హిందూ దేవతలను హేళన చేస్తూ, అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతిఘటించినందుకు షరియత్ సూత్రాలకు బలి అయిన మొదటి దైవదూషణ బాధితుడు, హకీఖత్ రాయ్ అని మీకు తెలుసా?
– డా. అంకితా కుమార్
మనం చరిత్రను అధ్యయనం చేస్తే, 1734లో సరిగ్గా నూపుర్ శర్మ లాంటి పరిస్థితిని ఎదుర్కొన్న, 12 ఏళ్ల బాలుడైన హకీఖత్ రాయ్ తోటి ముస్లిం బాలురచేత రెచ్చగొట్టబడి, ప్రతీకారంగా వాళ్ళచేత రాళ్ళచేత కొట్టబడి, పాశవికంగా హత్య చేయబడ్డాడు, అని తెలుస్తుంది.
ఇటీవల ‘నూపుర్ శర్మ వ్యాఖ్యలు’ అనబడే వివాదం దేశంలో మతపరమైన ఉద్రేకాలకు దారి తీసింది. తర్వాత ఆమెను హత్య చేయాలని ఇచ్చిన బెదిరింపులు, ఉదయ్ పూర్, అమరావతిలలో హిందూయువకులపై జరిగిన దాడులు, కిరాతకహత్యలు దేశంలోని సాధారణపౌరుల మానసికస్థితిని కుదిపివేశాయి. ఇస్లాంవాదుల ఇటువంటి తీవ్రమైన మరణ బెదిరింపులు, తర్వాత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చేసే దాడులు, వాళ్ళే మరణశిక్షలు విధించటం వంటి తీవ్రవాదచర్యలు సరైనవి కావు అని చాలామందికి అనిపిస్తోంది. డా. అంబేడ్కర్ గారు ఈ విషయంలో సరిగ్గా ఏం చెప్పారంటే – “ఇస్లాంమతం, అందులోని వారికి ముస్లింలు, ముస్లిమేతరుల మధ్యగల ఒక వాస్తవమైన వ్యత్యాసాన్ని తగ్గించి చూపించే ఒక సంస్థ వంటిది. ముస్లిమేతరులకు (బయటి వారికి) ఇది ఒక ధిక్కార (ఏహ్య) భావాన్ని, శతృత్వాన్ని వాస్తవంగా చూపిస్తుంది.”
17వ శతాబ్దంలో సియాల్ కోట్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) జరిగిన ఈ హకీఖత్ రాయ్ చరిత్ర, ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న నూపుర్ శర్మ ఉదంతం వంటిదే. దైవదూషణ జరిగింది అనే ప్రప్రథమ సంఘటనల నేపధ్యంలో, అతని చరిత్ర ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇస్లాం కొన్ని శతాబ్దాలుగా మనదేశంలో ఒక సంస్థాగత నిర్మాణం కలిగి, హిందువులపై దాడులను, హిందూ దేవీ, దేవతలను అవమానించటమే శాశ్వతలక్ష్యాలుగా చేసుకుంటూ వస్తున్నారని, మనకు హకీఖత్ రాయ్ చరిత్ర నుండి తెలుస్తున్నది. ఇంకొక విషయం ఏమంటే, హిందువులు తమ దేవీ, దేవతలను, ఇస్లాంవాదుల ఎగతాళి, అపహాస్యం వంటి ధోరణుల నుండి రక్షించుకొనేందుకు చాలా భారీమూల్యం చెల్లించవలసి వచ్చింది, అని కూడా అతని చరిత్ర నుండి గ్రహించవచ్చు.
హకీఖత్ రాయ్ 1719లో సియాల్ కోట్ లో ఒక హిందూ ఖాత్రి కుటుంబంలో జన్మించారు. హిందూ ఖాత్రీలు గురునానక్ దేవ్ జీ కి సిక్కుపంథా స్థాపించినప్పుడు చాలా సహాయం చేశారు, ఇంకా తమ కుటుంబంలో జన్మించిన మొదటి సంతానాన్ని సిక్కుపంథ్ కి ఇచ్చే సాంప్రదాయాన్ని అనుసరించారు, ఎందుకంటే, అప్పటి పరిస్థితులలో హిందువులపై ఇస్లాంవాదుల క్రూరమైన దాడులు, బలవంతమైన మతమార్పిడులను అరికట్టేందుకు, అదే వారి తప్పనిసరి కర్తవ్యంగా ఉండేది.
