Home News కోవిడ్ వాక్సిన్లు బహిష్కరిస్తామంటున్న  ఇస్లామిక్ అతివాదులు 

కోవిడ్ వాక్సిన్లు బహిష్కరిస్తామంటున్న  ఇస్లామిక్ అతివాదులు 

0
SHARE

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్‌ రాబోతుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రణాళికలు కూడా ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. యావత్‌ ప్రపంచమంతా వాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇస్లామిక్ అతివాదులు కోవిడ్‌ -19 వ్యాక్సిన్లను బహిష్కరిస్తామంటూ  జారీ చేస్తున్నారు. ఇందుకు కారణం వాక్సిన్లు ‘హలాల్‌’ పద్ధతిలో తయారుచేయకపోవడమేనట!

డిసెంబర్‌ 20న ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించిన కథనం ప్రకారం, కరోనా వాక్సిన్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి, రవాణా సమయంలో సురక్షితంగా ఉండాలంటే వాక్సిన్‌ తయారీలో పంది మాంసం నుంచి ఉత్పన్నమయ్యే జెలటిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే  జెలటిన్ రహిత వ్యాక్సిన్లను తయారు చేయాలని హలాల్ సర్టిఫికేషన్ సంస్థలు స్వీట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిన్‌ వంటి కొన్ని ఫార్మా కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, మలేషియా వంటి ఇస్లామిక్‌ దేశాల్లో ఉన్న ఎజె ఫార్మా ప్రస్తుతం హలాల్‌ వ్యాక్సిన్ల తయారీపై దృష్టిపెట్టింది.
బ్రిటిష్‌ ఇస్లామిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తన పరిశోధనలో పంది మాంసం నుంచి ఉత్పన్నమయ్యే జెలటిన్‌ లేకుండా వ్యాక్సిన్‌ తయారు చేస్తే వాటి డిమాండ్‌ , నిలువ ఉండే కాలం తక్కువగా ఉంటుందని వెల్లడించింది.

Read More : దేశ ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న హలాల్ సంస్థలు

ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియా దౌత్యవేత్తలు, ముస్లిం మతాధికారులు చైనాలో పంది మాంసం వడ్డిస్తుండటంతో విమానంలో నుంచి దిగిపోయారు. కోవిడ్‌ -19 టీకాలు ఇండోనేషియా పౌరులకు చేరేలా ఒప్పందాలను చేసుకోవడానికి మలేషియా దౌత్యవేత్తలు చైనాకు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. షరియాత్‌ చట్టాలకు అనుగుణంగా హలాల్‌ చేసిన వాక్సిన్‌లను తయారు చేయాలని ఇస్లామిక్‌ మతాధికారుల నుండి తీవ్రమైన డిమాండ్ ఎదురవుతోంది.

Read More: మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన

ప్రపంచం మొత్తంలో అన్ని ఇస్లామేతర దేశాల్లోని ఔషధ కంపెనీలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మహమ్మారిని ఎదుర్కొవడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఎంతో మంది ఉపాధి కొల్పొయి నిరద్యోగులుగా మారారు. ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు కృషి చేస్తుంటే మరో వైపు ఇస్లామిక్‌ మతాధికారులు హలాల్‌ కానందున టీకాలను బహిష్కరిస్తామని బెదిరించడం గమనార్హం.

Source : Kreately