
తెల్లదొరలను వణికించిన `మాకొద్దీ తెల్లదొరతనము` గీతం అపూర్వ దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. స్వతంత్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణకు పర్యాయపదం. బ్రిటీష్‌వారు తనను నిర్బంధించినప్పడు “ధర్మనిర్వహణలో భాగంగా జైలుకు వెళుతున్నాను. నా శరీరం నిర్బంధానికి గురైనప్పటికీ సాహిత్యం ద్వారా నా ఆత్మను దేశం మీదకి వదిలేశాను. ఈ దుర్బల శరీరం కంటే నా పాట శక్తిమంతమైనది. దానిని ఆంగ్లేయులు తమ ఉనికికే ప్రమాదమని భావించి నన్ను బంధించినా నా పాట ద్వారా ప్రజల మధ్య ఉంటాను` అని గరిమెళ్ళ సత్యనారాయణ చాటి చెప్పారు.