హకీఖత్ రాయ్ బాల్యం నుండి సనాతన హిందూధర్మం పట్ల అత్యంత భక్తి, శ్రద్ధలు, అంకితభావం కలిగి ఉండేవాడు. అతడు మన హిందూధర్మాన్ని చక్కగా అర్థం చేసుకుని, హిందూసంస్కృతి పట్ల చాలా గర్వపడేవాడు. అతడు తన గురువైన గురు హర్ రాయ్ ఆచార్య గారి నుండి తగిన జ్ఞానాన్ని పొందాడు. అప్పటి మొఘలుల సమయంలో, పరిపాలనా సౌలభ్యం లేదా సమాచార నిమిత్తం, పర్షియన్ భాషలో ప్రావీణ్యత తప్పనిసరిగా ఉండేది. 12 ఏళ్ల వయస్సులో అతడిని పర్షియన్ భాష నేర్చుకొనేందుకు ఒక మౌలానా వద్దకు పంపారు. హకీఖత్ రాయ్ అక్కడి తోటి ముస్లింపిల్లల వెకిలిచేష్ఠల వలన వెక్కిరింపులకు గురయ్యాడు. వాళ్ళు అతడిని ఒక కాఫిర్ గా పిలుస్తూ, అపహాస్యం చేసేవాళ్ళు. అందుచేత, వాళ్లమధ్య తరచుగా దెబ్బలాటలు, గొడవలు జరిగి, గాయాలు కూడా అయ్యేవి. తనపట్ల ముస్లిం పిల్లల వెకిలిచేష్ఠలపై హకీఖత్ రాయ్, మౌలానాకు ఫిర్యాదు చేయగా, అతడు దానిని ఎప్పుడూ పట్టించుకోలేదు, ముస్లిం పిల్లలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కానీ, హకీఖత్ రాయ్ ఎంతో ఓరిమితో ఇవన్నీ భరించేవాడు.
ఈ ముస్లిం బాలురు ఒక శుక్రవారం ప్రార్థనలు కావడంతోనే, హిందూ దేవీ, దేవతలను వేళాకోళం చేయటం మొదలు పెట్టారు. వాళ్ళు దుర్గాదేవి, శ్రీరాముడు మొ|| దేవతలను కించపరచి, చులకనగా, హేళనగా మాట్లాడసాగారు. అసలే ముస్లిం విద్యార్థులతో అవమానాలను దిగమింగుతున్న హకీఖత్ రాయ్ ను ఇది మరింత బాధపెట్టి , ఆవేశపరచింది. వాళ్ళు మరింతగా హిందూ దేవీ, దేవతలను కించపరచేలా మాట్లాడటం, హకీఖత్ రాయ్ సహనస్థాయి దాటిపోయింది. అతడు బీబీ ఫాతిమాకు సంబంధించిన వాస్తవాలను ఏకరువు పెడుతూ, తన నిరసనను తెలుపుతున్నాడు. అతడు ఇస్లాంను లోతుగా అధ్యయనం చేస్తూ, గతంలో కూడా తన సందేహాలను ముస్లిం మతాధికారులను అడుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అతడు ఇలా ఫాతిమా గురించి మాట్లాడటం అతడి తోటి ముస్లింపిల్లలకు నచ్చక, అతడిని తీవ్రంగా హింసించి, కొట్టారు. హకీఖత్ రాయ్ అలా రక్తమోడుతూ, వాచిన ముఖం, శరీరంతో ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇంకొకవైపు, ఆ ఆకతాయి ముస్లింపిల్లలు, మౌలానా వద్దకు వెళ్ళి, హకీఖత్ రాయ్ మీద ఉన్నవీ, లేనివీ చాడీలు చెప్పి, అతనికి తీవ్రమైన ఆగ్రహం వచ్చేటట్లు చేశారు. అప్పుడు ఆ ముస్లిం మతాధికారులు హకీఖత్ రాయ్ ని వెంటనే పిలుచుకురమ్మని వాళ్ళను