Home News హిందూ సమాజం ఏకతాటి పైకి రావాలి

హిందూ సమాజం ఏకతాటి పైకి రావాలి

0
SHARE

హిందూ దేవాలయాలు పరిరక్షించాలని,అప్పుడు దళితులే హిందూ ధర్మాన్ని రక్షిస్తారు.  హిందూ ధర్మాన్ని ఆచరిస్తేనే మత మార్పిడులు దూరమవుతాయి. నిజమైన షెడ్యూలు కులాల తెగల వారికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందడం లేదని మతం మారిన వారు ఆ ఫలాలు అనుభవిస్తున్నారన్నారు అని దానికి నిరసనగా దళిత హైందవ ఉద్యమం రావాలని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానందభారతి స్వామీజీ “ఎస్.సి/ఎస్.టి హక్కుల సంక్షేమ వేదిక” సమ్మేళనంలో ముఖ్య అతిధి గా ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు.  

వేదిక పైన మాట్లాడుతున్న కమలానంద భారతి స్వామీజీ

ఈ సమ్మేళనం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట్ లో బాలాజీ ఫంక్షన్  హాల్ లో 26-2-2017 ఆదివారం రోజున ఈ సమ్మేళనం జరిగింది.

షెడ్యూలు కులాలు/ తెగలు హిందువులని మతం మారిన వారు ఎస్. సి.  లు కాదన్నారు .ఈ దేశంలో హిందూ సమాజాన్ని సంస్కరించడానకి వచ్చిన అవతార పురుషుడు అంబేద్కర్ అన్నారు.నకశిక పర్యంతం అంబేద్కర్ దేహమంతా దేశభక్తి నిండి ఉందని,జీవితాన్ని త్యాగం చేసి సమాజ కళ్యాణాన్ని కోరుకున్న మహాఋషి అంబేద్కర్ అని అన్నారు. మతం మారిన వారు ఎస్.సి/ఎస్.టి ల హక్కులు లాక్కొని పోకుండా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు.

వేదిక ప్రధాన కార్యదర్శి వంశీ తిలక్

అగ్రవర్ణాలు,నిమ్నవర్గాలు అనే తేడా లేకుండా హిందూ సమాజమంతా విద్వేషంతో కాకుండా సమరసతతో జీవించాలని అందుకు అందరూ సహకరించాలి అని  అన్నారు. సమన్వయం, సమరసత, దేశభక్తి, హిందూధర్మ రక్షణ కొరకు హిందూ సమాజం ఏకతాటి పైకి రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత ఎస్ సీ పరిరక్షణ సమితి కన్వీనర్ కర్నే శ్రీశైలం, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ, వేదిక ప్రధాన కార్యదర్శి వంశీ తిలక్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు సత్యనారాయణ, వేదిక భాద్యులు ఉంక్యా నాయక్, నందు, నర్సింలు, శ్రీకాంత్, మచ్చేంద్రనాథ్, యాదగిరి, భూమయ్య, లింగం, వెంకటేశం, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