Home News స్వాతంత్య్రం త‌ర్వాత మొద‌టి సారి శార‌దా పీఠంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు 

స్వాతంత్య్రం త‌ర్వాత మొద‌టి సారి శార‌దా పీఠంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు 

0
SHARE

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లోని తీత్‌వాల్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పురాతన శారదా పీఠంలో నవరాత్రి ఉత్సవాలు జరిగాయి.

కేంద్ర హోంమంత్రి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ “1947 తర్వాత మొదటిసారిగా కాశ్మీర్‌లోని చారిత్రాత్మక శారదా ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించడం చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన విషయం. ఈ ఏడాది చైత్ర నవరాత్రి పూజను త‌ర్వాత ఇప్పుడు శారదీయ నవరాత్రి పూజా మంత్రాలు మందిరంలో ప్రతిధ్వనిస్తున్నాయి. పునరుద్ధరణ తర్వాత  2023 మార్చి 23న ఆలయాన్ని తిరిగి తెరవడం నా అదృష్టం.  ఇది లోయలో శాంతి పునరాగమనాన్ని సూచించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం ఆధ్యాత్మిక,  సాంస్కృతిక జ్వాల పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. “అని పేర్కొన్నారు.

శారదా పీఠం ప్రాముఖ్యత

శారదా పీఠంపై 2017 లో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని అధ్యయనం చేసి, విశ్లేషించిన ‘Thematizations of the Goddesses in South Asian Cinema’ పుస్తకం ప్రకారం, ఈ ఆలయం 18 మహా శక్తి పీఠాలలో పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. సతీదేవి కుడి చేయి ఎక్కడ పడిందో అదే స్థలంలో ఈ నిర్మాణం జ‌రిగింద‌ని నమ్ముతారు. టిబెట్, చైనా, థాయిలాండ్, నేపాల్, భూటాన్, ఇండోనేషియా, మయన్మార్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కంబోడియాతో సహా అనేక దేశాలలోని  అనేక మంది విద్యార్థులను కలిగి ఉన్నందున శారదా పీఠం హిందూ, బౌద్ధ దేవాలయ విశ్వవిద్యాలయంగా ముఖ్యమైనది. పురాతన శారదా లిపిని ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ఆలయ విశ్వవిద్యాలయం ఘనత వహించిందని. ఆలయ దేవత అయిన ‘శారదా దేవి’ పేరు మీదుగా ఆ పేరు పెట్టబడిందని పుస్తకం పేర్కొంది.

వివిధ కాలాలకు చెందిన ప్రముఖ పండితులు పీఠాన్ని సందర్శించినట్లు పుస్తకంలో అధ్యయనం చేయబడిన డాక్యుమెంటరీ పేర్కొంది. హ్యూయెన్ త్సాంగ్, ఆదిశంకర, బిల్హణ,  కల్హణ వంటి పెద్ద పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. చైనా బౌద్ధ సన్యాసి క్రీ.శ.632లో శారదా పీఠాన్ని సందర్శించి 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. మొఘల్ రాజు అక్బర్ సంస్థానంలోని ప్ర‌ముఖుడు అబుల్ ఫజల్ నెలలో ఎనిమిది రోజులు (అష్టమి) పీఠంలో ఒక ఆధ్యాత్మిక ప్రభావాన్ని అనుభవించవచ్చని పేర్కొన్నాడు.

14వ శతాబ్దపు సాహిత్య, సాంస్కృతిక గ్రంథం ‘మాధవ్య శంకరవిజయం’ 8వ శతాబ్దపు గొప్ప వేద పండితుడు, ఆదిశంకరాచార్యను సూచిస్తుంది, ఇతను ఆలయ ప్రాంగణంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడని నమ్ముతారు. 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ కవి బిల్హణ అమ్మ‌వారి ఆభరణాలను వివరిస్తాడు. ఆమె అందాన్ని గంగా నది వైభవంతో పోల్చాడు. అంతేకాకుండా, 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కాశ్మీరీ చరిత్రకారుడు కల్హనా ర‌చించిన ‘రాజతరంగిణి’ ఆలయం ఖచ్చితమైన స్థానాన్ని ధృవీకరిస్తుంది.

ఆలయం ఎందుకు మూసివేయబడింది?

1947-48 నాటి భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం, అలాగే ఆలయంపై పస్తు-కబిలా దాడి త‌ర్వాత ఆలయ ప్రవేశం నిలిచిపోయింది. భారతదేశం-పాకిస్తాన్ విభజన తర్వాత, హిందూ సన్యాసి స్వామి నందలాల్ జీ దేవాలయం నుండి విగ్రహాలను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నించారు. చివరికి అది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భాగమైంది. అయినప్పటికీ, బారాముల్లాలోని దేవిబాల్ చారిత్రాత్మక ప్రదేశంలో కొన్ని విగ్ర‌హాల‌ను పొందుప‌ర‌చ‌గలిగాడు. అంతేకాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడంతో హిందువులు పూర్తిగా ఆలయ ప్రవేశాన్ని కోల్పోయారు.

దేవాలయ విశ్వవిద్యాలయం హిందువులకు, భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రాచీన కాలంలో మానవాళి యొక్క కీలకమైన స‌మ‌యాల్లో ప్రాచీన సంస్కృతులు, నాగరికతలలో కూడా చారిత్ర‌క ప్రాధాన్య‌త క‌లిగి క‌లిగి ఉంది. శారదా పీఠంలో 2023 నవరాత్రి ఉత్సవాలను చారిత్రలో నిలిచిపోతుంది.