేశాలు అంటున్నాయి.