- చనిపోయే ముందు సెల్ఫీ వీడియో
- తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు
- ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు
ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే ఒక సాధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరి తాలూకా, కుండంగల్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కుడుంగల్ ప్రాంతానికి చెందిన సాధువు శరవరణ్ అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి తనకు తెలిసిన పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటాడు.
ఇలా చేయడం వల్ల అక్కడి స్థానిక క్రైస్తవులు కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఆంటోనీ మైఖెల్ ఆశ్రమానికి వెళ్ళి సాదువు శరవరణ్ పై దాడి చేశాడు. అతన్ని తిడుతూ అవమానించాడు. దీంతో మనస్థాపానికి గురైన సాధువు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 15 న అతని మృతదేహం ఒక ప్రాంతంలో లభ్యమైంది. పక్కనే అతని మొబైల్ కూడా ఉంది. అతను చనిపోయే ముందు ఒక సెల్ఫి వీడియోను తీసుకున్నాడు. అందులో తన చావుకి ఎస్సై ఆంటోనీ మైఖెల్ కారణమని, ఎస్సై పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఘటన ఆగస్టు 15న జరిగినప్పటికీ అక్కడి మీడియా సంస్థలు ఈ విషయం బయటకురాకుండా వ్యవహరించాయి. అయితే ‘న్యూస్ జె’ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. శనివారం శరవణన్ కుమారుడు శంకర్, కుమార్తె న్యూస్ జేతో మాట్లాడుతూ తమ తండ్రిపై ఎస్సై ఆంటోనీ మైకేల్ దాడి చేసినప్పుడు తాము అక్కడే ఉన్నామని, కుటుంబం ముందే దాడికి గురి కావడంతో మానసిక క్షోభకు గురై తమ తండ్రి ఆరోజంతా ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపారు.
ఆగస్టు 14 న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఆగస్టు 15న అతడి మృతదేశం సమీపంలోని అటవీప్రాంతంలో దొరికిందని తెలిపారు. తమ తండ్రి చావుకి కారణమైన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ మరణానికి ఎస్ఐ ఆంటోనీ కారణమని సాధు శరవణన్ వీడియోలో స్పష్టం చేసినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా పోలీసు ఉన్నతాధికారులు సాధువు కుటుంబాన్ని పిలిపించి ఎస్సై ఆంటోని మంచివాడని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పారు.
ఎస్సై పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధిత కుటుంబాన్ని పరోక్షంగా బెదిరించడాన్ని ప్రశ్నిస్తూ హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఎస్సై మైఖేల్ ఆంటోనీపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఆ కుటుంబానికి రక్షణ కూడా కల్పించాలని తమ పిటిషన్ లో కోరింది.
Custodial torture against Sadhu & his Suicide – Filed petition before @India_NHRC seeking directions to TN Police Dept to register FIR against Mr. Anthony Michael, Sub-Inspector & to take necessary action against him.
Thanks to @eorganiser for publishing details of the incident pic.twitter.com/DLmvEernz2— Legal Rights Protection Forum (@lawinforce) August 23, 2020
అయితే ఇదే సమయంలో మరో కొత్తవిషయం వెలుగుచూసింది. ఎస్సై ఆంటోనీ మైఖేల్ సాధువుతో పాటు, అతడి పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేసిన విషయం బయటకు రావడంతో ముంబైకి చెందిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ సంస్థ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. వెంటనే ఎస్సై మైఖేల్ ఆంటోనీపై జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తమ ఫిర్యాదులో కోరింది.
Shocking details revealed in suicide of Tamilnadu Saivait Sadhu Sarvanan; accused police offcr #AnthonyMichael beaten up minor kids of deceased Sadhu. We hv sought @NCPCR_ intervention n FIR against guilty under JJ Act. Hope commission take urgent steps 3 ensure justice @Swamy39 pic.twitter.com/CfkXXYXNo6
— Legal Rights Observatory- LRO (@LegalLro) August 23, 2020
స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్:
ఎస్సై మైఖేల్ ఆంటోనీ, సాధు శరవణన్ తో పాటు అతడి పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేసాడంటూ లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ ఇచ్చిన ఫిర్యాదుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ వెంటనే స్పందించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలు వారం రోజుల్లో తమకు తెలియజేస్తూ నివేదిక సమర్పించాల్సిందిగా సాలెం జిల్లా ఎస్పీని బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ శ్రీ ప్రియాంక్ కానుంగో ఆదేశించారు.
The Commission has taken cognizance of the matter, and necessary instructions have been issued to the District Superintendent of Police for investigation and report within 7 days. pic.twitter.com/IghVEXJGE8
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) August 24, 2020
కేసులో మరో హైడ్రామా:
జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ కేసులో స్పదించిన మరుక్షణం మరో హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు మరణించిన సాధు శరవణన్ కుటుంబ సభ్యులను, పిల్లలను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్టు, తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని వేధించినట్టు తమిళనాడులో స్థానిక కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
ట్విట్టర్ ఆరోపణలకు వెంటనే మరోసారి స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ శ్రీ ప్రియాంక్ కానుంగో వెంటనే సాధు కుటుంబాన్ని, పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరచాలని, కమిటీ ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని, కమిటీ ఆధ్వర్యంలోనే వారికి ఆశ్రయం ఏర్పాటు చేయాలని, ఈ వివరాలన్నీ వెంటనే తమకు ఇంగ్లీషు భాషలో సమర్పించాలని మరోసారి ఆదేశాలు జారీ చేశారు.
#Breaking Tamil Nadu Sadhu suicide- NCPCR @ncpcr_ issued notice to Salem SP n ordered him 2 furnish ATR including copy of FIR lodged against radical #Christian Police #AnthonyMichael within 7 days for beating of kids of Saivait Sadhu Sarvanan; LRO hd sought action under JJ Act pic.twitter.com/Hv9AfFdI5c
— Legal Rights Observatory- LRO (@LegalLro) August 25, 2020
ఎస్సైపై విచారణ మొదలు:
ఈ కేసు విషయంలో ఎస్సై పాత్ర ఏమీ లేదంటూ మొదటి నుండి బుకాయిస్తూ వస్తున్న సేలం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఒత్తిడితో ఎట్టకేలకు సాధు శరవణన్, అతని పిల్లలపై చిత్రహింసలు, అతడి ఆత్మహత్యకు కారణం అయిన ఎస్సై ఆంథోనీ మైఖేల్ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Case of Custodial Torture against Sadhu Saravanan & His Suicide in Tamil Nadu:
Cc: @LegalLrohttps://t.co/2HLB3topUH— Legal Rights Protection Forum (@lawinforce) August 25, 2020
మరో వైపు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పిటిషన్ మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసునులో ఫిర్యాదుని రిజిస్టర్ చేసింది.
Tamil Nadu – Custodial Torture against Sadhu & His Suicide Case:
The National Human Rights Commission registered a complaint today based on our petition seeking proper investigation and safety & security to the family of the Sadhu Saravanan. https://t.co/wUS7F9cCll— Legal Rights Protection Forum (@lawinforce) August 26, 2020
Source: Organiser