Home News రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్ర మంత్రి జైశంకర్ చెంపపెట్టు సమాధానం

రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్ర మంత్రి జైశంకర్ చెంపపెట్టు సమాధానం

0
SHARE

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని లేవనెత్తిన ఒక పాత్రికేయునికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ చెంపపెట్టు అన్నట్టుగా సమాధానమిచ్చారు. భారత్-యూఎస్ 2+2 చర్చ నాల్గవసారి జరుగుతున్న సందర్భంగా ఎస్ శంకర్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు.

“చమురు కొనుగోలు అంశాన్ని మీరు (పాత్రికేయుడు) ప్రస్తావించడాన్ని నేను పరిగణనలోకి తీసుకున్నాను. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ళ వైపు మీరు దృష్టి పెట్టిన పక్షంలో అదే సమయంలో మీ శ్రద్ధాసక్తులను ఐరోపా వైపు కేంద్రీకరించాలని సూచిస్తున్నాను” అని ఆయన అన్నారు.

“మా (భారత్) ఇంధన భద్రతకు అవసరమైన మేరకు కొంత ఇంధనాన్ని మేము సైతం కొనుగోలు చేస్తుంటాం. కానీ గణాంకాల వైపు చూడటానికి నేను సందేహిస్తుంటాను. ఒక మాసంలో మేం చేసే మొత్తం కొనుగోళ్ళు ఐరోపా మధ్యాహ్నానికి చేసే కొనుగోలు కన్నా చాలా తక్కువ. కనుక మీరు ఆ దిశగా ఆలోచించాలని ఆశిస్తున్నాను” అని డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు.

ఈ మాసం మొదట్లో ఇండియా-యూకే వ్యూహాత్మక భావి ఫోరమ్ వద్ద ప్రసంగిస్తున్న సందర్భంగా రష్యా నుంచి అతి పెద్ద గ్యాస్, చమురు దిగుమతిదారులుగా ఐరోపా దేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. డిస్కౌంట్ ధరల వద్ద రష్యన్ ముడి చమురు కొనుగోలుకు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి సమర్థించారు. అంతర్జాతీయ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇంధన సరఫరాలపై భేషైన ఒప్పందాలను కుదుర్చుకోవడం భారత్‌కు ముఖ్యమని ఆయన తెలిపారు.

“ఇది (రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం) చాలా ఆసక్తిదాయకంగా మారింది. కొద్ది కాలంగా ఈ అంశంపై దాదాపు ఒక ప్రచారం (మాకు వ్యతిరేకంగా) జరుగుతున్న వైనాన్ని మేం చూస్తున్నాము. చమురు ధరలు పెరిగినప్పుడు తమ ప్రజలకు భేషైన ఒప్పందాల కోసం మార్కెట్‌ను దాటి వెలుపలకు వెళ్ళడం దేశాలు సర్వసాధారణంగా చేసే పనిగా భావిస్తున్నాను” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ లిజ్ ట్రస్‌తో చర్చలు జరిపిన సందర్భంగా భారత్ తన ఇంధన సరఫరాల్లో అత్యధికాన్ని మధ్య ప్రాచ్యం నుంచి కొనుగోలు చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 80 శాతం నుంచి అమెరికా నుంచి అలాగే రష్యా నుంచి ఒక శాతం కన్నా తక్కువ ముడి చమురు కొనుగోళ్ళను భారత్ జరుపుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

“మరో రెండు లేదా మూడు మాసాలు కనుక మనం వేచి చూస్తే రష్యా నుంచి భారీ ఎత్తున గ్యాస్ మరియు చమురు కొనుగోలు చేసేది ఎవరనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలుదారులు జాబితా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. జాబితాలోని టాప్ 10లో మేము(భారత్) ఉండటంపట్ల నాకు సందేహం ఉంది” అని మంత్రి తెలిపారు.