పంపించారు. హకీఖత్ రాయ్ వచ్చీ రాగానే, ఆ మౌలానా అతడిని తీవ్రంగా కొట్టసాగాడు. హకీఖత్ రాయ్ ఏం చెపుతున్నా, ఎంత ప్రాధేయపడినా వినిపించుకోలేదు. తర్వాత, ముస్లిం మతాధికారులు అతడిని, ఇస్లాంవాదుల మతవిశ్వాసాలను కించపరచాడనే నెపం మీద షరియత్ సూత్రాల ప్రకారం కఠిన శిక్ష విధించాలని, సియాల్ కోట్ పాలనాధికారి అయిన అమీర్ బేగ్ ముందు హాజరు పరచాలని, అతడిని షరియత్ ప్రకారం నేరవిచారణ జరిపించాలనీ నిర్ణయించారు. హకీఖత్ రాయ్, ఫాతిమాను హేళన చేసి, ముస్లింల మతవిశ్వాసాలను గాయపరుస్తున్నాడని అక్కడి ఖాజీ అబ్దుల్ హక్, తప్పుపట్టి దూషించాడు. హకీఖత్ రాయ్ కి కఠినశిక్ష విధించటానికి వాళ్ళకి ఇది ఒక్క నెపం చాలు. ఈ నేరానికి, 13 ఏళ్ల హకీఖత్ రాయ్ శరీరంపైన వేడి వేడి నూనె పోయటం ఒక్కటే సరైన శిక్ష అని ఖాజీ అబ్దుల్ హక్ తీర్పు చెప్పాడు. హకీఖత్ రాయ్ తల్లితండ్రులు తమ ఒక్కగానొక్క కుమారుడిని, ఈ కఠినమైన శిక్ష నుండి కాపాడాలని అనుకున్నారు. హకీఖత్ రాయ్ తండ్రి గారైన లాలా భాగమల్ రాయ్, తన కుమారుడి తరఫున దీనికి పరిహారం చెల్లిస్తానని ముస్లిం మతాధికారులకు విన్నవించాడు. వాళ్ళు అక్కడి పాలనాధికారికి లాలా భాగమల్ రాయ్ గారి భూములు పరిహారంగా అంగీకరించాలని సలహా ఇచ్చారు. హకీఖత్ రాయ్ తల్లితండ్రులు తమ కుమారుడి మీద ఇస్లాం మతాధికారులు కనికరం చూపిస్తారేమోనని వేచి ఉన్నారు, కానీ, ఈ దుర్మార్గుల మనస్సులలో ఇంకొక ప్రణాళిక సిద్దంగా ఉన్నది.
ఆ రోజు శుభప్రదమైన వసంత పంచమి పర్వదినం. ఒకవేళ హకీఖత్ రాయ్ గనుక మతం మార్చుకొని, ఇస్లాంను స్వీకరిస్తే, ఈ శిక్ష నుండి తనను తాను కాపాడుకోవచ్చని ఖాజీ అబ్దుల్ హక్ సెలవిచ్చాడు. కానీ, గట్టివాడైన హకీఖత్ రాయ్ వయస్సులో చిన్నవాడైనా, తనను కాపాడుకొనే ఈ అవకాశాన్ని నిర్ద్వందంగా తిరస్కరించి, సనాతన ధర్మానికి మూలస్తంభంగా, ధృఢంగా నిలబడ్డాడు. పాలనాధికారి అమీర్ బేగ్, హకీఖత్ రాయ్ ని ఒక చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడదీసి, అతడు ఇస్లాంలో చేరేవరకూ కొడుతూనే ఉండమని ఆదేశించాడు. కానీ, ఇందుకు కూడా హకీఖత్ రాయ్ అంగీకరించక, అమిత ధైర్యంగా, నిశ్చయంగా అలాగే ఉన్నాడు. కానీ, హకీఖత్ రాయ్, తాను సనాతన ధర్మంలో జన్మించినందుకు ఎంతో అదృష్టవంతుడను అంటూ, అదృష్టవంతులకు మాత్రమే ఇలా సనాతన హిందూధర్మంలో జీవిస్తూ, ధర్మం కొరకు మరణించే అవకాశం వస్తుందని చెప్పాడు.
