దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్య వెనుక వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్ ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం తమ తిరుభువనం ప్రాంతంలో ప్రవేశించిన ఇస్లామిక్ మతమార్పిడి ముఠాను ఎదుర్కొనే క్రమంలో వాదన జరిగింది. వచ్చిన గ్రూప్ సభ్యులు ఇస్లాంలోకి మారాల్సిందిగా రామలింగాన్ని కోరడంతో అతడు ఆ సభ్యుల్లోని ఒక వ్యక్తి వద్దనుండి ఇస్లామిక్ టోపీని తీసుకుని తాను ధరించడంతో పాటు, ఎదుటి వ్యక్తి నుదుటికి విభూతి రాయడానికి ప్రయత్నం చేసాడు. దీన్ని అతడు తిరస్కరించడంతో ‘నేను ఇస్లాంను గౌరవించి మీ టోపీ ధరించినప్పుడు మీరెందుకు మా ధర్మాన్ని గౌరవించి విభూతి పెట్టుకోరు?” అని ప్రశ్నించడంతో వాగ్వివాదం మరింత పెరిగింది. అనంతరం రామలింగం వారిని మీరు నిజమైన ముస్లిములు కాదని, వారు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తమ ప్రాంతంలో మతమార్పిళ్లకు పాల్పడకుండా వెళ్లిపోవాల్సిందిగా కోరాడు.
ఈ ఘటన అయిపోయిన తరువాత అదేరోజు సాయంత్రం రామలింగం తన బైక్ రిపేర్ కోసం తన కొడుకుతో పాటు మెకానిక్ వద్దకు వెళ్లి వస్తుండగా సమీపంలోని మసీదు వద్దకు రాగానే కొందరు దుండగులు ఎదురుగా కార్లో వస్తూ వీరిని అడ్డగించారు. కార్లో నుండి ఇద్దరు కిందకి దిగగా వారి చేతుల్లో కారంపొడి, కత్తులు ఉన్నాయి. వారు మొదట రామలింగం కొడుకుపై దాడి చేయడానికి ప్రయతించగా అతడు కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో చేతికి కత్తి గాయాలయ్యాయి. ఈక్రమంలో రామలింగం దుండగులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో అనేక చోట్ల కట్టుపోట్లకు గురయ్యాడు. చావుబతుకుల్లో ఉన్నరామలింగాన్ని తన కొడుకు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది వైద్యానికి నిరాకరించడంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు సాధారణ చికిత్స చేసి తాజావారు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తంజావూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే రక్తం అధికంగా పోవడంతో రామలింగరాజు మార్గమధ్యలో మరణించాడు.
చనిపోయే ముందు రామలింగం తనపై దాడికి పాల్పడినవారు అదే గ్రామానికి చెందిన రివాజుద్దీన్ అనే వ్యక్తికి బంధువులు అని తన కొడుకుకి తెలియజేశాడు.
రామలింగం మరణ వార్తతో పాటు క్రితం రోజు అతడు ఇస్లామిక్ మతమార్పిడి మాఫియాతో జరిగిన వాగ్వివాదం తాలూకు వీడియో దావానంలా వ్యాపించాయి. అతడి భార్య చిత్ర ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రామలింగానికి వ్యాపారంలో కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులెవరూ లేరు. తనపై దాడికి చేసింది రిజాజుద్దీన్ బంధువులేనన్న విషయం మరణించే ముందు తన తండ్రి చెప్పినట్టు అతడి కొడుకు మీడియాకు వెల్లడించాడు. కేవలం ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకున్నందుకు తన భర్తను హత్యచేశారని, అది టప మరే ఇతర కారణాలు లేవని అతడి భార్య తెలియజేసింది.
ప్రాథమిక విచారణ అనంతరం హత్యతో సంబంధం ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన షరాబుద్దీన్, మొహమ్మద్ రిజవ్వాన్, మొహమ్మద్ రియాస్, నిజాం అలీ, అజారుద్దీన్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి అరెస్ట్ అనంతరం తిరుభువనం మసీదు అధికారులు అరెస్ట్ అయిన ఐదుగురు నిందితుల సహాయార్ధం తమ రాబడిలో 2 శాతం విరాళంగా ఇవ్వాల్సిందిగా (జమాత్) నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబానికి అన్నివిధాలా సహాయం చేసేందుకు వాలంటీర్లను కూడా నియమించారు.
రామలింగం వ్యక్తిగత జీవితం:
తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన రామలింగం వయసు 45 సంవత్సరాలు. ‘తాళిమన్ క్యాటరర్స్’ పేరిట పెళ్లిళ్లకు కేటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. స్థానిక పీఎంకే పార్టీ క్రియాశీలక కార్యకర్తగా కూడా ఉన్న రామలింగానికి అతడి కుటుంబ సభ్యులు క్యాటరింగ్ వ్యాపారంలో సహకారం అందించేవారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే రామలింగానికి ముస్లిములలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. జమైల్ ముహయుద్దీన్ హిజ్రీ అనే వ్యక్తి అతడికి వ్యాపారంలో సహాయం చేయడంతో పాటు తన వ్యాపార ప్రారంభోత్సవాన్ని కూడా అతడి చేతుల మీదుగానే చేసినట్టు రామలింగం తన ఫేస్బుక్ పోస్టులో స్పష్టంగా పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ముస్లిం మిత్రుడికి చెందిన ‘ఫ్రెష్ ఫ్రెష్’ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న విషయాన్నీ కూడా అతడు ఫేసుబుక్లో పేర్కొన్నాడు.
రాజకీయ పార్టీల స్పందన:
రామలింగం హత్య జరిగిన వెంటనే ముందుగా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఘటనను ఖండించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. రాజా హుటాహుటిన రామలింగం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీఎంకే పార్టీ వ్యవస్థాపకులు రామదాస్ జరిగిన ఘటనను ఖండించినప్పటికీ ఆ పార్టీ ఇంఛార్జ్ అన్బుమణి మాత్రం తమ పార్టీ కార్యకర్త హత్యపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అనంతరం సోషల్ మీడియా ద్వారా యావత్ దేశమంతటా రామలింగం హత్యపై ఆగ్రహజ్వాలలు అధికమవుతున్న సమయంలో అది గమనించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామలింగం హత్యను ఖండిస్తూ సందేశం పోస్ట్ చేశారు. కానీ నిందితులకు వ్యతిరేకంగా ఒక్క మాటా అనలేదు.