Home News గోర‌క్‌నాథ్ ఆల‌యంపై దాడి: CAA, NRC కి వ్య‌తిరేకంగానే నిందితుడి ఘాతుకం

గోర‌క్‌నాథ్ ఆల‌యంపై దాడి: CAA, NRC కి వ్య‌తిరేకంగానే నిందితుడి ఘాతుకం

0
SHARE

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA), జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) ల‌కు వ్య‌తిరేకంగానే గోర‌క్ నాథ్ ఆల‌యంపై దాడికి పాల్ప‌డిన‌ట్టు నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ విచార‌ణ‌లో చెప్పిన‌ట్టు పోలీసులు తెలిపారు.

ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అబ్బాసీ ఏప్రిల్ 3న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో అల్లాహు అక్బర్ అని అరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబులరీ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

పోలీసులు గోరఖ్‌నాథ్ ఆలయంలో ఎల్లప్పుడూ మోహరించి ఉంటారని, వారిపై దాడి చేసి అక్కడి నుంచి త‌ప్పించుకోవాల‌నే ప్ర‌ణాళిక వేసిన‌ట్టు నిందితుడు తెలిపాడు. “దాడికి పాల్ప‌డే ముందు నేను ఈ చర్య గురించి వివిధ కోణాల్లో ఆలోచించించాను. కేంద్ర‌ ప్రభుత్వం CAA, NRCని అమలు చేస్తున్న‌ది. అమ‌లును వ్య‌తిరేకిస్తూ నేను ఈ దాడికి పాల్ప‌డ్డాను. ఈ చర్యను నేను ఇలా సమర్థించుకుంటున్నాను,” అని విచార‌ణ‌లో అబ్బాసీ వెల్ల‌డించిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడి చనిపోవడానికి కూడా సిద్ధపడే స్థాయిలో అబ్బాసీ మాన‌సిక స్థితి ఉంద‌ని పోలీసులు తెలిపారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు ఒకరోజు ముందు ఈ దాడి జరిగింది. దాడి జ‌రిగిన త‌ర్వాత అబ్బాసీ కుటుంబం అతను మానసిక ప‌రిస్థితి బాగా లేద‌ని, అత‌న్ని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. వైద్య ప‌రీక్ష‌ల చేసిన త‌ర్వాత అటువంటింది ఏమీ లేద‌ని పోలీసులు, వైద్యులు కుటుంబ సభ్యుల‌ వాదనను తోసిపుచ్చారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తిస్థాయిలో విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పోలీసులు తెలిపారు.

Also Read : అబ్బాసీ నుంచి టెర్రరిస్టులకు లక్షల రూపాయలు