Home News ఆపరేషన్ క్లీన్: అధికారులు పట్టించుకోకపోవడటంతో చెరువు శుద్ధి చేపట్టిన స్వయంసేవకులు     

ఆపరేషన్ క్లీన్: అధికారులు పట్టించుకోకపోవడటంతో చెరువు శుద్ధి చేపట్టిన స్వయంసేవకులు     

0
SHARE
హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు‌ ఆపరేషన్‌ క్లీన్‌ పేరిట చెరువు శుద్ధి చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చేశారు. సఫిల్-గూడా ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆనందబాగ్ నగర ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు గమనించి ముందుకు కదిలాయి. కార్యకర్తలు ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు.

హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది హుస్సేన్‌ సాగర్‌ సహా హైదరాబాద్‌లోని అన్ని చెరువుల వద్దా నిమజ్జన ఏర్పాట్లు చేస్తారు జీహెచ్‌ఎంసీ అధికారులు. కానీ, ఈయేడాది నిమజ్జనం కోసం ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. దీంతో సఫిల్ గూడ చెరువు దగ్గర నిమజ్జన వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇకపై వినాయక నిమజ్జనాలు సాగించలేనంతగా పేరుకుపోవడంతో.. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ముందుకు వచ్చారు. మన హిందూ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే వినాయక నిమజ్జనం కోసం మేము సైతం అంటూ వ్యర్థాలు తొలగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు తోడు.. హిందూవాహిని, హిందూ ఉత్సవ సమితి, సేవా భారతి కార్యకర్తలు కూడా కలిశారు.

ఆర్‌ఎస్ఎస్‌, హిందూసంస్థల సేవలను చూసిన జీహెచ్‌ఎంసీ స్పందించింది. సఫిల్‌గూడ చెరువులో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను పారిశుధ్య సిబ్బంది ద్వారా చేపట్టింది.