Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

అశ్ఫాకుల్లా ఖాన్

కాకొరినిట దోచె కరపత్రములొదిలి
దేశ స్వేచ్చ కొరకు దేహ మిచ్చె
అల్ప వయసు నందు అశ్ఫాకు కదిలెను
వినుర భారతీయ వీర చరిత

భావము

దేశమాత స్వేచ్ఛ కొరకు 23 ఏళ్ళ చిన్నవయసులో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. బ్రిటిషువారిని బెదరగొట్టడానికి కరపత్రాలను పంచారు. రాంప్రసాదు బిస్మిల్‌తో కలిసి విప్లవోద్యమానికి ధనసేకరణ కోసం కాకోరీ రైలు దోపిడీ చేశారు. మూడు సంవత్సరాల అనంతరం మిత్ర ద్రోహం కారణంగా బ్రిటిషువారికి దొరికిపోయారు. 27 ఏళ్ళ చిరు ప్రాయంలో ఉరికంబమునెక్కారు. దేశామాత స్వేచ్ఛ కొరకు దేహమిచ్చిన అశ్ఫాకుల్లా ఖాన్ వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్