ఇంతలో, హకీఖత్ రాయ్ ని లాహోర్ గవర్నర్ జక్రియా ఖాన్ వద్దకు పంపాలని అమీర్ బేగ్ ఆదేశించాడు. హకీఖత్ రాయ్ తల్లి, గోరాన్, దీనికంతటికీ చాలా దిగులుపడ్డది. ఆమె గట్టివాడైన తన కుమారుడికి ఇలా ఉద్బోధించారు – నీ తర్వాత నేను కుమారుడిని మాత్రమే కోల్పోతాను, కానీ, నువ్వు నీ ప్రాణం రక్షించుకొనేందుకు ఒకవేళ మతం మార్చుకొని ఇస్లాంలోకి వెళ్తే, నేను ఒక పారిపోయిన పిరికిహిందూ తల్లి అని పిలవబడతాను. అటువంటి హీనమైనస్థితి కంటే, మన హిందూధర్మంపై విశ్వాసాన్ని నిలబెట్టటంకోసం, నా కుమారుడు బలిదానమే మహోన్నతమని తాను భావిస్తానని, ఆమె అతడికి ఉద్బోధించారు.
ఇలా హకీఖత్ రాయ్ ని, ఇస్లాం స్వీకరించమని అంతరం లేకుండా ఎన్నిరకాలుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ, ఆ కిరాతకులు తమ పైశాచికక్రీడలో సఫలీకృతులు కాలేకపోయారు. చివరకు లాహోర్ గవర్నర్ అతడికి షరియత్ సూత్రాల ప్రకారం, చనిపోయేదాకా రాళ్ళతో కొడుతూ ఉండటమే అంతిమశిక్ష అని ఆదేశించాడు. హకీఖత్ రాయ్ దేనికీ బెరుకు, భయం, పిరికితనం లాంటి సూచనలేవీ తెలుపలేదు, సరికదా, సనాతన హిందూధర్మాన్ని రక్షించి, నిలబెట్టాలని మృత్యువును తన చిన్ని, రిక్త హస్తాలతోనే కౌగలించుకున్నాడు.
ఇస్లాంను స్థాపించిన తర్వాత, అరబ్బు ముస్లింలు ఇస్లాంను కొద్దికాలం లోనే, తమ సైనిక విజయాల ద్వారా విస్తరించారు. కానీ, కేవలం కొద్దిమంది మాత్రమే అరబ్బు రాజ్యాలలో ఇస్లాంను స్వీకరించారు. 11వ శతాబ్ది ఆఖర్లో చాలా దశాబ్దాల వరకూ, ఇస్లాం వాదులలో వాళ్ళ జనాభా బహుసంఖ్యాకులుగా (మెజారిటీ) ఏర్పరచలేకపోయారు. దార్-ఉల్-అరబ్ (అవిశ్వాసుల భూమి) ని దార్-ఉల్-ఇస్లాం (ఇస్లాం భూమి) గా మార్చటమే దీని వెనుక వాళ్ళ ఉద్దేశం, లక్ష్యం. వాళ్ళు దండెత్తిన ప్రతిచోటా, వాళ్ళు చెప్పిన మూడు ఐచ్ఛికాలు – ఇస్లాంలోకి మారటం, మరణాన్ని స్వీకరించటం లేదా జజియా పన్ను కట్టటం – వీటిలో వాళ్ళకున్న అసహనత్వం చక్కగా ప్రతిఫలిస్తుంది. ఇస్లాం పట్ల అవిశ్వాసులను అవమానించేందుకు వాళ్ళు ఎన్నుకున్న మార్గం – ఇతరుల దేవాలయాలు, ధర్మస్థలాలపై దాడులు, దురాక్రమణలు, ధ్వంసం చేసి, కూల్చటం మొ||.
