గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి వీలుగా రాజ్యాంగ సవరణను చే యాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించడం చైనా ప్రభుత్వ విస్తరణ వ్యూహంలో భాగం. గిల్గిత్- బాల్టిస్థాన్ అనాదిగా జమ్మూ కాశ్మీర్‌లో భాగం, జమ్మూ కాశ్మీర్ అనాదిగా భారత్‌లో భాగం. 1947లో దేశ విభజన జరిగింది. అఖండ భారత్‌లోని ‘ఇస్లాం’ జన బాహుళ్య ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడ్డాయి. ఇలా పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే ‘జిహాదీ’లు పాకిస్తాన్‌లోని హిందువులను నిర్మూలించారు, చంపేశారు, మతం మార్చారు, మానభంగాలు చేశారు, తరిమి వేశారు. ఈ చర్యలతో తృప్తిపడని పాకిస్తానీ పైశాచిక జిహాదీలు 1947 అక్టోబర్‌లో మన జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడ్డారు. గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతంలోను మీర్‌పూర్, ముజఫరాబాద్ ప్రాంతంలోను హిందువులను నిర్మూలించారు. ఈ నిర్మూలనకు పాకిస్తాన్‌లో నాలుగు పద్ధతులను అనుసరించారు. అన్యమత నిర్మూలనకు ‘ఇస్లాం జిహాదీ’లు ఈ నాలుగు పద్ధతులను అనుసరించడం క్రీస్తుశకం ఏడవ శతాబ్ది నుంచి నడుస్తున్న చరిత్ర. జిహాదీలతో పాటు చొరబడిన పాకిస్తాన్ సైనికులు జమ్మూ కాశ్మీర్ అంతటా భయంకర బీభత్సకాండను సృష్టించారు. మన సైనికదళాలు పాకిస్తాన్ సైనికులతోను, జిహాదీలతోను తలపడి తిప్పికొట్టాయి. అయినప్పటికీ మన సైనికులు జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్ దురాక్రమణ నుంచి పూర్తిగా విముక్తం చేయకముందే అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అర్ధాంతరంగా యుద్ధం ఆపివేయించారు. ఫలితంగా జమ్మూ కాశ్మీర్‌లోని పశ్చిమ వా యువ్య ఉత్తర ప్రాంతంలోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్తాన్ దు రాక్రమణలోనే కొనసాగుతోంది. పాకిస్తాన్ దు రాక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఉత్తర భాగాన ‘గిల్గిత్- బాల్టిస్థాన్’ ప్రాం తం నెలకొని ఉంది. దీన్ని ‘ఉత్తర ప్రాంతం’ అని కూడా అంటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ దక్షిణ ప్రాంతంలో మీర్‌పూర్, ముజఫరాబాద్ జిల్లాలు నెలకొని ఉన్నాయి. మీర్‌పూర్, ముజఫరాబాద్, గిల్గిత్, బాల్టిస్థాన్ మొత్తం వైశాల్యం ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్లు. ‘మీర్‌పూర్- ముజఫరాబాద్’ ప్రాంతాన్ని ‘విముక్త కాశ్మీర్’- ఆజాదీ జమ్మూ కా శ్మీర్-గాను ఉత్తర ప్రాంతాన్ని ‘గిల్గిత్- బాల్టిస్థాన్’గాను విడగొట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం రెండు ప్రత్యేక పాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. ఇలా పాలనా విభాగాలను ఏర్పాటు చేయడం చైనా పన్నాగంలో భాగం. చైనా ఒత్తిడి వల్లే 2009-10లో పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిత్ ప్రాంతానికి ప్రత్యేక శాసనసభను, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సంపూర్ణ సమగ్ర రాష్ట్రం హోదాను కట్టబెట్టడానికి వీలుగా రాజ్యాంగ సవరణకు పాకిస్తాన్ ప్రభుత్వం పూనుకొంది. దురాక్రమించిన జమ్మూ కాశ్మీర్ నుంచి గిల్గిత్- బాల్టిస్థాన్‌ను శాశ్వతంగా విడగొట్టడం ఈ రాజ్యాంగ సవరణ లక్ష్యం. ఎందుకంటే 1963లో చైనాకు పాకిస్తాన్ ప్రభుత్వం అప్పగించిన ఐదువేల చదరపుకిలోమీటర్ల భూభాగం ‘దురాక్రమిత కాశ్మీర్’ ఉత్తర భాగంలో నెలకొని ఉంది.
