Home News ఒరిస్సా రైలు ప్ర‌మాదం… వెలుగులోకి ఆస‌క్తిక‌ర విష‌యాలు 

ఒరిస్సా రైలు ప్ర‌మాదం… వెలుగులోకి ఆస‌క్తిక‌ర విష‌యాలు 

0
SHARE
ఇటీవ‌ల ఒరిస్సాలో ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమందిని క‌లిచివేసింది. ఎంతో మంది ప్రాణాలు కొల్పోయారు. ప్ర‌మాదానికి సంబంధించిన ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే ఈ రైలు ప్ర‌మాదానికి సంబంధించి విషయమేమిటంటే కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొన్న కూడా గూడ్స్ రైలు ఏ మాత్రం ఊగిపోకుండా పట్టాలమీదే నిలబడి ఉంది. దానికి చాలా ముఖ్య కారణం దాని బోగీలలో నింపబడిన ఇనుప రజను, ఆ భారం కారణంగా పట్టాల మీదనుండి గూడ్స్ రైలు క్రిందికి దిగలేదు. ఈ విషయం గ‌మ‌నిస్తే ఈ రైలు పట్టాల మధ్య దూరం, రైలు బోగీల పరిమాణం, ఇతర విషయాలూ పరస్పర సంబంధం కలిగి ఉండవచ్చని ప‌రిశోధ‌న చేస్తే మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.
ఈ రైళ్ళ ఆకారం, పరిమాణం, దాని చలనానికి సంబంధించి పట్టాల రెండింటి మధ్య దూరం ఎంత ఉండవచ్చు? ఆక్సెల్ కొలత ఎంత ఉండవచ్చు అనేదాని గురించి వాస్త‌వ‌ వివరాలు ప‌రిశోధిస్తే చాలా ఆసక్తి దాయక సంగతి తెలుస్తోంది.
భారతదేశానికి రైల్వేలను పరిచయం చేసిన బ్రిటన్, బ్రిటిష్ ప్రభుత్వ యోజన ప్రకారం యు.కె. స్టాండర్డ్ నమూనాలోనే పట్టాల నడుమ దూరాన్ని నిర్మించడం జరిగింది. మొదట న్యారో గేజ్ తర్వాత మీటర్ గేజ్ ఇపుడు బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్ కొలత 4 అడుగుల 8.5 అంగుళాలు ఉంటుంది.
అయితే ఈ కొలత ప్రమాణం యు.కె. కు ఎక్కడి నుండి లభ్యమైంద‌ని ప‌రిశోధిస్తే అక్కడి గ్రామాల్లో వాడుతున్న ఎద్దులబండ్ల చక్రాల మధ్య దూరం, దానికి మూలం ఎక్కడిదని చూస్తే అది రోమ్ సామ్రాజ్యపు రథాల చక్రాలు, వాటి మధ్యదూరాన్ని ఆధారం చేసుకుందని చరిత్ర వివరిస్తోంది. రోమ్ సామ్రాజ్య  రథాలు, వాటి నిర్మాణ పద్ధతిని అవలోకిస్తే తాబేలు ఆకారపు క్రిందిభాగం, చక్రాల నిర్మాణం భారతదేశంలోని వేదాలలో పేర్కొనబడిన కొలతల ప్రమాణాలున్నాయి.
ఋగ్వేదంలో, యుద్ధ రథపు వివరమైన వివరణ కనబడుతుంది. 28 సంస్కృత తాంత్రిక గ్రంథాలు  29 (రెండు చక్రాల) వాహనాలను పేర్కొన్నాయి. వాటిలోని విడిభాగాల పరిమాణాన్ని సూచిస్తాయి. జోడెద్దులు లేదా జోడుగుర్రాలు బండి/ రథాన్ని లాగుతూ లాగుతూ తన వేగాన్ని పెంచుకున్నాక ఎడమవైపుది ఎడమవైపుకు, కుడివైపుది ఎడమవైపుకు స్వల్పంగా ఒరిగి చలించడాన్ని చూడవచ్చు. అంటే ఆంగ్లభాషలోని ‘ V ‘ అక్షరంలా బండి వేగం పుంజుకుంటుంది. ఇది బండి జారిపోకుండా, ఎద్దులకు భారాన్ని తగ్గిస్తుంది. ఇదొక భౌతిక శాస్త్ర సిద్ధాంతం. రెండు బలాలు సమానమై ఉంటాయి. కానీ వ్యతిరేక దిక్కులో ఉంటాయి. బండి కార్యనిర్వహణ ఫలితాంశం శూన్యమవుతుంది.
ఋగ్వేదంలో పేర్కొన్న వివరం ప్రకారం ఆక్సెల్ వెడల్పు 2575mm, అంటే 4 అడుగుల 1/3 అంగుళాలు. ఎలాంటి అనుమానమూ లేకుండా అందులో పేర్కొన్న వాహనాలు మాయామత లో ( XXXI, 48b- 49) చెప్పినట్లు ఆచరణలకు సంబంధించి వాడన‌వి. ( డాగెన్స్, మాయామత, భాగం 2 XIV , పేజీలు 248 – 258 చూడగలరు) ఈ పుస్తకాన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యలో పాఠ్యంశంగా పెట్టడం ఉత్తమం. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధనా స్థాయిలో ఆధార గ్రంథం కాగలదు (shift of centre of gravity of the cart D with respect to the normal to the ground passing through the point of contact) ఈ గ్రావిటి మనవాళ్ళకు వేలాది సంవత్సరాల క్రితమే తెలుసు.
ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావించబడింది. భారతీయ రైతులు తమ ఎద్దులబండికి జోడెద్దులను కట్టడంలో, బండి పరిమాణం, దాని మీద వేసే సరుకుల తూకం, చలనాన్ని అనుసరించి నిర్మిస్తున్నది నేటికీ ఈ కొలమానంలోనే.