ప్రస్తుతం ప్రపంచంలోని ముస్లిం బహుసంఖ్యాక (మెజారిటీ) దేశాల జనాభాను గమనిస్తే, ఏమర్థమౌతుందీ అంటే, వాళ్ళు ఉండే చాలా దేశాలలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు, ఆయాదేశాలు ఇస్లాం చట్టాల ప్రకారమే పాలించబడతాయి. వాళ్ళు ఏయే దేశాలలో అల్పసంఖ్యాకులు (మైనారిటీ) గా ఉంటారో, అక్కడి చట్టాలను అనుసరించకుండా, నిరంతరం సవాల్ చేస్తూనే ఉంటారు. ఉదా: ఫ్రాన్స్. భారత్, ఇంకా చాలా దేశాలు. ఇస్లాంలో ప్రధానసమస్య ఏమంటే, వాళ్ళు కలుపుగోలుతనం (ఏకీకరణ), సహనం వంటి నూతన, ఆధునిక ఆలోచనలను విశాలదృక్పధం లేకుండా, తెలుసుకోకుండా, తమకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎప్పుడూ ఆందోళనలు చేస్తుంటారు. ఇటీవల జరిగిన ఒక జాతీయ రాజకీయ పక్ష అధికార ప్రతినిధి అయిన నూపుర్ శర్మ ఉదంతంలో ఏం జరిగిందంటే – ఒక టివి చానెల్లో జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ, హిందూ దేవతలను అవమానిస్తూ మాట్లాడిన ఇంకొక ముస్లిం ప్రతినిధికి తగిన జవాబు ఇస్తూ, హాదిత్ నుండి, ముస్లిం ప్రవక్త గురించిన కొన్ని విషయాలు చక్కగా ఉదహరించారు, దానితో ఆమె ఇస్లాం మతదూషణ చేశారని ఈ ముస్లిం వర్గాలు గగ్గోలు పెట్టారు. ఆమె ఏమన్నారంటే – “ముస్లిం ప్రవక్త, ఆయేషా అనే అమ్మాయిని ఆరేళ్ళ వయస్సున్నప్పుడు పెళ్లి చేసుకొని, ఆమెకు 9 ఏళ్లప్పుడు ఆమెతో శారీరికంగా దగ్గరయ్యాడు.” (The revered Sahih al-Bukhari, 5134; Book 67, Hadith 70)
ఇతర మతాల వాళ్ళు, కొంతమంది కళాకారులు, రాజకియవాదులు ఈమధ్య సృజనాత్మకత, భావ ప్రకటనాస్వేచ్చ పేరు మీద, తరచుగా హిందూ దేవీ, దేవతలను అవమానించేటట్లు వ్యాఖ్యానాలు చేయటం ఒక దురలవాటుగా కనబడుతున్నది. ఉదా: హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించిన ఎం.ఎఫ్. హుస్సేన్ కు ఇస్లాం రాజరికదేశమైన ఖతార్ పౌరసత్వాన్ని ప్రసాదించింది. అదే ఖతార్ దేశం, హాదిత్ పై నూపుర్ శర్మ ఉదహరించిన వాస్తవాలకు అభ్యంతరం చెప్పింది. ఇదేమి ద్వంద్వనీతులు? అయినా, నూపుర్ శర్మను పార్టీ నుండి బహిష్కరించారు, ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పారు కూడా.
ఇంత జరిగాక కూడా, ఇంకా ఆమెకు చాలా మంది నుండి, చాలా సంస్థల నుండి మానభంగం, తల తీయటం, మరణం వంటి తీవ్రమైన బెదిరింపులు లెక్కలేనన్ని వస్తూనే ఉన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా కలకత్తా, హైదరాబాద్, కాశ్మీర్ ఇంకా చాలా చోట్ల కేసులు దాఖలు చేశారు. ఆమె తల తీయాలని చాలా మంది పిలుపునిచ్చారు, ప్రోత్సాహ బహుమతులు ప్రకటించారు కూడా. ఇటీవల ఆజ్మీర్ దర్గా ఖాదీమ్ కూడా నూపుర్ శర్మ తల తీసిన వ్యక్తులకు భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించాడు. చాలా ప్రదేశాలనుండి, చాలామంది వ్యక్తుల నుండి వస్తున్న ఇటువంటి నిరంతర బెదిరింపులు, మధ్యయుగం నాటి ఇస్లాంలో నిగూఢమై ఉన్న తాలిబాన్ మనస్తత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా భారత్ లో అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళ గజ్వా-ఎ-హింద్ లక్ష్యాన్ని సూచిస్తున్నాయి.
చాలా శతాబ్దాలుగా, హిందూస్థాన్ పై ఇస్లాంవాదుల దండయాత్రలు, దోపిడీలు, దాడులు, వాళ్ళు హిందూ(భారతీయ) ధర్మం, వేదసంస్కృతులను, ఇక్కడ వాళ్ళచేత కాఫిర్ లు అని పిలవబడే హిందువులను నాశనం చేసే ఇటువంటి దుర్మార్గాల వలన, వాళ్ళ అంతిమ లక్ష్యం, గజ్వా-ఎ-హింద్ గా చేయటమే అని చక్కగా తెలుస్తోంది.
అనువాదం: సత్యనారాయణ మూర్తి