మనకు, పాకిస్తాన్‌కు మధ్య సయోధ్య కుదిరి తాను 1947 నుంచి దురాక్రమించుకొని ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్ మనకు తిరిగి అప్పగించినప్పటికీ తన అక్రమ ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదన్నది చైనా వ్యూహం. గిల్గిత్-బాల్టిస్థాన్ గతంలో ఎప్పుడూ జమ్మూ కాశ్మీర్‌లో భాగం కాదన్న వాదాన్ని పాకిస్తాన్ వినిపించడానికి ఇదీ నేపథ్యం. ‘దురాక్రమిత జమ్మూ కాశ్మీర్’ మీర్‌పూర్, ముజఫరాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితమని చాటడం పాకిస్తాన్-చైనాల ఉమ్మడి వ్యూహం. అందువల్లనే పాకిస్తాన్ ప్రభుత్వం ‘మీర్‌పూర్- ముజఫరాబాద్’ ప్రాంతానికి మాత్రమే ‘ఆజాదీ జమ్మూ కాశ్మీర్’- ఏజెకె- అని పేరు పెట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. 2009 వరకూ ఉత్తర ప్రాంతాన్ని- గిల్గిత్-బాల్టిస్థాన్- పాకిస్తాన్ ప్రభుత్వమే పాలించింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి 2009-10లో శాసనసభను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్రం హోదా లభించడంతో ‘గిల్గిత్-బాల్టిస్థాన్’ పూర్తిగా తమ దేశంలో సమీకృతం కాగలదన్నది పాకిస్తాన్ పన్నాగం! తద్వారా జమ్మూ కాశ్మీర్‌తో ఈ ప్రాంతానికి సంబంధం లేదని బుకాయించవచ్చు. చె నా తిష్ఠవేసి ఉన్న ఐదువేల చదరపుకిలోమీటర్ల ‘గిల్గిత్’ చైనాకే దక్కిపోతుంది. ఇలా మన దేశానికి తమకు మ ధ్య గల ద్వైపాక్షిక వివాదం నుంచి గిల్గిత్ బాల్టిస్థాన్‌ను తప్పించవచ్చు- ఇదీ పాకిస్తాన్, చైనాల వ్యూహం.
గిల్గిత్- బాల్టిస్థాన్ పర్వతీయ క్షేత్రం. జనాభా పలుచగా ఉన్నా, యాబయి వేల చదరపు కిలోమీటర్ల భూ భాగంలో ప్రాకృతిక సంపద నిక్షిప్తమై ఉంది. బంగారం నిక్షిప్తమై ఉంది. ఇతర ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. సింధునదిలో కలిసే అనేక ఉపనదులు గిల్గిత్‌లో ప్రవహిస్తున్నాయి. ఇక్కడ జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించడం ద్వారా పాకిస్తాన్‌లోని దూరదూర ప్రాంతాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయవచ్చు. ఖనిజ సంపదను కొల్లగొట్టి పాకిస్తాన్‌లోని పరిశ్రమలకు తరలించుకొని పోవచ్చు. ఈ పారిశ్రామిక కలాపాలన్నీ చైనా, పాకిస్తాన్‌లు కలిసికట్టుగా సాగిస్తున్నా యి. 1959 నుంచి టిబెట్‌లో ప్రాకృతిక సంపద ను కొల్లగొడుతున్న చైనా ఇప్పుడు అదే కార్యక్రమాన్ని గిల్గిత్-బాల్టిస్థాన్‌లో సాగించడానికి ఇ లా రంగం సిద్ధమైంది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవు నుంచి గిల్గిత్- బాల్టిస్థాన్ సరిహద్దు సమీపంలోని ‘సింకియాంగ్’ వరకూ చైనా ప్రభుత్వం ‘ఆర్థిక పారిశ్రామిక ప్రాంగణాన్ని’ నిర్మిస్తోంది. పాకిస్తాన్ పొడవునా వెలయనున్న ఈ పారిశ్రామిక వాటికను గిల్గిత్‌లోని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చైనా ఉనికిని- ‘పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతున్న’ బలూచిస్థాన్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవు దశాబ్దికి పైగా చైనా నౌకాదళ స్థావరంగా మారింది. ఇప్పుడు కొత్తగా దాదాపు అరవై వేల మంది చైనా నౌకాదళం సైనికులు గ్వాడార్‌లో తిష్ఠ వేయనున్నారట! గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఇదివరకే దాదాపు పదకొండువేల మంది చైనా సైనికులు చొరబడి ఉన్నారు. గిల్గిత్ గుండా ఈ ఆర్థిక పారిశ్రామిక ప్రాంగణాన్ని- ఎకనమిక్ కారిడార్- నిర్మించరాదన్న మన ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికను చైనా పట్టించుకొనడం లేదు.
చైనా సింకియాంగ్‌ను, టిబెట్‌ను ఆక్రమించడం వ ల్ల మాత్రమే జమ్మూ కాశ్మీర్‌లోకి చైనా చొరబడడానికి అవకాశం ఏర్పడింది. సింకియాంగ్, టిబెట్ దేశాలు మనకు, చైనాకు మధ్య ఉన్నాయి. సింకియాంగ్‌ను 1984లోను, టిబెట్‌ను 1959లోను చైనా ఆక్రమించింది. అందువల్ల ‘్భరత్-సింకియాంగ్’ సరిహద్దు, ‘్భ రత్-టిబెట్’ సరిహద్దు భారత-చైనా సరిహద్దులుగా మారిపోయాయి. 1950వ దశకంలో జమ్మూ కాశ్మీర్ ఈ శాన్య ప్రాంతంలోని నలబయి రెండు వేల చదరపు కిలోమీటర్లు ఆక్రమించిన చైనాకు 1963లో పాకిస్తాన్ గిల్గిత్ ప్రాంతాన్ని అప్పగించింది. ఇలా చైనా జమ్మూ కాశ్మీర్‌లో రెండు చోట్ల దురాక్రమణ సాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్ సమగ్ర విముక్తికి మనం ఇలా ఇద్దరు శత్రువులతో తలపడవలసి ఉంది.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)