Home News పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించిన జార్ఖండ్

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించిన జార్ఖండ్

0
SHARE
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద జార్ఖండ్ ప్రభుత్వం మరోసారి నిషేధం విధించింది. కరుడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’తో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధాలు ఉన్న కారణంగా మరోసారి నిషేధం విధిస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
జార్ఖండ్ ప్రభుత్వం పీఎఫ్ఐ మీద మొదటిసారి గత సంవత్సరం (2018) ఫిబ్రవరి 20న నిషేధం విధించింది. అనంతరం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిషేధం తొలగించబడింది.
పాకూర్ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పీఎఫ్ఐ సభ్యులకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నాయని, ఈ సంస్థ సభ్యులు గతంలో సిరియా కూడా వెళ్లి అక్కడ ఐఎస్ సంస్థ కోసం పనిచేస్తున్నారని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో తెలియజేసింది.