భాగ్యనగర్ సంభాగ్ వనవాసి కళ్యాణ్ పరిషత్ మహిళా విభాగం మరియు అచ్చంపేట్ మండలంలోని గుడిబండ గ్రామస్తులు కలిసి కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోయిన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 9 వ తేదిన ఒక ఉత్సాహ పూరితమైన వాతావరణంలో భక్తీ శ్రద్ధలతో “విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమ నిర్వహించారు. ఇది ఒక వనవాసి మరియు నగరవాసి మహిళా సంగమంలా గోచరించింది.
నాలుగు సంవత్సరాల క్రితం, భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ మరియు సికింద్రాబాద్) వనవాసి కళ్యాణ్ పరిషత్ మహిళా విభాగం వారు నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట్ లో నున్న “మల్లికార్జున విద్యార్ధి నిలయం” యొక్క ఆహార సంబంధించిన ఖర్చుల బాధ్యతను స్వీకరించారు. ఈ వసతి గృహం చెంచు తెగ కు సంబదించిన వారి పిల్లల కోసం నడుపబడుతోంది.
తరువాతి సంవత్సరం వారు పూర్తిగా వసతి గృహం నిర్వహణకు అయ్యే ఖర్చులు బాధ్యతను స్వీకరించారు. ఆ బాధ్యతకు కొనసాగింపు గానే, “మల్లికార్జున విద్యార్ధి నిలయం” నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరం లో నున్న గుడిబండ అనే గ్రామం ను దత్తత తీసుకోవడం జరిగింది. గుడిబండ ప్రధానంగా చెంచులు నివసించే గ్రామము. చెంచులు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నివసించే ఒక తెగ. వీరి పుర్వికులు నరసింహ స్వామి భక్తురాలు అయిన చెంచు లక్ష్మి వారసులు.
ఆ ప్రాంతంలో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం పని కారణంగా, చాలామంది గ్రామస్తులకు ఈ సంస్థ గురించి అవగాహన ఉన్నది. గ్రామస్తులు పాల్గొన్న ఒకానొక సమావేశంలో కొంత మంది మహిళలు మాట్లాడుతూ ” మాకు భిక్ష అవసరం లేదు , మాకు మార్గదర్శకత్వం అవసరం ” అని అన్నారు.
కొంతకాలం క్రితం వనవాసి కళ్యాణ్ పరిషత్ వారు ఒక ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అసంపూర్తిగా మిగిలి ఉంది. సమావేశామలో పాల్గొన్న గ్రామ మహిళలు మద్యలో ఆగిపోయిన రామాలయ నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది అన్న తెలియజేశారు . వారి భక్తీ శ్రద్దలకు సంతృప్తి చెందిన భాగ్యనగర్ వనవాసి మహిళా విభాగం , గ్రామస్థులతో కలిసి మద్యలో ఆగిపోయిన ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి అనే బాద్యతను తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే నిధులను సేకరణ చేస్తూ, ఆలయ నిర్మాణం ప్రారంబించారు.
చాలామంది ఈ పనిలో పాలుపంచుకోవటానికి ముందుకొచ్చారు. అదే సమయంలో, ప్రఖ్యాత వేద పండితులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గురూజీ సైతం ఈ బృందం లో చేరారు. గుడిబండ గ్రామంలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడానికి భాగ్యనగర్ వనవాసి కల్యాణ పరిషత్ బృందంలోని ఒక మహిళా కార్యకర్త ఇంట్లో డిసెంబర్ 25 నుండి 31 డిసెంబర్ 2016, వరకు రామ కథను నిర్వహించారు. సుమారు 300 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గురూజీ 9 ఫిబ్రవరి 2017 మాఘ శుద్ధ త్రయోదశి నాడు ముహుర్తాన్ని నిర్ణయించారు.
గుడిబండ గ్రామంలో 26 జనవరి 2017 న భారతమాత పూజ నిర్వహించబడింది. తర్వాత గ్రామస్తులు 26 జనవరి నుండి 2 ఫిబ్రవరి 2017 మధ్యలో సమీపంలోని పది గ్రామాలకు భిక్షటనానికై వెళ్లి బియ్యం, కందిపప్పు , చింతపండు, చక్కెర, నూనె మరియు ప్రసాదానికి సంబంధించిన సామానులు సేకరించారు . నగరంలోని మహిళలు పూజ సామాగ్రిని సేకరించారు.
ఫిబ్రవరి 2 వ తేదీ నుండి అఖండ రామ నామ సంకీర్తన ప్రారంబించారు. ఫిబ్రవరి 7 వ తేదీన ఆలయ విగ్రహాలతో శోభా యాత్రను నిర్వహించి ఫిబ్రవరి 9 వ తేదీన అత్యంత భక్తి , శ్రద్ధా మరియు ఉత్సాహాల నడుమ “విగ్రహం ప్రతిష్ఠ” చేసారు. ఆలయంలో జరగా వలసిన నిత్య పూజ బాధ్యత గ్రామస్తులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి వేదపండితులుగా వచ్చిన వారు చెంచు పిల్లల హాస్టల్ లో వారితో పాటు అయిదు రోజులు పాటు గడపడం ఒక ప్రస్తావించతగ్గ అంశం.
కొన్ని నెలల క్రితం, ఒక పిండి మర కోసం సేకరించిన విరాళాలు గ్రామానికి అందచేశారు. పిండి మిల్లు నుండి వచ్చిన లాభంలో సగభాగం ఆలయానికి గ్రామప్రయోజనాల కోసం వినియోగించబడుతుంది.
వెయ్యి మందికి పైగా ప్రజలు మూడు రోజులు పాటు సమీప గ్రామాల నుండి వచ్చి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇరవై కుటుంబాలు భాగ్యనగర్ నుండి ఈ వేడుకలకు హాజరయ్యారు.